అనంతపురం

మద్యం దుకాణాలకు తీవ్ర పోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 26 : జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణకు ఈఏడాది మరింత పోటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. రెండేళ్ల పాటు దుకాణాల నిర్వహణకు అనుమతి ఉంటుంది. దీనికితోడు 2019లో రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అత్యధికులు దరఖాస్తులు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పెనుకొండ ఎక్సైజ్ జిల్లా పరిధిలో 100, అనంతపురం ఎక్సైజ్ జిల్లా పరిధిలో 146 చొప్పున 246 మద్యం దుకాణాలున్నాయి. వీటి నిర్వహణకు ఈఏడాది తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దుకాణాలు నిర్వహించుకుంటున్న వారు తిరిగి చేక్కించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా ఈనెల 24న నోటిఫికేషన్ వెలువడిన విషయం విధితమే. దీంతో ఆరోజు మినహా మరుసటి రెండు రోజులు కూడా నాల్గవ శనివారం, ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు కావడంతో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. సోమవారం నుంచి బ్యాంకుల్లో డిడిలు, చలానాలు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోనున్నారు. ఈ ఏడాది దరఖాస్తుదారులకు తిరిగి ఇవ్వని రిజిస్ట్రేషన్ ఫీజు నిబంధనల మేరకు మండల పరిధిలో రూ.50వేలు, నగర పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో రూ.75వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.లక్ష మేరకు ఆయా ప్రాంతాల్లో దుకాణాల డిమాండ్, అమ్మకాల స్థాయిని బట్టి స్లాట్స్ నిర్ణయించారు. దీంతో కొత్తగా దరఖాస్తులు చేసుకునే వారిలో ఆర్థికంగా బలమైన వారే ముందుండే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మొదలు ఐదారుగురు వరకు కొత్త వారు ఆన్‌లైన్‌లో రెండు, మూడు షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. దుకాణాలు దక్కితే, వాటిని గుడ్‌విల్ కింద అధిక మొత్తాలకు ఇతరులకు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. క్రితం సారి కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లోని దుకాణాలను దక్కించుకునేందుకే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వాటిలోనూ అనంతపురం, హిందూపురం, ధర్మవరం, కదిరి, గుత్తి, గుంతకల్లు, పెనుకొండ, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర పట్టణాల్లో అధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ముఖ్యమైన ప్రదేశాలు, కూడళ్లు, జన సంచారం అధికంగా ఉండి మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ ఉండటం విశేషం. ఇపుడు వీటిపై పెట్టుబడి పెట్టినా వచ్చే రెండేళ్లలో ఎన్నికల సమయంలోనైనా లాభాలు ఆర్జించవచ్చన్న ఆలోచనలో చాలా మంది మద్యం వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా దుకాణాలను దక్కించుకునేందుకు సిండికేట్ అయి దరఖాస్తులు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూ.5వేలు దరఖాస్తు రుసుము కూడా చెల్లించాలి. ఈ మొత్తాలను కంప్యూటర్‌లో దరఖాస్తు చేసుకునేందుకు లాగిన్ కావడానికి ముందే చలానా ద్వారా చెల్లించాల్సి ఉంది. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఇఎండి రూ.3 లక్షలు ఇఎండిని డిడి తీసి, సదరు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని నోటిఫికేషన్‌లో సూచించారు. దుకాణాలను దక్కించుకున్న వారికి మద్యం అమ్మకాల లైసెన్సులను ఈ ఏడాది ఏప్రిల్ (01-04-2017) నుంచి జూన్ 30, 2019(30-06-2019) వరకు గానీ, లేదా ఈ ఏడాది జులై 1 నుంచి 2019 జూన్ 30 వరకు గానీ ఆబ్కారీ శాఖ మంజూరు చేయనుంది. ఇందుకోసం ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న వారు ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తుల అనుమతుల మంజూరు, దుకాణాల కేటాయింపుప్రక్రియను ఈనెల 31న మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం నగరం గుత్తి రోడ్డులోని విద్యుత్ కళాభారతిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఒక వ్యక్తి ఒక రిజిస్ట్రేషన్‌లో ఒక దుకాణానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇంకో దుకాణానికి దరఖాస్తు చేసుకోవాలంటే వేరుగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఈ లెక్కన దరఖాస్తుదారుల నుంచి ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఏర్పడింది.
