అనంతపురం

నేటితో ఉత్కంఠకు తెర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 19 : పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉత్కంఠంకు నేడు తెరపడనుంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలో ఎమ్మెల్సీ ఓట్లు లెక్కించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. కాగా కౌంటింగ్ సందర్భంగా గెలుపోటములపై అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టిడిపి, వైకాపా, రెండోసారి బరిలో దిగిన అభ్యర్థులతోపాటు ప్రధాన అభ్యర్థులుగా రంగంలో ఉన్న వారు పోలైన ఓట్లు, మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు అంచనా వేసుకుని గెలుపు తమకేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఆయా పార్టీ లు, తమకు అనుకూలంగా ఉన్న అభ్యర్థులపై అనేక మంది రూ.లక్ష ల్లో బెట్టింగ్ కాసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అభ్యర్థులు, అనుచరులు పెద్దఎత్తున అనంతపురం తరలి వస్తున్నారు. పట్ట్భద్రుల ఎన్నికల్లో 25 మంది అభ్యర్థులు పోటీ పడగా, ఉపాధ్యాయ స్థానానికి 10 మంది పోటీ పడి న విషయం తెలిసిందే. పట్ట్భద్రుల స్థానానికి మొత్తం 2,49, 582 ఓట్లు ఉండగా, 1,55,536 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యాయ స్థానానికి 20,515 ఓ ట్లు ఉండగా, 18,739 ఓట్లు పో లయ్యాయి. పట్ట్భద్రుల ఎమ్మె ల్సీ స్థానానికి టిడిపి అభ్యర్థి కెజె రెడ్డి, వైకాపా నుంచి వెన్నపూస గోపాల్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, కాంగ్రెస్ అభ్యర్థి మాసూలు శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఎస్ తరఫున బిజెపికి చెందిన ఇల్లూరు ఉమాకాంతరెడ్డి, ఇతర ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. తమలో ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ ఉందని, తాము వేసుకున్న లెక్కల మేరకు తామే గెలుస్తామని ఆయా అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీరిలో టిడిపిని, ఆ పార్టీకి అండగా ఉన్న బిసి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమ్ముకున్న కెజె రెడ్డి, వైకాపాతో పాటు తన సేవలే తనను గెలిపిస్తాయన్న విశ్వాసంతో ఉన్న గోపాల్‌రెడ్డి, తొలిసారి తాను గెలవడంతో ప్రజలకు చేసిన సేవలతో తనకు రెండోసారి ఓటర్లు అవకాశం కల్పిస్తారన్న ఆశాభావంతో సిపిఎం, పలు సంఘాల మద్దతుతో బరిలో దిగిన డాక్టర్ గేయానంద్ తమదే గెలుపు అన్న నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాసూలు శ్రీనివాసులు కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల వైఖరి నచ్చక, సిట్టింగ్ ఎమ్మెల్సీకి ఓటర్లు రెండోసారి అవకాశం కల్పించకపోవచ్చన్న అంచనాలతో పోటీ చేశారు. కాగా ఇద్దరు, ముగ్గురికి మినహా మిగతా అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి లేకపోలేదు. ఇక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి రెండోసారి పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య తనకే విజయం వరిస్తుందని ఆశిస్తున్నారు. ఎస్‌టియూ, కొన్ని ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో పోటీ పడిన రిటైర్డ్ టీచర్ కత్తి నరసింహారెడ్డి, ఎపిటిఎఫ్ అభ్యర్థి రఘురామయ్య కూడా తమకే విజయం వరిస్తుందని ధీమాగా ఉన్నారు. అలాగే పలు ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిగా ఒంటేరు శ్రీనివాసులు విజయావకాశాలు తనకే ఉన్నట్లు విశ్వాసంతో ఉన్నారు. వీరితో పాటు మిగతా అభ్యర్థులు బరిలో ఉన్నా అరకొరగానే ఓట్లు పడి ఉంటాయన్నది నిర్వివాదాంశం. వీరిలో కత్తి నరసింహారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులు, బచ్చల పుల్లయ్య తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. కాగా టిడిపి అభ్యర్థిగా రంగంలో దిగిన బచ్చల పుల్లయ్యపై ఉన్న వ్యతిరేకత, రెండోసారి అవకాశం ఇవ్వక పోవడం వంటి కారణాలను మిగతా అభ్యర్థులు విశే్లషిస్తున్నారు. దీంతో కత్తి నరసింహారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులు, రఘురామయ్య మధ్య గెలుపోటములు ఉండొచ్చని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.
