అనంతపురం

బాబ్బాబు.. పన్ను చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, మార్చి 18 : కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీకి చెందిన ప్రముఖులే పన్నులు చెల్లించనట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు వారి వద్దకు వెళ్లి పన్నులు చెల్లించాలని అడగాలంటే జంకుతున్నట్లు సమాచారం. చేసేది లేక వారు ఇచ్చిన కాడికి తీసుకుని వెనక్కి తిరుగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులు పన్నులు చెల్లించకుంటే సీజ్ చేసి తడాఖా చూపే అధికారులు బడాబాబులు, అధికార పార్టీకి చెందిన వారి పట్ల ఎందుకు ఉదాసీనత చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయ. మొండి బకాయిలు చెల్లించాల్సిన వారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిను ముఖ్యులు ఉండటంతో కొళాయి కనెక్షన్లు తొలగించటానికి సాహసించడం లేదు. అంతేగాకుండా ముఖ్యనేతల వద్దకు స్వయానా ఉన్నతాధికారులతో కలిసి వెళ్లి పన్నులు కట్టమని ప్రాధేయపడుతున్నారు. పన్ను నిర్ధారణ సరిగా చేయలేదన్న సాకుతో ఓ ముఖ్యుడు కొనే్నండ్లుగా పన్నులు కట్టనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతకు చెందిన ఐదంతస్తుల భవంతికి పన్ను కట్టమని శనివారం కలిసి విన్నవించుకోగా దాదాపు రూ.30 లక్షలు చెల్లిచాల్సిన చోట కేవలం రూ.5 లక్షలు చెల్లించనట్లు సమాచారం. మిగతా బకాయిలను పన్ను నిర్ధారణ సక్రమంగా వేసిన తర్వాత కడతానని సెలవియ్యడంతో సరేనంటూ అధికారులు వెనుతిరిగారు. అలాగే అనంతపురం క్లబ్ పన్ను బకాయిలు రూ.రెండున్నర లక్షలకు అరవై వేలు చెల్లించారు. మిగతా బకాయిలు రెండు రోజుల్లో చెల్లిస్తామని చెప్పారు. బల్లా సురేష్‌కు చెందిన సప్తగిరి లాడ్జికి చెందిన లక్షా తొంభై తొమ్మిది వేల రూపాయల పన్ను బకాయిలను రెండు రోజుల్లో చెల్లిస్తామని తెలిపినట్లు అదనపుకమిషనర్ తెలిపారు. తర్వాత జడ్.పి కార్యాలయానికి ఎదురుగా ఉన్న శ్రీసాయికృష్ణ ఫంక్షన్ హాలు బకాయిలు ఐదున్నర లక్షల రూపాయలు చెల్లించాలని నిర్వాహకుడు పరుచూరి రమేష్‌ను కోరగా మినహాయింపు ఉందని చెబుతూ పన్ను చెల్లించటానికి నిరాకరించారు. అంతేగాకుండా రమేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు తమనెవరూ పన్నులు చెల్లించాలని కోరలేదన్నారు. తాము సేవాభావంతో రూ.2500కే ఫంక్షన్ హాలు అద్దెకు ఇస్తున్నామన్నారు. అంతేగాకుండా పన్ను మినహాయింపు ఉత్తర్వులు తెచ్చుకుంటామని అధికారులకు బదులిచ్చారు. దీంతో అదనపుకమిషనర్ పగడాల కృష్ణమూర్తి, ఆర్‌ఐలు మురళి, రాంబాబు, డిఇఇ కిష్టప్ప తదితరులు రమేష్‌కు చెందిన శ్రీనివాస క్లాత్‌షోరూమ్ వద్ద బైఠాయించారు. అలాగే ముఖ్యనేతలకు చెందిన విద్యాసంస్థలు, భవంతులు, ఫంక్షన్ హాల్స్ తదితరాలకు సంబంధించి పెద్ద మొత్తంలో బకాయిలు వసూలు కావాల్సి ఉంది. అయితే వారిని గట్టిగా గదమాయించి అడగలేక ఇచ్చినదే మహదేవా అంటూ అధికారులు చెల్లించిన సొమ్మును రాబట్టుకుని వెనుతిరుగుతున్నారు. ఇప్పటికైనా మొండి బకాయిల వసూళ్లలో పక్షపాతం చూపకుండా అందరితో సమానంగా వసూలు చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
బడుగుల వ్యతిరేక
ప్రభుత్వాలపై ఉద్యమిద్దాం
* సామాజిక హక్కుల వేదిక సభలో నాయకులు