2019 ఎన్నికలే లక్ష్యం
* బూత్ కమిటీలతో పార్టీ బలోపేతం
* బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు
అనంతపురం సిటీ, మార్చి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బూత్ లెవల్ కమిటీలతోనే భారతీయ జనతా పార్టీ ని బలోపేతం చేయగలమని, అన్ని జిల్లాల్లో బూత్‌లెవల్ కమిటీలను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్దార్థనాథ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఆర్‌డిటి మైదాన అ తిథి గృహంలో భారతీయ జనతా పా ర్టీ రాష్ట్ర పధాధికారుల సమావేశం ని వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్దార్థనాథ్‌సింగ్, అఖిల భారత పార్టీ వ్యవహారాల సహ సంఘటనా కార్యదర్శి సతీష్‌జీలతోపాటు అధ్యక్షు డు హరిబాబు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఆయన మా ట్లాడుతూ దేశంలో ప్రధాని మోదీ అ మలుచేస్తున్న సంక్షేమ పథకాలు చూ సి ప్రజలు మొగ్గుచూపుతున్నార న్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉత్తరా ంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి మాధవ్ గెలుపుతో రాష్ట్రంలో కూడా మన పార్టీ బలోపేతం అవుతోందని తెలిపారు. పేదలకు అనుకూల సంక్షే మ పథకాలు, రైతులకు యూరియా ను కొరత లేకుండా అందించడంలో కేంద్రం అనుకూలంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకంటే ప్రత్యేక ప్యాకేజియే ప్రత్యామ్నాయమని, ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రత్యేక హోదా అంటే 90 శా తం నిధులు రాష్ట్రానికి కేంద్రం నుండి వస్తాయని తెలిసిందే కానీ ప్రత్యేక ప్యాకేజీతో అంతకన్నా ఎక్కువ నిధులను కేంద్రం విడుదల చేస్తోందని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల అభివృద్ధిలోకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రాష్ట్రంలో నిర్మించే పోలవరం ప్రాజెక్టుకు సంబందించి ప్రతి రూపాయి కేంద్రమే భరిస్తుందని, రాష్ట్రంలోని అ న్ని ప్రాజెక్టులకు కేంద్రం నిధులు విడుదల చేస్తోందన్నారు. రాష్ట్రంలోని కేం ద్ర విశ్వవిద్యాలయానికి, గిరిజన విశ్వవిద్యాలయానికి, ఉక్కు కర్మాగారం నె లకొల్పడానికి కేంద్రం బిల్లులను ఆ మోదించే క్రమంలో ఉందన్నారు. రా ష్ట్రంలో కరవు తీవ్రంగా ఉందని, తాగునీరు, వలసలు, పశుగ్రాసంపై కేంద్రం కు ఒక నివేదికను అందించి ఆదుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. దీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని, అందులో భాగంగానే రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర బిజెపి అభ్యర్థి మాధవ్ టిడిపి మద్దతుతో గెలుపొందారన్నారు. ఇకపోతే రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడానికి బూత్‌లెవల్ కమిటీలే ముఖ్యమన్నారు. రాష్ట్రంలో 42వేల బూత్‌లు ఉన్నాయని, వాటిలో అన్నింటి కమిటీలను నిర్మించి, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పధాధికారులకు సూచించారు. అలాగే రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై ఒక నివేదికను తయారుచేసి దానిని కేంద్రానికి నివేదిస్తామని, నిధుల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు. అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు చేసి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్సీలు కె.సత్యనారాయణ, మాధవ్, రాష్ట్ర నాయకులు శాంతారెడ్డి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జె.అంకాల్‌రెడ్డి, అన్ని జిల్లాల అధ్యక్షులు, పధాధికారులు తదితరులు పాల్గొన్నారు.

మండుతున్న ఎండలు!
