అనంతపురం

ధర్మవరంలో ఇళ్ల స్థలాల అక్రమాలపై సిబిసిఐడితో విచారించండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, మార్చి 25: ధర్మవరంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల స్థలా ల పంపిణీలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, అప్పట్లో అధికారంలో వున్న కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇళ్ల స్థలాలను బోగస్ పేర్లతో సొంతం చేసుకున్నారని, వీటిపై ప్రభు త్వం సిబిసిఐడి విచారణ చేపట్టి బా ధ్యులపై చర్యలు తీసుకుని అర్హులకు న్యాయం చేయాలని శనివారం శాసన సభ జీరో అవర్‌లో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే శనివారం ఫోన్‌లో మాట్లాడుతూ జీరో అవర్‌లో ప్రశ్నోత్తరాల సందర్భంగా ధర్మవరంలో ఇళ్ల స్థలాల అక్రమాలపై ప్రభుత్వం సిబిసిఐడితో విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. అలాగే అప్పట్లో వైఎస్‌ఆర్, ఇందిరమ్మ, కేతిరెడ్డి ఎల్-1, ఎల్-2 కాలనీల్లో 8 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, ఇందులో అర్హులకు మాత్రం అన్యాయం జరిగినట్లు తెలిపారు. అంతేకాక బోగస్ పేర్లతో ఇష్టారాజ్యంగా అధికారంలో వున్న కాంగ్రెస్ నాయకులు సొంతం చేసుకుని వాటిని ఇతరులకు అమ్మి భారీగా ఆర్థిక లబ్ధి పొందినట్లు తెలిపారు. ఇప్పటికి ఆ కాలనీల్లో ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారులు లేరని, కొన్నిచోట్ల పునాదులకే పరిమితమయ్యాయని, ఇలా వేల పట్టాలు అన్యాక్రాంతం జరగడంపై ప్రభుత్వం స్పందించి సిబిసిఐడి విచారణ చేపట్టాలని శాసన సభలో కోరినట్లు పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన సంబంధిత రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రులు ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానమిస్తూ ఇళ్ల స్థలాల అక్రమాలపై వెంటనే విచారణ చేయిస్తామని, అందుకు సహకరించిన అధికారులపైన, తీసుకున్న వారిపైన చట్టపరమైన చర్యలు తప్పక తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
స్వచ్ఛ భారత్‌లో ద్వితీయ స్థానం...
ధర్మవరం ప్రభుత్వాస్పత్రి ఘనత
ధర్మవరం, మార్చి 25: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్‌లో ధర్మవరం ప్రభుత్వాస్పత్రి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ కమిటీ సభ్యులు ధర్మవరం ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. అనంతరం ఢిల్లీలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆస్పత్రుల ఎంపికలో ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి ద్వితీయ స్థానంలో వున్నట్లు ప్రకటించారని ఆస్పత్రి సూపరింటెండెంట్ రామలక్ష్మమ్మ తెలిపారు. కాగా జిల్లాలో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామలక్ష్మమ్మ, పాలకవర్గం అధ్యక్షులు లక్ష్మినారాయణ, సభ్యులు మాట్లాడుతూ ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రి ఏరియా ఆస్పత్రిగా రూపాంతరం చెందడంతోపాటు పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేస్తుండడంతో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఆస్పత్రి ఆవరణం పరిశుభ్రతతోపాటు రోగుల గదులు, కార్యాలయ గదులను చికిత్స విభాగాల్లో పనితీరును అధికారులు పరిశీలించారని, అనంతరం నెలవారి నివేదికలు సైతం పంపడంతో ద్వితీయ స్థానంలో ఆస్పత్రి నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రి అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి పల్లకిసేవ
ఉరవకొండ, మార్చి 25 : పెన్నోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం పల్లకిసేవ అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవలో భాగంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను అలంకరించి ప్రత్యేకంగా తయారు చేసిన ఉత్సవ వాహనంలో బాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. ఉత్సవాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకొన్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ సాకే రమేష్ బాబు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.