మూడు దశల్లో ఓట్ల లెక్కింపు
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మూడు దశల్లో జరగనుంది. ఎన్నికల అధికారులు తెలిపిన మేరకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పట్ట్భద్రుల స్థానం ఓట్ల లెక్కింపునకు 26 టేబుళ్లు, ఉపాధ్యాయ స్థానం లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు ఆరుగురు సిబ్బందిని నియమించారు. కాగా పట్ట్భద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు ఓట్ల లెక్కింపు ఒకే తీరుగా ఉంటుంది. తొలుత ప్రాథమిక లెక్కింపు(ఇనిషియల్ కౌంటింగ్) ఉంటుంది. తొలి దశలో మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. అంటే ఏ అభ్యర్థికి తొలి ప్రాధాన్యత ఓటు వచ్చిందో ఆ మేరకు గణిస్తారు. తర్వాత సమగ్ర లెక్కింపు తొలి ప్రాధాన్య ఓట్లు ఎన్ని వచ్చాయన్నది లెక్క గడతారు. మూడో దశలో వ్యాల్యూడ్ ఓట్లను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. ఈ క్రమంలో తొలుత మొత్తం ఓట్లలో 50 శాతానికి పైగా తొలి ప్రాధాన్యతలో వచ్చిన ఓట్లకు ఒక ఓటు కలిపితే వచ్చే ఫలితాన్ని బట్టి అభ్యర్థి గెలుపును నిర్ధారిస్తారు. ఉదాహరణకు.. పట్ట్భద్రుల స్థానానికి 1,55,530 ఓట్లు పోలయ్యాయి. వీటిలో వ్యాలీడ్ ఓట్లు పరిగణలోకి తీసుకుంటారు. అన్నీ వ్యాలీడ్ ఓట్లు అనుకుంటే.. అందులో సగం అంటే 77,765 ఓట్లు వచ్చి తొలి ప్రాధాన్యతలో వచ్చి ఉంటే, సమీప అభ్యర్థికి అంతకన్నా తక్కువ ఉంటే తొలి అభ్యర్థిదే గెలిచినట్లు నిర్ధారిస్తారు. అయితే 50 శాతం కన్నా తక్కువగా ఓట్లు పోలై ఉన్నట్లుయితే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఇందులోనూ 50 శాతం కన్నా ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ తక్కువగా ఓట్లు వచ్చి ఉంటే మూడో ప్రాధాన్యత ఓటును లెక్క గడతారు. ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే ఎలిమినేషన్ రౌండ్‌లో అభ్యర్థుల్ని ఒక్కొక్కరిగా తొలగించుకుంటూ వస్తారు. ఆఖరులో మిగిలిన ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి అధిక ఓట్లు వచ్చి ఉంటాయో వారిని విజేతగా ప్రకటించేలా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది.