* వడదెబ్బతో చేనేత కార్మికుడి మృతి
అనంతపురం అర్బన్, మార్చి 26: జిల్లాలో వారం రోజులుగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఫలితంగా ఉదయం 11 గంటలకే రోడ్డలన్నీ నిర్మాణుశ్యంగా మారుతున్నాయి. ఉదయం పదిగంటలకు ప్రారంభమవుతున్న ఎండలు సాయంత్రం 5 గంటలైనా ఎండ తగ్గడం లేదు. ధర్మవరం శాంతినగర్‌కు చెందిన నేత కార్మికుడు చెన్న ఆదినారాయణ(53) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. జిల్లావ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు.. తాడిపత్రిలో అత్యధికంగా 41.6 డిగ్రీలు నమోదు కాగా, హిందూపురం 37.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. గుత్తి 40.8, కదిరి 40.5, ధర్మవరం 40.4, గుంతకల్లు 40.4, పుట్టపర్తి 40.1, పెనుకొండ 39.9, ఉరవకొండ 39.6, కళ్యాణదుర్గం 39.5, అనంతపురం 39.4, పామిడి 43.4, తరిమెల 42.8, యల్లనూరు 41.7, యాడికి మండలం రాయలచెరువు 41.5, పుట్లూరు మండలం మడ్డిపల్లి 41.4, కదిరి మరుట్ల 41.4, చెనే్నకొత్తపల్లి 41.4, తాడిమర్రి 41.3, పుట్లూరు మండలం కోమటికొండ్ల 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
వడదెబ్బతో నేత కార్మికుడి మృతి
ధర్మవరం టౌన్ : గత రెండు రోజులుగా పట్టణంలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఎండ వేడిమి తాళ లేక మధ్యాహ్న సమయంలో బయటకు వచ్చేందుకే వెనుకంజ వేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం వడదెబ్బతో ఓ నేత కార్మికుడు మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే... స్థానిక శాంతినగర్‌కు చెందిన చెన్న ఆదినారాయణ(53) నేత కార్మికుడుగా తన జీవనాన్ని సాగిస్తున్నాడు. దినచర్యలో భాగంగా ఆదివారం ఉదయం నుంచి మగ్గం నేస్తూ మధ్యాహ్న సమయంలో ఏదైనా పని నిమిత్తం బయటకు వచ్చాడు. అయితే స్పృహ తప్పి కదిరి గేటు వద్ద పడిపోవడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించాలని వైద్యులు సూచించారు. కాగా అనంతపురంకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు బంధువులు తెలిపారు.
ఆర్‌డిటి ఆస్పత్రి సేవలు అమోఘం
* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
బత్తలపల్లి, మార్చి 26: బత్తలపల్లిలో ఆర్‌డిటి సంస్థ ఏర్పాటుచేసిన వైద్యశాలలో రోగులకు అందుతున్న సేవలు అమోఘమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కొనియాడారు. ఆదివారం బత్తలపల్లిలోని ఆర్‌డిటి ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మాంచూ ఫెర్రర్, ఆస్పత్రి డైరెక్టర్ సుధీర్, సూపరింటెండెంట్ డాక్టర్ శర్మ, మేనేజర్ శివకుమార్‌లతోపాటు ఆర్‌డిటి సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. మొదటగా చిన్నపిల్లల ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించారు. అందులో ఏర్పాటుచేసిన బెడ్లు, వెంటిలేటర్లు, ఐసియు తదితర విభాగాలను పరిశీలించారు. ప్రతి దినం ఎంతమంది చిన్నారులు ఓపికి వస్తారని ప్రశ్నించగా సుమారు 200మంది ప్రతి దినమూ చికిత్సలు పొందుతున్నారన్నారు. వారి కోసం ప్రత్యేక వైద్య నిపుణులు కూడా అందుబాటులో వున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎటువంటి వైద్యసేవలు పొందుతున్నారో ఆయనకు వివరించారు. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులకు అందుతున్న చికిత్సలను ఆస్పత్రి రాక మునుపు వున్న వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గెరాల్డో ఆధ్వర్యంలో రోగులకు అందుతున్న వైద్యసేవలను వివరించారు. ఇక్కడ హెచ్‌ఐవి, టిబి తదితర రోగాలకు చికిత్సలు అందిస్తున్నట్లు వివరించారు. సుమారు వంద బెడ్లు వున్నట్లు, ప్రస్తుతం ఆస్పత్రిలో 90మందికి చికిత్సలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్‌డిటి వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ ఘాట్‌కు వెళ్ళి ఆయన నివాళులు అర్పించారు. ఆర్‌డిటి పేద, బడుగు, బలహీన వర్గాలకు అందిస్తున్న వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆర్‌డిటి వ్యవస్థాపకులు ఫాదర్ కుటుంబ సభ్యులను అభినందించారు. ఆయన వెంట ఆర్‌డిటి సిబ్బందితోపాటు మెయింటెనెన్స్ ఇన్‌చార్జ్ హనుమంతరెడ్డి, సోషియల్ వర్కర్ లక్ష్మణ్ వున్నారు.
