అనంతపురం

జిల్లా అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఏప్రిల్ 30 : జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సూచి ంచారు. ఆదివారం కలెక్టరేట్‌లోని రెవె న్యూ భవన్‌లో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి దేవినేని అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ అభివృద్ధి అనే బం దీకి అధికారులు, ప్రజా ప్రతినిధులు రెండు చక్రలాంటి వారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేసి జిల్లాను అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎనలేని ప్రేమ ఉందని, ఇం దులో భాగంగానే తనను జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమించారన్నారు. అంతేగాకుండా జిల్లాలోని బైరవానితి ప్ప, పేరూరు ప్రాజెక్టులను మూడు నెలల్లో పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఇప్పటికే జీడిపల్లి జలాశయాన్ని పూర్తి చేశామన్నారు. హెచ్‌ఎల్సీ, మైనర్ ఇరిగేషన్ ద్వారా 1700కోట్లు ఖర్చు చేశామన్నా రు. వ్యవసాయ, వాటి అనుబంధ శా ఖలు, తాగునీరు, నీరు-ప్రగతి అంశాలపై ప్రధానంగా సమీక్షిస్తూ జిల్లాలోని తాగునీటి పథకాల గురించి ఆర్‌డబ్ల్యూయస్ ఎస్‌ఇని అడిగి తెలుసుకున్నారు. వేయ్యి గ్రామాలు బోర్లపై ఆధారపడి ఉన్నాయని, 262 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందిన గుర్తించామని ఎస్‌ఇ వివరించారు. సపిడబ్ల్యుయస్ స్కీమ్, పంచాయతీరాజ్ స్కీముల ద్వారా సరఫరా చేసే త్రాగునీటికి విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని మంత్రి ఎపియసిపిడిసిఎల్ ఎస్‌ఇని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఖర్చు పెట్టే ప్రతిపైసా జవాబుదారితనంతో పారదర్శకంగా ఖర్చు చేయాలన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడంతో జిల్లాకు పదివేల నుండి 12వేల కోట్ల పెట్టుబడితో కియో మోటర్స్ సంస్థ వస్తోందన్నారు. కియోపై పెనుకొండ ఎమ్మెల్యే మాట్లాడుతూ కియోకు భూములిచ్చిన రైతులకు ఎకరాకు పదిన్నర లక్షల రూపాయలు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి సొమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతితక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అన్నారు. 23.80కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందని, 1700కోట్లు రూపాయలు కేంద్రం నుంచి విడుదల కావాల్సి ఉందన్నారు. హార్టికల్చర్ కింద మామిడితోటలు ఎండిపోకుండా 80 శాతం సబ్సిడీతో రైతులకు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామన్నారు. విత్తనాలు మంచి నాణ్యత కల్గినవి అందించాలన్నారు. కాయలను సేకరించేటప్పుడు స్థానిక ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పరిశీలించేందుకు తీసుకెళ్లాలని, విత్తన సరఫరా చేసే సంస్థల స్టాకును కలెక్టర్ పరిశీలించాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ మాట్లాడుతూ జిల్లాలోని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా తనను నియమించారని, ఆ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మంత్రి పరిటాల సునీతమ్మ మాట్లాడుతూ జిల్లాలో 32 చెరువులకు నీర్చించిన ఘనత టిడిపి ప్రభుత్వానిదే అన్నారు. దీంతో ప్రజలు వరి, కూరగాయలు, పండ్లతోటలు పెంచుతున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ రాజకీయాలు, పార్తీలకతీతంగా సహకరించి జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎంపి నిమ్మల కృష్టప్ప, ఎమ్మెల్యేలు పార్థసారధి, హనుమంతరాయచౌదరి, విశే్వశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు కత్తినరసింహారెడ్డి, వెన్నపూస గోపాల్‌రెడ్డి, తిప్పేస్వామి, జడ్పీ చైర్మన్ చమన్, కలెక్టర్ వీరపాండియన్, జెసి ఖాజామొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.