సంఘటితంగా హక్కులు సాధించుకుందాం
* రాజకీయాలకతీతంగా పోరాడుదాం
* రాష్ట్ర బ్రాహ్మణ సంఘం సమావేశంలో నేతలు
హిందూపురం, మార్చి 19 : హక్కుల సాధనకు సంఘటితంగా పోరాడుదామని బ్రాహ్మణ సంఘం రాష్టన్రేతలు పునరుద్ఘాటించారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక గాయిత్రీ ఆలయ ఆవరణలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు బియస్ విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సంఘ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణకు చెందిన ఎంపి సముద్రాల వేణుగోపాలాచారి, ఎపి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎపి బ్రాహ్మణ సంఘం సేవా సమితి అధ్యక్షులు జ్వాలపూడి శ్రీకాంత్, కార్యదర్శి కోనేరు సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ప్రధాని పివి నరసింహారావు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో 14 మంది దాకా తమ కులానికి చెందిన ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం ఉండేదన్నారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బ్రాహ్మణులకు టికెట్‌లు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 6 శాతం, తెలంగాణలో 4 శాతం దాకా బ్రాహ్మణ ఓటర్లు ఉన్నారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ముఖ్యమంత్రులు బ్రాహ్మణ ఫెడరేషన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గుర్తింపు ఇవ్వడం హర్షణీయమన్నారు. అయితే దామాషా ప్రకారం ఇతర కులాల కార్పొరేషన్‌లకు అనుగుణంగా బ్రాహ్మణ ఫెడరేషన్‌కు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఫెడరేషన్ లక్ష్యాలను సాధించాల్సి ఉండగా ఒత్తిళ్ల కారణంగా పురోగతి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు ఇతర కులాల కార్పొరేషన్ తరహాలో చట్టబద్ధత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధత కోసం బ్రాహ్మణులంతా రాజకీయాలకు అనుగుణంగా పోరాటం సాగిద్దామని పిలుపునిచ్చారు. బిసి, ఎస్సీ, ఎస్టీ వంటి కార్పొరేషన్‌ల లబ్ధిదారులకు నేరుగా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ అవుతాయని, అయితే ఇప్పటి దాకా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్‌కు చట్టబద్ధత లేదన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా సంఘాలు పోరాటాలు సాగించాలని కోరారు. కాగా తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌కు అనువైన రీతిలో సహకారం అందిస్తున్నారని ఎంపి వేణుగోపాలాచారి అన్నారు. ఇదే తరహాలో మీరు కూడా ఎపిలో సంఘటితంగా మెలిగి హక్కుల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని సూచించారు. ఇందుకు వైకాపాకు చెందిన బ్రాహ్మణ ఎమ్మెల్యే కోన రఘుపతి స్పందిస్తూ కనీసం తన నియోజకవర్గంలో కూడా బ్రాహ్మణ వెల్ఫేర్ ఫెడరేషన్‌కు సంబంధించిన సమావేశాలకు సమాచారం ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఎపి నుండి ఏకైక బ్రాహ్మణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండగా సంబంధిత కార్పోరేషన్‌కు సంబంధించిన కార్యాలయం ఎక్కడ ఉందో చూడలేదని, విశ్రాంత ఐఏఎస్ అధికారి కృష్ణారావు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నప్పటికీ తనను విస్మరించడం బాధాకరమన్నారు. అయినా వచ్చే ప్రతి ఎన్నికల్లో ఏ పార్టీ అయితే బ్రాహ్మణులకు అన్ని విధాలా న్యాయం చేసే విధంగా చర్యలు చేపడితే వారికే అందరం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించారని, ఇంకా దాదాపు రూ.300 కోట్ల దాకా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రాహ్మణుల జనాభా మేరకు రూ.1000 నుండి రూ.1500 కోట్ల దాకా ఫెడరేషన్‌కు నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. ఇదే విషయమై ఇప్పటి నుండి రాజకీయాలకు, సంఘాలకు అనుగుణంగా ప్రతి బ్రాహ్మణుడు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. అంతకుమునుపు బ్రాహ్మణ సేవా సమితి అతిథి గృహ సముదాయ నిర్మాణం కోసం ముఖ్య అతిథులు ఎంపి సముద్రాల వేణుగోపాలాచారి, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు భూమిపూజ చేశారు. దీనికితోడు డిగ్రీలో ప్రతిభ కనబర్చిన పరిగి మండలం ఊటుకూరుకు చెందిన విద్యార్థిని శ్రావణిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రంగారావు, సేవా సమితి కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర అర్చక సంఘం కన్వీనర్ మధుసూదన్ శర్మ, రాజమండ్రికి చెందిన ప్రముఖ నఖ చిత్రాకారుడు రవిపర్సా తదితరులు పాల్గొన్నారు.
ముంచుకొస్తున్న నీటి గండం!
