అనంతపురం

రాష్ట్రంలో 11 గురుకుల విద్యాసంస్థలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, ఏప్రిల్ 15 : బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్రంలో 2017-18 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది గురుకుల పాఠశాలలు, రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర బిసి గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. శనివారం మడకశిరలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు నుండి పదో తరగతి వరకు 32 బిసి గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో తొమ్మిది గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా మడకశిర మండలం కె.గుండుమల, గుడిబండల్లో బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా మంజూరైనట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుండే విద్యార్థులను అడ్మిషన్లు చేసుకోనున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన తాత్కాలిక భవనాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలకు రూ.50 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటికే నిర్మాణాలకు సంబంధించి టెండర్లు కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. అదేవిధంగా పాఠశాలలకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది 77 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా బిసి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంస్థల్లో 75 శాతం బిసి విద్యార్థులు, 17 శాతం ఎస్సీ, 6 శాతం ఎస్టీలు, 3 శాతం ఓసి, ఒక శాతం అనాథ విద్యార్థులకు సీట్లను కేటాయించినట్లు చెప్పారు. మొదటి సంవత్సరం ఈ విద్యాసంస్థల్లో దగ్గరగా ఉన్న బిసి సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అందరికీ సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న కలిసి కృష్ణమోహన్‌ను సన్మానించారు. తర్వాత గుండుమలలో విద్యాసంస్థ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఇ రమణారెడ్డి, ఎఎస్‌డబ్ల్యుఓ రామప్ప తదితరులు ఉన్నారు.
సత్యసాయి సన్నిధిలో శాంతి యజ్ఞం
పుట్టపర్తి, ఏప్రిల్ 15: భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో విశ్వశాంతిని కాంక్షిస్తూ యజ్ఞాన్ని నిర్వహించారు. సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, ప్రసాదరావు తదితరులు శనివారం పూర్ణచంద్ర ఆడిటోరియంలో విశ్వశాంతి యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ నెల జరగనున్న సత్యసాయి ఆరాధనోత్సవాల్లో భాగంగా లోకోద్ధరణకై అవతరించిన మహనీయుడు సత్యసాయి అనుగ్రహాన్ని, ఆశీస్సులను ఆకాంక్షిస్తూ యజ్ఞాన్ని నిర్వహించారు. హోమగుండాలు, యజ్ఞ క్రతువులు, రుత్వికుల వేద పఠనం నడుమ మంగళ కలశ పూజ, పుష్పాభిషేకం, కుంకుమాభిషేకం, వేదపారాయణం నిర్వహించారు. 108మంగళ కలశాలను ఏర్పాటుచేసి సత్యసాయి బాబా చిత్రపటాన్ని నెలకొల్పి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశేష భక్తజనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.