కరవు రైతును ఆదుకోవడంలో
ప్రభుత్వం విఫలం
* మాజీ మంత్రి శైలజానాథ్
నార్పల, మార్చి 26 : జిల్లాలో ఆకలి చావులు దగ్గర్లో ఉన్నాయని మాజీ మంత్రి శైలజానాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో జరిగిన ఉపాధి కూలీల ముఖాముఖిలో పాల్గొన్న ఆయన పై విధంగా తెలిపారు. రాయలసీమలోనే అత్యంత కరవు పరిస్థితులు నెలకొన్న అనంతపురం జిల్లాను ఆదుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భారతదేశంలోనే మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ప్రారంభింపబడిన బండ్లపల్లి గ్రామ ఉపాధి కూలీల సమస్యలను వారితో మాట్లాడి ఆయన తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉపాధి పనులను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కూలీలు ఆయనకు తెలియజేశారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని పనులను పక్కన పెట్టి కేవలం ఫారంపాండ్స్ తవ్వించడంతో తమకు కూలీ గిట్టడం లేదని వారు వాపోయారు. అంతేకాకుండా తమకు రావలసిన కూలీ డబ్బులు కూడా ఐదు నెలలుగా తమ ఖాతాల్లో పడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన నాదెండ్ల పేదల అభ్యున్నతికి పాటుపడే కాంగ్రెస్ ప్రభుత్వం వారి కష్టాలను తీర్చడానికి ఉపాధి పథకాన్ని మొదలు పెట్టిందని ఆయన ఒకింత గర్వంగా తెలిపారు. వేసవి మూడు నెలలు ఉపాధి కూలీలకు దుర్భర పరిస్థితులు ఉంటాయని వారి కోసం ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మంచినీటి సదుపాయాన్ని, ప్రథమ చికిత్సా సామాగ్రిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ ఎన్‌టిఆర్ సుజల పథకం ద్వారా 20 లీటర్ల శుద్ధి జలాన్ని అందిస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను ఆపేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ప్రజల ఆగ్రహానికి బలి కావలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఫారంపాండ్స్ తవ్వకాలు ఉపాధి కూలీల పాలిట శాపమని వెంటనే ఆ పనిని ఆపి కూలీలకు ఆమోదయోగ్యమైన పనులను కల్పించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటా సత్యం, మడకసిర మాజీ ఎమ్యెల్యే సుధాకర్, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, మండల కన్వీనర్ గొల్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
విభజన చట్టం అమలుకు కృషి చేయాలి
* మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
కదిరి, మార్చి 26: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పక్కనబెట్టి, అసెంబ్లీ సీట్లు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని, అయితే సీట్ల పెంపుకంటే రాష్ట్ర ప్రజల కోసం విభజన చట్టం అమలయ్యేలా ముఖ్యమంత్రి కృషి చేస్తే బాగుంటుందని విజయవాడ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆదివారం ఆయన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం బయట విలేఖరులతో మాట్లాడారు. రైల్వే జోన్, విభజన చట్టంను అమలయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు ప్యాకేజీ కింద రూ. 50 కోట్లు కేంద్రం ఇస్తే ఏమేరకు సరిపోతుందని ప్రశ్నించారు. వంద టిఎంసిల నీటిని హంద్రీనీవా ద్వారా రాయలసీమకు తీసుకొచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. రాయలసీమను రతనాలసీమ చేస్తానని చంద్రబాబు చెప్పడం జరిగిందని, అయితే ప్రభుత్వమే రాయలసీమ పట్ల వివక్ష చూపుతోందన్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధే విభజన చట్టాల్లో వున్న అంశాలుగా చూపుతున్నారన్నారు. 