* పురంలో పదిహేను రోజులకోసారే నీటి సరఫరా
* అడుగంటుతున్న భూగర్భజలాలు
* ఆదుకోని పిఎబిఆర్ నీటి పథకం
* ట్యాంకర్ల నీరే శరణ్యం
హిందూపురం టౌన్, మార్చి 19 : వాణిజ్య కేంద్రంగా, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన హిందూపురానికి నీటి గండం ముంచుకొస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటిపోతుండటంతో ప్రజలు నీటి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.650 కోట్లతో పిఏబిఆర్ నుండి హిందూపురం వరకు తుంగభద్ర జలాలను అందించేందుకు శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని అమలు చేశారు. పథకం అమలు నుండి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో నీరు అందకపోవడంతో అటు అధికార యంత్రాంగం ఇటు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రతిరోజూ పట్టణానికి 10 మిలియన్ లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ నెలలో కూడా 10 మిలియన్ లీటర్ల నీటిని అందించిన దాఖలాలు లేవు. సగటున ప్రతినెలా 5 మిలియన్ లీటర్ల లోపే నీటి సరఫరా జరుగుతోంది. హిందూపురం పట్టణానికి ప్రత్యామ్నాయ నీటి వనరులు లేకపోవడంతో పిఏబిఆర్ తాగునీటి పథకం, మున్సిపల్ బోర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. హిందూపురం మున్సిపల్ పరిధిలో 150కి పైగా బోర్లు ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా రోజురోజుకు బోర్లు ఎండిపోతున్నాయి. దాదాపు 60కి పైగా బోర్లు ఇప్పటికే ఎండిపోగా మరో 25 దాకా ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 70 బోర్ల ద్వారా మాత్రమే అరకొరగా నీటి వస్తున్నాయి. పట్టణంలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి కారణంగా ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులకు కాసులు కురుస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బిందె నీటిని రూ.5 దాకా వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. ఇకపోతే ఇళ్ళకు వేసుకున్న కొళాయిల్లో కనీసం పదిహేను రోజులకు ఒక్కసారి కూడా నీరు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందది. ఇదిలా ఉండగా ట్యాంకర్ల ద్వారా మున్సిపల్ యంత్రాంగం నీటిని సరఫరా చేస్తున్నా అవి కూడా సక్రమంగా నీరు అందించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు ప్రజల నుండి డబ్బులు డిమాండ్ చేస్తుండటం, కనీసం నాలుగైదు రోజులకు ఒకసారి కూడా ఉచిత ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోతుండటంతో నీటి కోసం పడరానిపాట్లు పడుతున్నట్లు వాపోతున్నారు. గత రెండేళ్లుగా మున్సిపల్ యంత్రాంగం ఎంతోకొంత నీటిని అందిస్తుండగా ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో నీటి కోసం ఆందోళనలు తప్పడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ప్రభుత్వం వేసవిలో మెరుగైన నీటి సరఫరాకు మున్సిపాలిటీ బోర్లు ఎండిపోతే ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకొని నీటిని అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు, ప్రైవేటు బోర్ల యజమానులు బోర్లను అద్దెకు ఇచ్చేందుకు ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. పట్టణంలో నీటి వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతుండటంతో బోర్లు మున్సిపాలిటీకి ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి నీటి సరఫరా మెరుగుకు చర్యలు తీసుకోకపోతే ప్రజల నుండి ఆగ్రహావేశాలకు గురి కాక తప్పదు.
‘పురం’లో త్రిముఖ పోటీ తప్పదా!
* వార్డు ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
హిందూపురం టౌన్, మార్చి 19 : పట్టణంలోని 9వ వార్డు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డేందుకు ప్రయత్నాలు ప్రా రంభమయ్యాయి. ఈ వార్డు నుండి గత 2014 మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి తరపున గంగమ్మ విజయం సాధించారు. అయితే అనారోగ్యంతో ఆమె ఏడాదిన్నర క్రితం మృతి చెందా రు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఎన్నిక నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో పరుగు మొదలయింది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. టిడిపి నుండి గం గమ్మ కుటుంబం తరపున అభ్యర్థిని బరిలో దించాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే టిడిపి, బిజెపి పొ త్తులో భాగంగా తమకు తొమ్మిదో వా ర్డు కేటాయించాలని బిజెపి నాయకు లు కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో ప్ర యత్నాలు చేస్తున్నారు. ఇదే విషయ మై టిడిపి ముఖ్య నాయకులను కలిశారు. అధిష్ఠానం ఆదేశం ప్రకారం ప నిచేద్దామని, ఎవరికి కేటాయించినా గెలుపునకు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే తెదేపా గంగమ్మ కుటుంబీకులనే రంగంలోకి దింపనుందని తెలుస్తోంది. మరో వైపు గతంలో కొద్ది ఓట్లతోనే ఈ వార్డులో ఓటమి పాలయ్యాయమని, తమ పార్టీకి పట్టు ఉందని వైకాపా భావిస్తోంది. బలమైన అభ్యర్థిని రంగ ంలోకి దించేందుకు ఇప్పటికే జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. సర్వే నిర్వహణను చేపట్టినట్టు తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు పట్టణాధ్యక్షులు నాగరాజు ప్రయత్నిస్తున్నారు. 9వ వా ర్డుపై కొద్దిరోజులుగా దృష్టి సారించారు. అభ్యర్థి ఎంపికతోపాటు పోలిం గ్ వరకు ఎలా వ్యవహరించాలోనన్న అంశంపై ఇప్పటికే పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. దీంతో 9వ వార్డులో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని తప్పనిసరిగా నిలుపుతుండటంతో వైకాపా ఓట్లకు గండి పడుతుందని భావిస్తున్నారు. ఏదేమైనా 9వ వార్డు ఎన్నిక ఉత్కంఠభరితంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
నేటి నుంచి నామినేషన్లు
9వ వార్డు ఉప ఎన్నికకు సంబంధించి సోమవారం నుండి ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్‌ల స్వీకరణకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 24న నామినేషన్‌ల పరిశీలన, 27వ తేదీ నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్, 11వ తేదీన కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ చెప్పారు.
ఆనందభరితం.. అలకోత్సవం..
* అశ్వవాహనంపై విహరించిన ఖాద్రీశుడు
కదిరి, మార్చి 19 : శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వహించిన అలుకోత్సవం భక్తులకు ఆన ంద భరితాన్ని పంచింది. ఆలయ సిం హ ద్వారానికి దక్షిణ భాగాన ఉంన్న మంటపంలో అలుకోత్సవం నిర్వహించారు. అలకం వహించిన శ్రీదేవి, భూదేవిలు శ్రీమన్నారాయణుడిని బడిలిక పొందిన శరీరాన్ని చూసి అపోహపడి కినుక వహిస్తారు. అప్పుడు భక్తవత్సరుడు తాను త్రిలోక సంచారంలో రాక్షస సంభారం చేసి వస్తున్నట్లు వివరించి ఊరటిస్తాడు. శ్రీవారిపై అలకబూరిన శ్రీదేవి, భూదేవిను బుజ్జగించే తీరునే అలుకోత్సవం అంటారు. ఈ ఘట్టాన్ని కంకణ భట్టాచార్యులు భక్తులకు వివరించారు. అలుకోత్సవం పూరె్తైన వెంటనే శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్తూ ఆలయానికి చేరుకుని అశ్వవాహనంపై దర్శనమిస్తారు. ఈ సందర్భంగా పురజనులు వసంత వల్లభుడికి ఫల, పుష్పాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలుకోత్సవానికి ఉభయదారులుగా ఈఓ వెంకటేశ్వరరెడ్డి దంపతులు వ్యవహరించగా, అశ్వవాహనానికి ఉభయదారులుగా గండి ఉద్గావి భీమాచార్యులు, కుమారులు గండి జయసింహా, గండి విజయసింహా ఆధోని వారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి దంపతులు, పాలక మండలి చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు దంపతులు, ప్రధాన అర్చకులు నరసింహాచార్యులుతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాగా నేడు ఉదయం తీర్థవాది జరుగుతుంది. కార్యక్రమానికి ఉభయదారులుగా తాయి అశ్వర్థనారాయణ శెట్టి, తాయి ప్రభాకర్ గుప్తాలు వ్యవహరిస్తారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ..
