అనంతపురం

తెలుగు తమ్ముళ్ల వాగ్వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఏప్రిల్ 15: తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో ఆ పా ర్టీ నాయకులు, కార్యకర్తల మధ్య వా గ్వివాదం చోటు చేసుకుంది. శనివారం పుట్టపర్తి టిడిపి కార్యాలయంలో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం తమ్ముళ్లు పార్టీ నీ వల్ల నాశనమవుతోందంటూ ఒకరు, మీ వల్లే అంటూ మరొకరు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. ఇటీవల సహకార సంఘం అధ్యక్ష పదవి నుండి ముమ్మనేని వెంకటరాముడును తప్పించడం పట్ల ఆయన వాగ్వివాదానికి దిగాడు. 30 ఏళ్లుగా పుట్టపర్తి సహకార సంఘం టిడిపి దక్కించుకోగా కొందరు పార్టీలోని స్వార్థపరుల వల్ల ఇటీవల పదవి వీగిపోయిందన్నారు. వెన్నుపోటు రాజకీయాల వల్ల తాను అధ్యక్ష పదవిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పల్లె రఘునాథరెడ్డి సమస్యలను పరిష్కరించడంలో విఫలుడయ్యారని ఆ పార్టీ నాయకులే విమర్శించడం చర్చనీయాంశమైంది. మున్సిపల్ చైర్మన్ పిసి.గంగన్న మాట్లాడుతూ పల్లె రఘునాథరెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాను టిడిపి మున్సిపల్ చైర్మన్ నా? లేక వైసిపి చైర్మన్ నా? తనకే అర్థం కాని దుస్థితి తలెత్తుతోందన్నారు. బిల్లులు కాకుండా, కౌన్సిలర్ల పనులను అడ్డుకుంటున్నారని, టెండర్లను సైతం కర్నూలు, కడప జిల్లాలకు చెందిన ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టాడన్నారు. రసాభాసగా సాగిన ఈ సమావేశంలో ఒక వర్గం నాయకులు అర్ధాంతరంగా వైదొలిగారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కన్వీనర్ రామాంజనేయులు, మాజీ జెడ్‌పిటిసి చెన్నకేశవులు, పుడా మాజీ చైర్మన్ కడియాల సుధాకర్‌నాయుడు, ఆస్పత్రి కమిటీ చైర్మన్ జయరామ్‌నాయుడు, బెస్తచలపతి, గూడూరు ఓబులేసు, కోనంకి చంద్రశేఖర్, చింతా దామోదర్, ఉమాపతి, గంగాద్రి, జయప్రకాష్, పల్లె వ్యక్తిగత సహాయకుడు ఎద్దుల ఈశ్వర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్‌కు
షోకాజు నోటీస్
అనంతపురం అర్బన్, ఏప్రిల్ 15: పుట్టపర్తి ఎమ్మెల్యే, చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డిపై గత కొంతకాలంగా పత్రికలు, ఇతర మార్గాల ద్వారా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ పి.సి గంగన్నకు టిడిపి జిల్లా అధ్యక్షులు పార్ధసారధి శనివారం షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో మీకు ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలి లేదా జిల్లా, రాష్ట్ర పార్టీ అధిష్టానానికి తెలియజేయాలన్నారు. అంతేగాని ఇష్టారాజ్యాంగా మాట్లాడి ప్రసార మాద్యమాలకెక్కాలని చేయటం సముచితం కాదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో వుండి క్రమశిక్షణారహితంగా ప్రవర్తించినందుకు మీ మీద తగిన చర్య ఎందుకు తీసుకోకూడదో తెలపాలన్నారు. ఈ నోటీస్ అందిన ఐదు రోజుల్లో సంజాయిషి ఇవ్వని పక్షంలో ఆధారాలతో తగిన చర్య తీసుకోవడం జరుగుతుందని నోటీసులో పేర్కొన్నారు.
తాగునీటి సమస్యపై దృష్టి సారించండి
* సమస్య ఉన్న గ్రామాలకు తక్షణమే నీటిని సరఫరా చేయండి
* మంత్రి పరిటాల సునీత
ధర్మవరం, ఏప్రిల్ 15: తాగునీటి సమస్య వున్న గ్రామాలను గుర్తించి తక్షణమే ఆ గ్రామాలకు నీటిని సరఫరా చేయాలని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమం, సెర్ఫ్ శాఖ మంత్రి పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. శనివారం కనగానపల్లి మండలం ఎంపిడిఓ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో తాగునీటి సమస్యపై ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా తాగునీటి సమస్య పరిస్థితిని అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మద్దలచెరువు, వేపకుంట, ముక్తాపురం, కొత్త హౌసింగ్ కాలనీ, పర్వతదేవరపల్లి గ్రామాలకు పైపులైను అవసరమని, కనగానపల్లి ఎస్‌సి, బిసి కాలనీల్లో తాగునీటి సమస్య వుందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మండలంలోని 6 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులనుద్దేశించి మాట్లాడుతూ మండలంలోని 54 గ్రామాలకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా నీరందుతోందని, నీటిని వినియోగించుకోవాలన్నారు. కొత్తగా నీటి సమస్య తలెత్తిన గ్రామాల్లో 10 రోజుల్లోపు పైపులైన్లు, మోటార్లు మిగించి నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య తీవ్రంగా వున్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. కోనాపురం గ్రామంలో 4 విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ అవసరం వుందని, అలాగే నెమలిపురిలో లో ఓల్టేజీ సమస్య వుందని అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడంతో వెంటనే సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యను తీర్చాలని ఆదేశించారు. అనంతరం ఉపాధి హామీ పనులపై ఎంపిడిఓ జయమ్మతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో 5వేల మంది కూలీలు వున్నారని, ప్రస్తుతం 2500 మంది పనులకు వస్తున్నారని ఎంపిడిఓ మంత్రికి తెలిపారు. అలాగే ఉపాధి పనుల బిల్లులు రూ.82 లక్షల వరకు పెండింగ్‌లో వున్నాయని వివరించారు. ఉపాధి పనులను ప్రతి ఒక్కరికి కల్పించాలని, ఏ గ్రామంలోను పనులు లేకుండా వలస వెళ్ళకూడదని, పెండింగ్‌లో వున్న బిల్లులకు రూ.10 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని పిడి మంత్రికి ఈ సందర్భంగా విన్నవించారు. అదేవిధంగా బాలేపాళ్యం, కోనాపురం, పర్వతదేవరపల్లి గ్రామాల్లో నూతన అంగన్‌వాడీ భవనాలను నిర్మించాలని మంత్రిని అధికారులు కోరారు. దీంతో త్వరలోనే అంగన్‌వాడీ భవనాల నిర్మాణం జరుగుతుందని, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. ఇందులో ఏ పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పంపిణీలో పలుచోట్ల ఇప్పటికే అక్కడక్కడ సమస్యలు తలెత్తుతున్నాయని, అధికారులు వాటిని వెంటనే సవరించుకోవాలన్నారు. నూతనంగా మంజూరైన ఇళ్లను లబ్దిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరగా నిర్మించుకోవాలని, 100శాతం గ్యాస్ కనెక్షన్ల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గ్రామాల్లో బోర్లు, డ్రైనేజీ సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులతోపాటు అనధికారులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు