అనంతపురం

ఆరెకటికలను ఎస్సీ జాబితాలో చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, మార్చి 11: సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడిన ఆరెకటిక కులస్థులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆరెకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాంబాబా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు నగరానికి వచ్చిన ఆయన శనివారం ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడారు. ఆరెకటిక కులస్థులు అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి డిమాండ్లను సాధించుకునేందుకు ఆరెకటికలు ఐకమత్యంతో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఆరెకటికలు స్వయం శక్తితో ఎదుగుతూ పోరాటాలు చేయాలన్నారు. అనంతరం పాతవూరు ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఏర్పాటుచేసిన ఉచిత కుట్టుశిక్షణ శిబిరాన్ని శివరాంబాబా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణరావు, నగర అధ్యక్షులు మంజునాథరావు, నాయకులు సాయినాథ్‌రావు, శ్రీ్ధర్‌రావు, నాగరాజరావు, గోపి ఆనంద్, మోతిలాల్, శాంతోజిరావు, క్రిష్ణచరణ్, మణి, శాంతారావు,సరస్వతిబాయి, కార్పొరేటర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

శ్రీ చైతన్య పాఠశాలలో హోలీ సంబరాలు
పామిడి, మార్చి 11: పిల్లల జీవితాలు సంతోషాలతో రంగులమయం కావాలని శ్రీ చైతన్య పాఠశాల డైరెక్టర్ సంతోష్‌రెడ్డి ఆకాంక్షించారు. స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ హిందువులంతా సాంప్రదాయబద్దంగా రంగులు చల్లుకుంటూ సంతోషంతో పిల్లలు, పెద్దలంతా ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో హోలీది మొదటిస్థానమన్నారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు
విసి పదవి ఇవ్వాలి

అనంతపురం సిటీ, మార్చి 11: జెఎన్‌టియూ అనంతపురం విసి పదవిని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఇవ్వాలని సామాజిక హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు డి.జగదీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సామాజిక హక్కుల వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ జెఎన్‌టియూ అనంతపురం విసి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఖాళీగా ఉన్న విసి పదవిని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఈ నెల 15న అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తుందని, రెండు రోజులపాటు జిల్లాలో పర్యటిస్తుందన్నారు. 18న అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజి మైదానంలో ప్రజా చైతన్య యాత్ర ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ బహిరంగ సభను జిల్లాలోని సామాజిక కులల నాయకులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక హక్కుల వేదిక నాయకులు వెంకటేసు, లింగమయ్య, జాకీర్ హుస్సెన్, శ్రీరాములు, అల్లీపీరా, మల్లికార్జున, బి.నారాయణస్వామి పాల్గొన్నారు.