అనంతపురం

పండుగ పిలుస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, మార్చి 19 : త్వరలో ఉగాది పండుగ రానునండటంతో వలస వెళ్లిన కూలీలు సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. దీంతో ఆయా గ్రామాల్లోని వృద్ధ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనంది వెల్లివిరుస్తోంది. ఊరుకాని ఊరిలో కంటినిండా నిద్రలేకుండా, కడుపునిండా తిండిలేకుండా కాయాకష్టం చేస్తూ ఇతర ప్రాంతాల్లో అవస్థలు పడుతున్న వలస కూలీలు ప్రస్తుతం ఊళ్లలో సొంతవాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. ఈనెల 28న ఉగాది పండుగ కావడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే చాలామంది ఊళ్లకు చేరుకున్నారు. ఎందుకంటే జిల్లాలోని కదిరిలో ప్రతి ఏటా అత్యంత మహోత్సవంగా జరిగే లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం ఎంతో ప్రతిష్టను సంతరించుకుంది. ఈబ్రహ్మోత్సవాలను కదిరి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లోనూ తిరునాళగా పిలుస్తారు. కదిరి ప్రాంతంలోని అన్నిగ్రామాల వారు ఈపండుగను భక్తిశ్రద్ధలుగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన ఘట్టంగా జరుపుకునే రథోత్సవాని (తేరు)కి కదిరి, గోరంట్ల, హిందూపురం ప్రాంతాల్లో లక్ష్మీనరసింహస్వామిని తమ ఇంటిదేవుడిగా కొలుస్తారు. ఈనేపథ్యంలో నిన్న రథోత్సవం జరగడంతో భారీగా స్వామిదర్శనానికి వెళ్లారు. అయితే తేరు అయిపోగానే దగ్గరలోనే ఉగాది ఉండటంతో అప్పటి వరకూ గ్రామాల్లోనే ఉంటారు. ఇప్పటికే చాలామంది తమ ఇళ్ల వద్ద ఉండే వృద్ధ తల్లిదండ్రులతోపాటు బిడ్డలకు కొత్త దుస్తులు తీసుకొచ్చారు. కొన్ని మాసాలుగా ఊళ్లను వదిలి వెళ్లిన వారు ప్రస్తుతం రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అందరినీ కలుసుకుంటూ కుశల ప్రశ్నలేసుకుంటూ ఆనందంతో గడుపుతున్నారు. ఇంకా బెంగుళూరులోని పలు ప్రదేశాల్లో చేసుకుంటున్న వారిని ఫోన్ ద్వారా ఆరాతీస్తున్నారు. ఏదిఏమైనా అతి పెద్ద పండుగ కావడంతోపాటు హిందువులకు నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది పల్లెల్లో అందరినీ ఇళ్లకు చేర్చబోతోందని చెప్పవచ్చు.
సంతోషంగా ఉన్నా..
- వృద్ధురాలు సాలెమ్మ...
నాకు వయసుమళ్ళింది.. నడవలేను.. నాకొడుకు నారాయణస్వామి కుటుంబ పోషణ కోసం బెంగళూరుకు వెళ్లి కూలి పని చేస్తున్నాడు. పండుగ కావడంతో ఇంటికి వచ్చాడు. నాకెంతో ఆనందంగా ఉంది. నాచివరి రోజుల్లో నాబిడ్డ నాదగ్గరే ఉంటే బాగుంటుందనుకున్నా. ఏంచేద్దాం.. ఇంట్లో అందరూ బాగుండాలంటే వాడు పని చేయక తప్పదు. ఇక్కడ ఏం పనులు లేక వలస పోవాల్సి వంచ్చింది...
తప్పని పరిస్థితుల్లో వలస...
- నరసింహులు, కుటాలపల్లి ఎస్సీకాలనీ..
మా అమ్మకు కళ్లు కనిపించవు.. కాళ్లు ఉన్నా నడువలేదు... ఇంటివద్దే వదిలేసి బెంగుళూరుకు వలస వెళ్లొచ్చా.. మా ఇంటి చుట్టుపక్కల వాళ్లే అమ్మకు అంత ముద్దపెట్టేవారు. వలస వెళ్లకపోతే భార్యా, పిల్లను పోషించడం కష్టం. కని పెంచిన పెద్ద చేసిన అమ్మను చివరి రోజుల్లో బాగా చూసుకోవాల్సిందిపోయి ఇంటికి కాపలాగా ఉంచా.. తలుచుకుంటేనే బాధ కలుగుతుంది.. ఏం చేస్తాం.. తప్పదు...