13 జిల్లాల్లో సమానమైన అభివృద్ధి జరిగినప్పుడే వివక్ష వుండదన్నారు. అధికారంలో వున్న పార్టీ ఇతర పార్టీలో వున్న వారిని చేర్చుకోవడమేతప్పా రైతులు, మహిళల గురించి పట్టించుకోవడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో తాగునీరు, పశుగ్రాసం దొరకని దయనీయమైన పరిస్థితిని చూసి కాంగ్రెస్ పార్టీ కరవు ఆవేదన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారని విమర్శించారు. అరాచకమైన పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి రౌడీలను వదిలేది లేదని, ఊరు వదిలి పారిపోవాలని హెచ్చరిస్తున్నారని, శనివారం పట్టపగలే కర్నూలు జిల్లా డోన్‌లో కర్రలతో దాడులు చేశారని, దీనికి హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ట్రాన్స్‌పోర్ట్ రంగంలో వారిపై దాడి చేయడం, అధికారులను తెలుగు తమ్ముళ్లు బెదిరించడం జరుగుతోందన్నారు. టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీనియర్ ఐపిఎస్ అధికారిణి అప్రజాస్వామ్యంగా నడి రోడ్డుపై రెండు గంటలపాటు నిర్భందించి, కార్లను అడ్డంగా నిలిపితే ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వంలా వ్యవహరించిందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి పిఎస్ అహ్మద్, పిసిసి సంయుక్త కార్యదర్శి జి.వెంకటేష్, డిసిసి ఉపాధ్యక్షుడు కొమ్ము భాస్కర్, కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీహరిప్రసాద్, లీగల్ సెల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామస్వామి నాయుడు, పట్టణ అధ్యక్షుడు అల్త్ఫా, అక్రం తదితరులు పాల్గొన్నారు.
హిందూ సంప్రదాయాన్ని కాపాడుదాం
* ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా శాఖ ప్రతినిధి శ్రీనివాసులు
బొమ్మనహాల్, మార్చి 26 : హిందూ సంప్రదాయాన్ని కాపాడుదామని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవాహ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్‌జీ, గురూ జీ, భారతమాత చిత్రపటాలను ఆదివారం రామాలయం నుంచి పోలీసు స్టేషన్ రోడ్డు మీదుగా వినాయక కట్ట వరకూ పథసంచలన్ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని రా మాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హిందూ దేశం చాలా పవిత్రమైందన్నారు. హిందువులు ఎలాంటి మతాలు, వ్యక్తులకు హానికలిగించేవారు కాదన్నారు. నేడు అంతరించిపోతున్న హిందుత్వం, భారతశక్తిని రానున్న తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉగాది దేశానికి నూతన సంవత్సరం. అయితే పాశ్చత్య దేశాల కేలండర్‌ను దృష్టిలో ఉంచుకుని భారతీయులు జనవరి మాసాలను అమలు చేస్తున్నారన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పరివార్ అని, దీనికి మనవాళ్లను మనం కాపాడుకుంటూ హిందూ సంప్రదాయన్ని, హిందూ ఐక్యతను చాటిచెప్పాలన్నారు. గ్రామాల్లో ఎంతో మంది పరాయి మతాలకు లోబడి జీవిస్తున్నారన్నారు. అలాంటి వారిని ఆహ్వానించడమే ఆర్‌ఎస్‌ఎస్ ధ్యేయమన్నారు. మతమార్చిడికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి వ్యక్తి ఒక శక్తిగా గ్రామ పరిరక్షణ, దేశ పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలుగ్రామాలకు చెందిన బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జి తిమ్మారెడ్డి, స్వయం సేవకులు, అభిమానులు పాల్గొన్నారు.
జర్నలిస్టు ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో
ఆంధ్రభూమి జట్టు ఘన విజయం
* అర్ధ శతకంతో చెలరేగిన షెక్షావలి
అనంతపురం అర్బన్, మార్చి 26: జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ టి-20 మ్యాచ్‌లో ఎపీడబ్ల్యుజె ప్రెస్‌క్లబ్ కమిటీ జట్టుపై ఆంధ్రభూమి జట్టు పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం అనంత క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రెస్‌క్లబ్ జట్టు 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రభూమి జట్టు ఓపెనర్ షెక్షావలి హాఫ్ సెంచరీతో చెలరేగటంతో 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ప్రెస్‌క్లబ్ జట్టు ఓపెనర్ మచ్చా రామలింగారెడ్డి కాసేపు సిక్స్, ఫోర్లతో 42 పరుగులు (29 బంతులు) అలరించాడు. ఈయనతోపాటు ఆ జట్టులో నవీన్ 26, రవి 17, అశోక్ 10 పరుగులు చేశారు. ఆంధ్రభూమి జట్టు బౌలర్ శివ మూడు వికెట్లు తీసి ప్రెస్‌క్లబ్ జట్టు వెన్నువిరిచారు. 128 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్రభూమి జట్టు సునాయసంగా విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ షెక్షావలి 62 (48 బంతులు) పరుగులు చేసి ప్రెస్‌క్లబ్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించారు. మరో ఓపెనర్ బాషా 23 (17 బంతులు) చక్కటి సహకారం అందించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఉరవకొండ, మార్చి 26 : నియోజకవర్గ పరిధిలోని బూదగవి శివారు ప్రాంతం లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యిక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి షణ్ముఖ (41) ఉరవకొండ నుంచి ద్విచక్ర వాహనంలో సొంత గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో షణ్ముఖ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేష్ బాబు తెలిపారు.
కుటుంబ సభ్యులకు వైకాపా నేతల పరామర్శ
మాజీ ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి తనయుడు వైకాపా జిల్లా నాయకులు వై భీమిరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు. పరామర్శించిన వారిలో వైకాపా మండల కన్వీనర్ నరసింహులు, జడ్పిటిసి తిప్పయ్య, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు బసవరాజు, వార్డు సభ్యులు వెంకటేశులు ఉన్నారు.
యువతి ఆత్మహత్య
గార్లదినె్న, మార్చి 26 : మండల పరిధిలోని కోటంక గ్రామంలో వివాహిత గెనె్న సుగుణ (24) ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సుగుణ మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
మడకశిర, మార్చి 26 : మండల పరిధిలోని చీపులేటి గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి (36) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసరెడ్డి అతని భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఇటీవల వీరి గొడవపై స్థానికులు పంచాయితీ నిర్వహించారు. అప్పటి నుండి ఒకటిగానే ఉంటూ వచ్చారు. అయితే గత 15 రోజుల క్రితం భార్యాభర్తలు తిరిగి గొడవపడ్డారు. బెంగళూరులో ఉపాధి కోసం వెళ్లిన శ్రీనివాసరెడ్డి ఐదు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. పురుగుల మందు తాగి గదిలో నిద్రిస్తుండగా విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

52 మండలాలకు నూతన ఎంఇఓలు
అనంతపురం సిటీ, మార్చి 26: జిల్లాలోని 52 మండలాలకు నూతన మండల విద్యా శాఖాధికారులను నియమిస్తూ ఆర్‌జెడి ప్రతాప్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు ఆదివారం కడపలో అనంతపురం జిల్లాలోని మండలాల్లో పనిచేస్తున్న సీనియర్ ప్రధానోపాధ్యాయులకు కౌనె్సలింగ్ ద్వారా మండల విద్యా శాఖాధికారులను నియమించారు. జిల్లాలో మొత్తం 63 మండలాల్లో 9 మంది రెగ్యులర్ మండల విద్యా శాఖాధికారులు ఉన్నారని, మిగిలిన 52 మండలాలకు అదే మండలంలోని పనిచేస్తున్న సీనియర్ ప్రధానోపాధ్యాయులను మండల విద్యా శాఖాధికారిగా నియమించారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎంఇఓలు నేడు తమకు కేటాయించిన మండలాలకు వెళ్లి బాధ్యతలను స్వీకరించనున్నారు.
ఆర్‌టిఎ కమిషనర్‌పై దాడిని ఖండిస్తున్నాం
అనంతపురం సిటీ, మార్చి 26: విజయవాడలోని ఐఎఎస్ అధికారి ఆర్‌టిఎ కమిషనర్‌పై జరిగిన దాడిని రాష్ట్ర అధికార ప్రతినిధి జి.నాగరాజు తీవ్రంగా ఖండించారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారులు భయభ్రాంతులకు గురివాల్సిన పరిస్థితిని తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో కూడిన పార్టీ అని చంద్రబాబు చెబుతుంటే, ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమలు ఐఎఎస్ ఆర్‌టిఎ అధికారిపై దాడి చేయడం చూస్తే అధికారులు పనిచేయలేని పరిస్థితిని తీసుకువస్తున్నారని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సిఎం చంద్రబాబు దాడి చేసిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
అనంతపురం సిటీ, మార్చి 26: ఉపాధ్యాయుల బదిలీల్లో అశాస్ర్తియంగా ఉన్న నిబంధనలను తొలగించి పారదర్శకంగా నిర్వహించాలని ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తరిగోపుల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఆపస్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను తొలగించి, ఇంతకు మునుపులాగానే బదిలీల కౌనె్సలింగ్ నిర్వహించాలన్నారు. ప్రధానోపాధ్యాయులకు, సబ్జెక్టు ఉపాధ్యాయులకు పదోన్నతలు కల్పించాలని కోరారు. వేతన సవరణ బకాయిలను విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నిరుద్యోగుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరంతర సమగ్ర మూల్యాంకన బోధన పద్దతి అమలుపరుస్తున్నందున విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి తగ్గించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌళిక వసతులు కల్పించాలని కోరారు.
వివేకానంద సాహిత్యం పుస్తకాల పంపిణీ
అనంతపురం కల్చరల్, మార్చి 26: యువతీ యువకుల్లో దేశభక్తి, సేవాభావం, నైతిక విలువలను పెంపొందించే స్వామి వివేకానంద సాహిత్యం పుస్తకాలను సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. శ్రీసాయి డిగ్రీ కళాశాలలో ఆదివారం పంచాయతీ కార్యదర్శి మోడల్ టెస్ట్ రాసిన వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి ఓబిరెడ్డి, అఖిల్‌రెడ్డి, బాషా, శకుంతల, రజాక్, వినోద్, శివ, ఇస్మాయిల్, వలి, అమర్, లక్ష్మీపతి, రాకేష్ పాల్గొన్నారు.

ఎబివిపిలో పనిచేస్తే
నీతి, నిబద్దత అలవాటవుతుంది
అనంతపురం సిటీ, మార్చి 26: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి)లో పనిచేస్తే నీతి, నిబద్దత, నిజాయితీ, ఖచ్చితత్వం అలవాటవుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఎస్కేయూలోని ఎబివిపి మెయిన్ గేట్ వద్ద నూతన బోర్డును ఎబివిపి ఎస్కేయూ శాఖ ఏర్పాటుచేసింది. దీనిని ఆవిష్కరించడానికి మంత్రి, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఎబివిపి రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలరెడ్డిలు హాజరై నూతన బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అతి పెద్ద విద్యార్థి పరిషత్‌గా ఎబివిపి ఉందని, ఇందులో పనిచేసిన విద్యార్థులందరు మంచి సంస్కృతి, సాంప్రదాలు నేర్చుకుంటారని, దేశం పట్ల గౌరవం పెరుగుతుందని తెలిపారు. ఎబివిపి ఉద్యమాల్లో ముందుంజలో ఉంటూ విద్యార్థుల, విద్యారంగ సమస్యలపై మరింతగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఎంఎస్.పార్థసారథి, సందిరెడ్డి శ్రీనివాసులు, అంజనరెడ్డి, రమేష్‌రాయుడు, ఆచార్యలు మురళీధర్‌రావు, ఎబివిపి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు హరికృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కామినేనిని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
అనంతపురం కల్చరల్, మార్చి 26: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఎపి ఎమ్మార్పీఎస్ నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్.రాజు, రాష్ట్ర కార్యదర్శి చిన్నపెద్దన్న ఆదివారం కలసి వినతిపత్రం సమర్పించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వౌళిక వసతులు మెరుగుపరచాలని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు సక్రమంగా హాజరుకాని వైద్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతున్న ప్రభుత్వ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. అదేవిధంగా ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు కోటమలిగె ఆనంద్ నాయకత్వంలో పలువురు నాయకులు మంత్రిని కలిశారు. క్రిస్టియన్ మైనార్టీల సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ఐద్వా ఆధ్వర్యంలో ఉగాది కవితాగానం
అనంతపురం కల్చరల్, మార్చి 26: మార్పుకు ప్రతినిధి మధుమాసం ఉగాదిని ఆహ్వానిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఉగాది కవితా గానం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కవయిత్రులు, రచయిత్రులు హాజరై ఉగాది ప్రాశస్త్యము, ఉగాది పచ్చడి విశిష్టత, తెలుగు సంస్కృతిలో ఉగాది ప్రాముఖ్యతను వివరిస్తూ కవితాగానం చేశారు. ఐద్వా నగర కార్యదర్శి యమున అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి షహనాజ్, డా.ప్రగతి, రామసుబ్బమ్మ, లక్ష్మిదేవి, సావిత్రి, రామాంజినమ్మ, చంద్రిక, సుశీల తదితరులు పాల్గొన్నారు.
అష్టలక్ష్మీయాగార్థం నగరంలో భిక్షాటన
అనంతపురం కల్చరల్, మార్చి 26: నగరంలో ఏప్రిల్ 5వ తేదీ నుండి 10 రోజులపాటు నిర్వహించతలపెట్టిన 14వ శ్రీ అష్టలక్ష్మీయాగార్థం నిర్వాహకులు శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి భిక్షాటన చేశారు. లోకకళ్యాణార్థం, రాయలసీమ ప్రాంతం సుభిక్షం కావాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న యాగం కోసం ప్రజలందరి భాగస్వామ్యం, ఆశీస్సుల కోసం ఆదివారం తపోవనం, సోమనాథనగర్ ప్రాంతాలలో భిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ యాగ నిర్వహణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, యాగం కోసం సహాయ సహకారాలు అందించిన వారికి అష్టలక్ష్మీ అమ్మవారి కటాక్షం లభిస్తుందన్నారు. అదేవిధంగా అష్టలక్ష్మీ యాగంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని స్వామి కోరారు.
అప్పారి వెంకటస్వామి సేవలు మరవలేనివి
అనంతపురం సిటీ, మార్చి 26: ఉపాధ్యాయ ఉద్యమ నేత అప్పారి వెంకటస్వామి సేవలు మరువలేనివని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ జిలాన్, మాజీ ప్రధాన కార్యదర్శి ఇసాంసాహెబ్‌లు పేర్కొన్నారు. ఆదివారం యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో అప్పారి వెంకటస్వామి వర్థంతిని ఘనంగా నిర్వహించారు. మొదటి అప్పారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధాకర్, రమణయ్య, నాయకులు కోటేశ్వరప్ప, సాయినాథ్‌బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఉగాది సందర్భంగా మహిళలకు పోటీలు
అనంతపురం కల్చరల్, మార్చి 26: తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని కళాసాగర్ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో నగరంలోని కృష్ణ కళామందిర్‌లో మహిళలకు వివిధ రకాల పోటీలు ఆదివారం నిర్వహించారు. అకాడమి వ్యవస్థాపకులు కత్తి విజయకుమార్ మహిళలు మహరాణులు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వీరికి మ్యూజికల్ చైర్స్, డ్యాన్స్, పాటలు, క్యాట్‌వాక్, స్కిప్పింగ్, క్రాప్ట్ వర్క్ మొదలైన వాటిలో పోటీలు నిర్వహించారు. విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాధాదేవి, సలోమణి, సాహిత్య, విష్ణుశ్రీమతి పాల్గొన్నారు.
అనంత క్రీడా గ్రామాన్ని సందర్శించిన
గోకరాజు గంగరాజు
అనంతపురం సిటీ, మార్చి 26: అనంత క్రీడా గ్రామాన్ని ఆంధ్రా క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి, నరసాపురం పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు సందర్శించారు. ఆదివారం అనంత క్రీడా గ్రామంలో జరిగే బిజెపి రాష్ట్ర పధాధికారుల సమావేశానికి విచ్చేసిన ఆయన క్రికెట్ మైదానాన్ని సందర్శించారు. అనంతరం ఆర్‌డిటి ప్రోగ్రాం డైరెక్టర్, జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు మాంఛూ ఫెర్రర్, ఆర్‌డిటి ఛైర్మెన్ తిప్పేస్వామి, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బి.ఆర్ ప్రసన్న, ఆంధ్ర మాజీ రంజీ క్రీడాకారుడు షాబుద్దిన్‌లతో కొంత సేపుక్రికెట్ గురించి మాట్లాడారు