అనంతపురం

ఎసిబి వలలో విద్యుత్ శాఖ ఎఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, మార్చి 23: రూ.90 వేలు లంచం తీసుకుంటు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పుట్టపర్తి విద్యుత్ శాఖ ఏఈ జనార్ధన్‌నాయుడు పట్టుబడడం జరిగింది. ఏసిబి డిఎస్‌పి జయరామరాజు తెలియజేసిన వివరాలు ఈ విధంగా వున్నాయి. పుట్టపర్తి పట్టణంలో నివాసముంటున్న రమాదేవి అనే మహిళ వద్ద రూ.90వేలు లంచం తీసుకుంటు గురువారం విద్యుత్ శాఖ ఏఈ జనార్ధన్‌నాయుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం జరిగింది. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రాయలవారిపల్లె వద్ద ఆర్గానిక్ ఫారం వరకు మూడు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిమిత్తం రమాదేవి మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, కనెక్షన్ల నిమ్తితం ఒక్కొక్కటికి రూ.9వేలు చొప్పున రూ.27వేలు డిడి తీయడం జరిగింది. ఆ తరువాత సత్వరం విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలంటే రూ.30వేలు వంతున రూ.90వేలు లంచం ఇవ్వాలని రమాదేవిని సదరు ఏఈ డిమాండు చేశారు. ఈ విషయంపై ఎసిబి అధికారులను రమాదేవి సంప్రదించగా పక్కా ప్రణాళికతో వారు సమకూర్చిన రూ.90వేల నగదును గురువారం నాడు విద్యుత్ కార్యాలయంలోని ఏఈకి రమాదేవి ముట్టజెప్పింది. ఉన్నపళంగా ఎసిబి అధికారుల బృందం ఏకకాలంలో దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా ఏఈ జనార్ధన్‌నాయుడును వలపన్ని పట్టుకోవడం జరిగింది. జనార్ధన్‌నాయుడును సాంకేతికపరమైన విచారణలు చేసి లంచం డబ్బులు స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు తదితర పూర్వాపరాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు డిఎస్‌పి జయరామరాజు తెలిపారు. ఈ దాడిలో సిఐ ఖాదర్‌బాషా, సిబ్బంది పాల్గొన్నారు.్భరతదేశ సంతతికి చెందిన రమాదేవి, చక్రవర్తి దంపతులు ఆస్ట్రేలియాలో ఉద్యోగరీత్యా వెళ్ళడం జరిగింది. మూడేళ్ల క్రితం ఎన్‌ఆర్‌ఐ రమాదేవి పుట్టపర్తికి విచ్చేశారు. సత్యసాయి భక్తురాలైన రమాదేవి పుట్టపర్తి సమీపంలో రసాయన రహిత తోటల పెంపకానికి 17 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు లంచమడగడం సమంజసం కాదని, తమలాంటి విద్యావంతులు దీన్ని అరికట్టాలని భావించి ఆమె అవినీతి భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ఒక దుర వ్యవస్థగా పేర్కొన్నారు.
విద్యుత్ శాఖలో హెచ్చుమీరుతున్న అవినీతి.......
వ్యవసాయ రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని విద్యుత్ శాఖలో అవినీతి హెచ్చుమీరుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌కు రూ.8-9 వేలు ఆ శాఖకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సి వుంది. ఒక్కొక్క కనెక్షన్‌కు 3 కరెంటు స్తంభాలు, వైర్లు, పరికరాలను ఆ మొత్తంలోనే సరఫరా చేయాల్సి వుంది. విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వరుస క్రమంలో ముందు జాబితా ప్రకారం కనెక్షన్లు మంజూరు చేయాలి. కాగా వరుస క్రమాన్ని పక్కనపెట్టి ఆర్జనే ధ్యేయంగా లంచాలు తీసుకుని ఇష్టానుసారం విద్యుత్ కనెక్షన్లు అధికారులు మంజూరు చేస్తున్నట్లు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పుండుపై కారం చల్లిన చందంగా అసలే వరుస కరవు, క్షామం బారిన పడి అల్లాడుతున్న రైతులకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. పుట్టపర్తి పట్టణంలో సైతం తవ్వే కొద్ది విద్యుత్ శాఖ లీలలు బయడపడే అవకాశముంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలోని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిపై రైతులు తమకు ఎదురైన అనేక సమస్యలను ఈ విధంగా తెలియజేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ మరింతగా దాడులు నిర్వహిస్తే మరిన్ని తిమింగలాలు బయటపడే అవకాశముంటుంది.