బ్రహ్మరథోత్సవం పూరె్తైనప్పటికీ ఆలయంలో ఆదివారం కూడా భక్తుల తాకిడి ఎక్కువైంది. పట్టణంలో ఎక్కడ చూసినా భక్తులతో నిండిపోయింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ స్థాయిలో భక్తులు తరలిరావడంతో క్యూలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచివున్నారు. ఇక తిరువీధుల్లో తినుబండారాలు, కదిరి కుంకుమ, దవణం, కదిరి మల్లెలు పెద్ద ఎత్తున భక్తులు కొనుగోలు చేశారు. బ్రహ్మరథం (తేరు) వద్ద భక్తులు టెంకాయలు సమర్పించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని దక్షిణ గోపురం సమీపంలో భక్తులు తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఠారెత్తిస్తున్న ఎండలు
* తరిమెలలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అర్బన్, మార్చి 19 : జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం శింగనమల మండ లం తరిమెలలో 43.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకాగ, హిందూపురం లో 36.5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు 42.7, దాడితోట 42.2, చెనె్నకొత్తపల్లి 41.7, తాడిమర్రి 41.1, పామిడి 40.6, నార్పల 40.6, కోమటికొండ్ల 40.5, వెంకటాపురం 40.4, సనప 40.3, కదిరి 39.9, కళ్యాణదుర్గం 39.5, ధర్మవరం 39.5, అనంతపురం 39.2, పుట్టపర్తి 39.2, గుత్తి 38.9, గుంతకల్లు 38.9, ఉరవకొండ 38.2, పెనుకొండ 37.6 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మున్సిపల్ వార్డుల
ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్

అనంతపురం, మార్చి 19 : నగరపాలక, పురపాలక సంస్థల్లో ఖాళీ అయిన వార్డుల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. జరగనున్నాయి. వీటిలో రాయదుర్గం, హిందూపురం, తాడిపత్రి, పామిడిలో ఖాళీగా ఉన్న వార్డులకు ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఈనెల 16న షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ విడుదల అనంతరం 20 నుంచి 23వ తేదీ నామినేషన్ల దాఖలు, 24న పరిశీలన ఉంటాయి. 27న మధ్యాహ్నం 3 గంటలలోపు ఉపసంహరణ, అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
పామిడి, మార్చి 19 : మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారి నుంచి రోడ్డు దాటుతుండ గా ఆదివారం ద్విచక్ర వా హనాన్ని, ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో రామాంజనేయులు (65) మృతి చెందా డు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గార్లదినె్న మండలం కల్లూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు పి.కొండాపురంలో వ్యాపారం ముగించుకుని ద్విచక్రవాహనంలో జాతీయ రహదారి దాటుతుండగా కర్నూలు నుంచి పామిడిలోకి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తీవ్రగాయాలపాలైన రామంజనేయులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య
మడకశిర, మార్చి 19 : పట్టణంలోని ఆరే వీధిలో నివాసం ఉంటున్న మహిళ నజీమా (21) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన నజీమా రెండు సంవత్సరాల క్రితం ఇదే పట్టణానికి చెందిన ఓ యువకున్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎంతో సంతోషంగా కాపురం చేసుకుంటుండేవారు. అయితే ఆరు నెలల నుంచి అత్త,మామలతో పాటు భర్త కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వేధిస్తుండేవారు. ఈనేపథ్యంలో వేధింపులు తట్టుకోలేక శనివారం రాత్రి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం ఏడు గంటలైనా ఆమె బయటకు రాకపోవడంతో భర్త గది తలుపులు తీసి చూడగా నజీమా ఫ్యాన్‌కు శవమై వేలాడుతోంది. విషయాన్ని మడకశిర పోలీసులకు తెలియజేయగా ఎస్సై మక్బుల్‌బాషా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలమత్తూరు, మార్చి 19 : మండల పరిధిలోని కోడూరు పవర్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై సుబ్బన్నని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నాయనపల్లిలో నివాసం ఉంటున్న సుబ్బన్న గుజరీ వస్తువుల కోసం ఆ ప్రాంతానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు బెంగళూరుకు వెళ్లే గుర్తు తెలియని వాహనం ఆయనను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
రాప్తాడు, మార్చి 19 : మండల పరిధిలోని మరూరు టోల్‌గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు ఆదివారం దాడి చేసి 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్సై శంకర్‌బాబు, ఎఓ ఉమాపతి మాట్లాడుతూ అనంతపురం రుద్రంపేటకు చెందిన బియ్యం వ్యాపారి నారాయణరెడ్డి, హిందూపురంలోని మరో వ్యాపారి సురేష్‌రెడ్డికి అనంత నుంచి బొలేరో వాహనంలో 30 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు టోల్‌గేట్ వద్ద దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని తహశీల్దార్ నాగభూషణంకు అప్పజెప్పినట్లు తెలిపారు. ఈ దాడిలో రాప్తాడు ఎస్సై ధరణిబాబు, విజిలెన్స్ కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, నవీన్, ఆర్‌ఐ ఓబన్నగౌడ్, విఆర్‌ఓ గోవిందనాయక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.