అనంతపురం

అధ్యాపక సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మార్చి 25: ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, జూనియర్ కాలేజిలు, రెసిడెన్షియల్‌లలో పనిచేస్తున్న అధ్యాపక సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కాలేజిలో జరుగుతున్న ఇంటర్మీడియట్ స్పాట్‌వ్యాల్యూయేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించి తాను ఎస్టీయులో అనేక పదవులు చేపట్టానని, ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలు తెలుసని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి వత్తిడి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు, జూనియర్ లెక్చరర్ల సంఘం నాయకులు మల్లికార్జున, ప్రశాంత్, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నాయకులు రామాంజినేయులు, ఇతర అధ్యాపకులు కలసి సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందు, రామన్న, నాయకులు రమణారెడ్డి, చంద్రశేఖర్, శివయ్యచారి, శ్రీనివాసప్రసాద్, సూర్యుడు, ఆర్‌యుపిపి ఎర్రిస్వామి, తులసిరెడ్డి పాల్గొన్నారు.
ఎఐఎఫ్‌టియు రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ
అనంతపురం కల్చరల్, మార్చి 25: ఎఐఎఫ్‌టియు(న్యూ) రాష్ట్ర మహాసభల గోడపత్రికలను శనివారం ఆవిష్కరించారు. ఏప్రిల్ 11, 12వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఎఐఎఫ్‌టియు(న్యూ) రాష్ట్ర మహాసభల గోడపత్రికలను తరిమెల నాగిరెడ్డి శ్రామిక భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సి.పెద్దన్న మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల అమలు పేరుతో ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మినారాయణ, నాగభూషణం, రాజా, ఇలాహి పాల్గొన్నారు.

శ్రీ బాలాజి పిజి కాలేజి ల్యాబ్‌లో
అగ్నిప్రమాదం
అనంతపురం అర్బన్, మార్చి 25: మంత్రి పల్లె రఘనాథరెడ్డికి చెందిన పిపికెకె కళాశాలలోని శ్రీ బాలాజి పిజి కాలేజి (యమ్‌బిఎ) కంప్యూటర్ ల్యాబ్‌లో శనివారం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్వ్యూట్ జరిగింది. దీంతో రూ.30 లక్షలు మేర నష్టం వాటిల్లినట్లు ల్యాబ్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే ఎంబిఎ విద్యార్థులకు క్లాస్ నిర్వహించే కంప్యూటర్స్ ల్యాబ్‌లో శనివారం మధ్యాహ్నం షార్ట్ సర్వ్యూట్ జరిగింది. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఫెరింజన్‌తో మంటలను అదుపులోకి తెచ్చినప్పటికి ల్యాబ్‌లోని వంద కంప్యూటర్లు, మూడు ఎసీలతోపాటు పెద్ద ఎత్తున ఫర్నిచర్ కాలిపోయింది. బిల్డింగ్ కూడా దాదాపు చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలిపారు. దీంతో రూ.30 లక్షల మేర నష్టం సంభవించినట్లు ఆయన తెలిపారు. అగ్నిప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులకు కళాశాల నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.
రిటైర్డ్ కమాండెంట్ ఇంట్లో చోరీ
అనంతపురం అర్బన్, మార్చి 25: ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ విభాగంలో కమాండెంట్‌గా పనిచేసిన విశ్రాంత ఉద్యోగి సుబ్బరాయుడు ఇంట్లో శుక్రవారం దొంగలు పడి రెండు బంగారు గాజులతోపాటు, ఓ బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్‌నగర్‌లో నివాసం వుండే విశ్రాంత ఉద్యోగి అనారోగ్యం కారణంగా హైదారాబాద్‌కు వెళ్లారు. దీంతో దొంగలు చోరీకి పాల్పడ్డారు. అదేవిధంగా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెవెన్యూ కాలనీలో నివాసం వుండే గిరియన్నయ్య ఎస్కేయులోని ఇంజనీరింగ్ విభాగంలో సూపరింటెండ్‌గా పరిచేస్తున్నారు. శుక్రవారం తన కుమారుడు తపోవనంలో నివాసం వుండటంతో వెళ్లగా ఇంట్లో దొంగలు పడి రూ.30వేలు ఎత్తుకెళినట్లు పోలీసులు తెలిపారు.
ఉరిపోసుకొని విద్యార్థి మృతి
అనంతపురం అర్బన్, మార్చి 25: నగరంలోని జాకీర్ కొట్టాలకు చెందిన 9వ తరగతి చదువుతున్న ఇమ్రాన్ (16) ఉరిపోసుకొని శనివారం ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసలు తెలిపిన వివరాల మేరకు ఇమ్రాన్ కళ్యాణదుర్గం రోడ్డులోని సెయింటాన్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఇదే పాఠశాలలో చదువుతున్న ఓ అమ్మాయితో ప్రేమలో వున్నట్లు, ఇదే విషయంపై ఇమ్రాన్‌ను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపం చెంది శనివారం ఇంట్లోని బాత్‌రూమ్‌లో చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, శవాన్ని పోస్ట్‌మార్టం కోసం సర్వజన ఆసుపత్రికి తరలించారు.