అనంతపురం

హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన ఖాద్రీశుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, మార్చి 11: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు హనుమంత వాహనంపై తిరువీధుల్లో శనివారం రాత్రి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన రామావతారంలో రాక్షస సంహారం అనంతర ం రామలక్ష్మణులను హనుమంతుడు తన భుజస్కంధాలపై ఎత్తుకొని భక్తిని చాటుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇదే సందర్భంలో నరసింహావతారంలోనూ కిరణ్యకశ్యపుడి సంహా రం తర్వాత శ్రీమహావిష్ణువును హనుమంతుడే సాక్షాత్తు దిగివచ్చి తన భు జాలపై మోస్తాడన్నది కూడా భక్తుల వి శ్వాసం. శ్రీవారిని దర్శించుకోలేకపోయిన భక్తుల కోసం స్వామివారే వారికి దర్శనభాగ్యం కల్పించేందుకు తిరువీధుల్లో దర్శనమివ్వడం ఆనవాయితీగా వస్తోంది. అంతకుముందు ఉదయం స్వామివారికి తిరువీధుల్లో మంటపోత్సవాన్ని నిర్వహించారు. హనుమంత వాహన కార్యక్రమానికి ఉభయదారులుగా జొన్నా వీరయ్య, జొన్నా వీరశేష య్య కుటుంబ సభ్యులు వ్యవహరించగా, పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఈఓ వెంకటేశ్వరరెడ్డితోపాటు పాలక మండలి సభ్యు లు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు బ్రహ్మగరుడ సేవ జరుగుతుంది.
విద్యుత్ అలంకరణలో దేవతల రూపాలు
శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుద్దీపాల దేవతామూర్తుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పట్టణంలోని వేమారెడ్డి, టవర్‌క్లాక్, హిందూపురం క్రాస్, తేరు వద్ద, ఎక్బాల్ రోడ్డు, కోనేరు వద్ద, ఆర్టీసీ బస్టాండ్, జీవిమాను కూడళ్లలో విద్యుత్ అలంకరణలో దేవతామూర్తులైన సీతారామ లక్ష్మణ ఆంజనేయ, లక్ష్మిదేవి, కుమారస్వామి, షిర్డిసాయి, దుర్గామాతా, సరస్వతీ దేవి ప్రతిమలు విద్యుద్దీపాలతో ఏర్పాటుచేశారు. రాత్రివేళల్లో ఈ ప్రతిమలు విద్యుద్దీపాలతో ధగధగలాడుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మండుతున్న ఎండలు
* అల్లాడుతున్న జనం
అనంతపురం కల్చరల్, మార్చి 11: భానుడు భగభగ మండుతూ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత రోజు రోజుకు అధికమవుతోంది. ఉష్ణోగ్రత పెరుగుదలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8గం.లకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఎండ నుండి రక్షణ పొందడానికి జనం నానా అవస్థలు పడుతున్నారు. వేసవితాపం నుండి సేద తీరేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా బయట దొరకక జనం శీతలపానీయ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. చల్లటి నీటిని అందించే చలివేంద్రాల కోసం జనం ఎదురుచూస్తున్నారు.
కాటికోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బత్తలపల్లి, మార్చి 11: మండలంలోని సంజీవపురం వద్ద వెలసిన కాటికోటేశ్వర క్షేత్రంలో ప్రాచీన సంస్కృతికి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇక్క డ స్వామి సాక్షాత్తూ మహాశివుని స్వ రూపమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్సవాలను రెడ్డివారి బోనాలతో ప్రారంభిస్తారు. ఈ నెల 11న రెడ్డివారు తొలి పూజలు చేయడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 12వ తేదీ మూలస్థానమైన ముష్టూరు నుండి స్వామివారిని పల్లకీలో కాటికోటేశ్వర క్షేత్రానికి చేర్చుతారు. 13న వేల సం ఖ్యలో భక్తులు కలవడమే కాక సమీప గ్రామాల నుండి ఎద్దులబండ్లతో ప్రదక్షిణలు నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి బాణసంచాలు కాల్చడంతో లంకాదహనంగా పిలువబడుతుంది. 14వ తేదీన రథోత్సవం నిర్వహించి అనంతరం జాతర నిర్వహిస్తారు.
ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు...
కాటికోటేశ్వర క్షేత్రంలో శనివారం బ్రహ్మోత్సవాలను వేదపండితులు ధనుంజయ శర్మ పూజలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలతో కాటికోటేశ్వరున్ని శుద్ధి చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్ విరూపాక్షరెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబిరెడ్డి, రవీంద్రారెడ్డి, నరసింహారెడ్డి, శైలజ, నాగమణి, ఆలయ అర్చకులు కొండన్న, సాలప్ప హాజరయ్యారు.
వ్యవసాయ క్షేత్రంలో మంత్రి సునీత
రామగిరి, మార్చి 11: పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత శనివారం తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. వ్యవసాయ క్షేత్రంలో నాటిన వరి, పశుగ్రాసం కోసం వేసిన జొన్న పంటలను మంత్రి పరిశీలించారు. గత కొన్ని రోజులుగా మంత్రి విధి నిర్వహణలో విరామం లేకుండా వుండడంతో రెండు రోజులుగా వెంకటాపురంలోనే వున్నారు. దీంతో ఆమె శనివారం తన పంటలను పరిశీలనకు వెళ్ళారు. తన తండ్రి కొండన్నతో పంటల గురించి తెలుసుకున్నారు.
భక్తులతో పోటెత్తిన
కావమ్మ, మారయ్య ఆలయం
నంబులపూలకుంట, మార్చి 11: కావమ్మ, మారయ్య ఉత్సవాల్లో భాగంగా శనివారం రెండో రోజు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయం సన్నిధిలో కావమ్మ, మారయ్యల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయం నుండి కల్యాణ వేదికకు ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చే సమయంలో వేదపండితుల మధ్య వేదికపైకి తీసుకొచ్చి వేదమంత్రోత్సాల మధ్య కల్యాణం జరిపించారు. ఈ కల్యాణోత్సవాన్ని వందలాది మంది భక్తులు తిలకించారు. రాత్రి అమ్మవారి జీవిత చరిత్ర బుర్రకథ రూపంలో వివరించారు. కావమ్మ, మారయ్యలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు.