అనంతపురం

సమష్టి కృషితోనే రైల్వేల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఏప్రిల్ 15 : కార్మికులు, అధికారుల సమష్టి కృషి ద్వారానే రైల్వే అభివృద్ధి సాధిస్తోందని గుంతకల్లు రైల్వే డివిజినల్ మేనేజర్ అమిత్‌ఓజా అన్నారు. శనివారం స్థానిక రైల్వే ఇన్‌స్ట్యూట్‌లో రైల్వే వారోత్సవాలను పురస్కరించుకుని అవార్డులను ప్రదా నం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్లు రైల్వే డివిజన్ ఆదాయాన్ని సమకూర్చుకోవడంతోపాటు మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. కార్మికు లు, అధికారుల సమష్టి కృషి ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించి, జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకునే విధంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 32 క్యాటగిరిలో దాదాపు 834 వ్యక్తిగత అవార్డులను ప్రదానం చేశారు. అదేవిధంగా సికింద్రాబాద్, గుంతకల్లు డివిజన్‌లు సంయుక్తంగా దాదాపు 10 బెస్ట్ షీల్డ్‌లు ప్రదానం చేశాయి. రైల్వే సిబ్బందికి రూ, 18.32 లక్షల నగదు బహుమతులు అందజేశారు. ముఖ్యం గా బెస్ట్ గ్యాంగ్‌మెన్, బెస్ట్ ఎల్‌సి గేట్‌ల అవార్డులు గుంతకల్లు డివిజన్‌కు దక్కినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు డివిజినల్ అదనపు మేనేజర్ కెవి సుబ్బరాయుడు, దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు మాధవీలత, సీనియర్ డిపిఓ బలరామయ్య, సీనియర్ డిఎఫ్‌ఎం చంద్రశేఖర్, సిఎంఎస్ రమేష్‌తో పాటు వివిధ డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
బాలయ్యను విమర్శించే అర్హత వైకాపాకు లేదు
* ‘పురం’ టిడిపి నేతలు
హిందూపురం, ఏప్రిల్ 15 : ఎమ్మె ల్యే బాలకృష్ణ ప్రజా సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుంటే వైకాపా నాయకులు అర్థరహితంగా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం శోచనీయమని టిడిపి నేతలు అన్నారు. స్వయం గా వైకాపా అధినేత జగన్ బాలకృష్ణను మంచివాడంటూ ప్రశంసించగా స్థానిక నాయకులు మాత్రం ఫిర్యాదు చేయడంపై అంతర్మథనం చేసుకోవాలన్నారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో టిడిపి నేతలు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా హిం దూపురం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు రూ.40 కోట్లకు పైగా ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతుండగా ఇందు లో బాలయ్య పాత్ర ఎంతో కీలకమన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయా ంలో రూ.650 కోట్లతో చేపట్టిన శ్రీరామరెడ్డి తాగునీటి పథకం నాసిరకం పనుల వల్లే ప్రస్తుతం పిఏబిఆర్ నుం డి నీరు సక్రమంగా సరఫరా కావడం లేదన్నారు. అవినీతి, అక్రమాలతో కూరుకుపోయిన కాంగ్రెస్, వైకాపా నాయకులు బాలకృష్ణను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది పేదలకు ప్రాణాన్ని పోస్తున్న బాలకృష్ణను ఉద్దేశించి వైకాపా నాయకులు విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ముందుగా తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఆర్థిక నేరాలకు పాల్పడిన విషయాన్ని ఆ నాయకులు గమనించాలన్నారు. ఒక్క హిందూపురం మున్సిపాలిటీలోనే తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.5 కోట్ల నిధులను మంజూరు చేయించిన ఘనత బాలయ్యకే దక్కిందన్నారు. బాలకృష్ణ చొరవతో ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా పథకం ద్వారా హిందూపురం చెరువులకు నీరు వస్తాయన్నారు. బాలకృష్ణ ఎక్కడ ఉన్నా నిత్యం హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపైనే ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు జిల్లా, నియోజకవర్గ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పరిష్కరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఎన్టీఆర్ సుజల పథకాన్ని నియోజకవర్గంలో బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు వివరించారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు జెఇ వెంకటస్వామి, ఏ.నాగరాజు, షఫీవుల్లా, అమర్‌నాథ్, నంజప్ప, వెంకటస్వామి, సనావుల్లా, డిఇ రమేష్‌కుమార్, భాస్కర్, నంబూరి సతీష్, రోషన్‌అలీ, నజీర్ అహ్మద్, తిమ్మయ్య, నెట్టప్ప తదితరులు పాల్గొన్నారు.
తాగునీరు, ఉపాధి కల్పనపై
రాజీ లేకుండా పనిచేయాలి

అనంతపురం సిటీ, ఏప్రిల్ 15: వేసవిలో తాగునీరు, పశుగ్రాసం, ఉపాధి కల్పనపై రాజీ లేకుండా పనిచేయాలని, ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని జూయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం అధికారులను ఆదేశించారు. శనివారం స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిడిఓలు, తహశీల్దార్లు, ఆర్‌డబ్ల్యుయస్ ఇఈలు, ఉపాధి హామీ ఏపిఓలతో జెసి-1 వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తాగునీటికి సంబంధించి 213 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, భవిష్యత్తులో నీటి రవాణాకు బదులుగా ఈ గ్రామాల్లో శాశ్వత ప్రాతిపదికన నీటి పథకాలు ఏర్పాటుచేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా జెసి ఆదేశించారు. రవాణా చేస్తున్న గ్రామాల్లో అరకొరగా కాకుండా ప్రజలు సరిపడే నీటిని సరఫరా చేయాలన్నారు. జిల్లాలోని 3400 నివాసిత ప్రాంతాల్లో ఎక్కడా నీటి సమస్య ఉండకూదని, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ఏఈలు ప్రతి గ్రామాన్ని పరిశీలించాలన్నారు. మునిసిపాలిటీల్లో 2 రోజులకొకసారి సరఫరా చేసే ప్రాంతాలపై దృష్టి పెట్టి ప్రతి రోజూ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేశామని, అయితే ఈ చలివేంద్రాల్లో రక్షిత నీటిని మాత్రమే ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి అవసరమైన పశుగ్రాసాన్ని పంపుతున్నామని, ప్రస్తుతం జిల్లాలో 770 మెట్రికల్ టన్నుల శైలేజీ గడ్డి సిద్దంగా ఉందన్నారు. పశువులకు నీటి తొట్టెలు మరమ్మతులు చేయించామని, ఇంకా ఎక్కడైనా చేయించాల్సి వుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి హ్యాబిటేషన్‌లో ఖచ్చితంగా పనులు కల్పించాలని ఎంపిడిఓలను ఆదేశించారు. కూలీలకు వేతనం చెల్లింపులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే రూ.20 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైందని, మిగిలిన చెల్లింపులు కూడా సోమవారం నుండి వేగవంతమవుతాయన్నారు. ఉపాధి హామీ వేతనం చెల్లింపులు ఇకపై కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా ఖాతాదారులకు జమ అవుతాయని, ఢిల్లీలో ఇద్దరు ఉన్నతాధికారులు ఈ అంశంపైనే పర్యవేక్షిస్తున్నారన్నారు. పనుల కల్పనలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని, పనులు కల్పించలేదని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని జెసి అధికారులను హెచ్చరించారు.