అనంతపురం

ముగిసిన చంద్రవౌళేశ్వరస్వామి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, మార్చి 9 : పట్టణంలో ప్రసిద్ధిగాంచిన కరిబసప్ప స్వామి గవిమఠంలో వెలిసిన చంద్రవౌళేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఇందులో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవలో భాగంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, పూజలు నిర్వహించారు. చంద్రవౌళేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అశ్వవాహనంపై స్వామివారిని కొలువుదీర్చి బాజాభజంత్రీల నడుమ గవిమఠం నుంచి ఎదురు బసవన్న గుడి వరకూ ఊరేగించారు. ఉత్సవాన్ని తిలకించడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం వసంతోత్సవం నిర్వహించారు. అలాగే పట్టణానికి చెందిన శిరుగుప్ప నాగరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో 8వ పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వాములు, సహాయ కమిషనర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా రాతిదూలం లాగుడు పోటీలు
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్టస్థ్రాయి రాతిదూలం లాగుడు పోటీలను ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. ఈ పోటీల్లో 5 జతల వృషభాలు పాల్గొన్నాయి. కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలంలోని పిఆర్ పల్లి గ్రామానికి చెందిన నాగయ్య ఎద్దులు 1976 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆత్మకూరు మండలంలోని మదుగుప్పకు చెందిన మాధవరాజు వృషభాలు 1387 అడుగులు లాగి ద్వితీయ స్థానం, పిఆర్‌పల్లికి చెందిన చిన్ననాగులు వృషభాలు 1321 అడుగులు లాగి ద్వితీయ స్థానం, అదే గ్రామానికి చెందిన కోటేశ్వర్ ఎద్దులు 1320 అడుగులు లాగి నాల్గవస్థానం, కిష్టన్న వృషభాలు 1292 అడుగులు లాగి 5వ స్థానంలో నిలిచాయి. ప్రథమ బహుమతి సాధించిన నాగయ్యకు రాఘవేంద్ర ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్ నర్రాకేశన్న రూ. 40వేలు బహుమతి అందజేశారు. 2వ బహుమతి సాధించిన మాధవరాజుకు లత్తవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు రూ.25వేలు, 3వ బహుమతి సాధించిన చిన్ననాగులుకు రేగాటి నాగరాజు రూ.15వేలు, నాల్గవ బహుమతి సాధించిన కోటేశ్వర్‌కు వెలిగొండ బషప్ప రూ 10 వేలు, 5వ బహుమతి సాధించిన కిష్టప్పకు శంకరప్ప రూ. 2వేల నగదును అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంపిపి సుంకరత్నమ్మ, సిపిఐ నాయకులు శివన్న, రైతు సంఘం నాయకులు శంకరప్ప, రామంజినేయులు, లత్తవరం మాజీ సర్పంచ్ బోదపాటి గోవిందు, దండాప్రసాద్, భాస్కర్ పాల్గొన్నారు.
గవిమఠం ఉత్తరాధికారి తొలగింపు
ఉరవకొండ, మార్చి 9 : పట్టణంలోని కరిబసవస్వామి గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర స్వామిని ఉత్తరాధికారిగా పదవి నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు పీఠాధిపతి జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వాములు తెలిపారు. గురువారం స్థానిక గవిమఠంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజేంద్ర స్వామిపై ఆరోపణలు రావడంతో తొలగించగా కోర్టును ఆశ్రయించారన్నారు. కోర్టులో ఆయన అర్జీని కొట్టివేసినట్లు తెలిపారు. గవిమఠం సంస్థానం, కరిబసవ రాజేంద్ర స్వామికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన స్థానంలో త్వరలో కొత్త గవిమఠం ఉత్తరాధికారిని నియమిస్తామన్నారు.