అనంతపురం సిటీ, మార్చి 18 : బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వాలపై ఉద్యమిద్దామని సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో జనవరి 16న శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన బస్సుయాత్ర శనివారం అనంతపురంలో ముగిసింది. ఈ సందర్భంగా సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జగదీష్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ నాయకులతో కలసి నగరంలోని తెలుగుతల్లి విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ మీదుగా ఆర్ట్స్ కళాశాల మైదానం వరకూ భారీగా ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామకృష్ణతోపాటు కేరళ వ్యవసాయశాఖ మంత్రి సునీల్‌కుమార్, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, కర్నాటక ఎమ్మెల్యే వర్తారూ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రవర్ణాల అధిపత్యానికి అణగారిన వర్గాలు చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగులను విద్య, వైద్య, ఆర్థిక, సామాజికంగా చైతన్యం చేసేందుకే సామాజిక హక్కుల ముఖ్య ఉద్దేశమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పార్టీల అభివృద్ధి, కులాభివృద్ధి చేసుకునేందుకే తప్ప ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చేందుకు కృషి చేయడం లేదన్నారు. ప్రభుత్వాలు పేదల నుంచి ఓట్ల వేయించుకుని చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క పేదవానికీ ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలోని మంత్రి వర్గంలో గిరిజనులు, మైనార్టీలు లేరన్నారు. రానున్న రాబోవు మంత్రి వర్గ విస్తరణలో తప్పకుండా గిరిజనులు, మైనార్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహంచే ఈ ఉద్యమం ప్రారంభమే అని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు జాఫర్, ఎంఎస్.రాజు, రమేష్‌గౌడ్, బోరంపల్లి ఆంజినేయులు, నూర్‌మహమ్మద్, ఇతర నాయకులు, వివిధ కులాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో
కార్పొరేట్ పాఠశాల సిబ్బంది!
* పది తెలుగు పేపర్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు
* ఒత్తిళ్లతో పోలీసుల తర్జనభర్జన
హిందూపురం, మార్చి 18 : పదో తరగతి తెలుగు పేపర్-1 వాట్సప్‌లో హల్‌చల్ చేసిన ఘటనకు సంబంధిం చి శనివారం మడకశిరలో నలుగురిని అరెస్టు చేయగా హిందూపురంలోని ఓ కార్పొరేట్ పాఠశాలకు చెందిన ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్ర శ్నపత్రం లీకేజీ వ్యవహారం వెనుక కార్పొరేట్ స్థాయిలో వ్యవహారాలు సా గినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిలమత్తూరుకు చెందిన ట్యూటర్ ఇలియాజ్ అహ్మద్ సెల్‌ఫోన్‌కు అటు జనరల్ ఇటు కంపొజిట్ తెలుగు ప్రశ్నపత్రాలు ఇతరుల వాట్సప్ ద్వారా వచ్చినట్టు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నట్లు సమాచారం. కంపొజిట్ తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ తతంగం వెనుక స్థానిక ఓ కార్పొరేట్ పాఠశాల సిబ్బంది హస్తం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లు అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భా గంగా శనివారం మధ్యాహ్నం పోలీసు సిబ్బంది మఫ్టీలో వెళ్లి ఓ కార్పొరేట్ పాఠశాలకు చెందిన ఇద్దరిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ సాగిస్తున్నట్లు సమాచారం.