అనంతపురం

జిల్లాకు రూ.1032 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూన్ 4: జిల్లాలో పంట నష్టపోయిన రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.1032 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం నవ నిర్మాణ దీక్ష మూడోరోజు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయము- అనుబంధ శాఖలు-నీటి యాజమాన్యము- నిలకడతో కూడిన వ్యవసాయం అనే అంశంపై ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు అందించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ రాష్ట్ర మొత్తానికి రూ.1680 కోట్లు మంజూరు చేస్తే అందులో జిల్లాకు రూ.1032 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇందులో రూ.511 కోట్లు కేంద్రం సహాయం చేస్తోందని, మిగిలిన మొత్తం రూ.1100 కోట్లకు పైగా రాష్ట్రం భరిస్తోందన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లా రైతాంగం 80 శాతం సబ్సిడీతో అందిస్తున్న మైక్రో ఇరిగేషన్ కింద డ్రిప్, స్ప్రింక్లర్‌లు పొందాలన్నారు. ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావుమాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుకెళ్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని విభజించారన్నారు. ఎమ్మెల్యే పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ కరవు రహిత జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మాట్లాడుతూ రైతులందరూ పంట కుంటలు తవ్వుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ స్వరూప, కలెక్టర్ వీరపాండ్యన్, జెసి 2 సయ్యద్ ఖాజామొహిద్దీన్‌లు ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పండ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సదస్సులో పాల్గొన్నారు.
ఉల్లాసంగా... ఉత్సాహంగా...
* నగరంలో ఆనంద ఆదివారం
అనంతపురం కల్చరల్, జూన్ 4: నగరంలో మునిసిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన ఆనంద ఆదివారం ( హ్యాపీ సండే ) కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. మునిసిపల్ సిబ్బంది, ప్రజలు ఎంతో ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధించగలమని నగర మేయర్ మదమంచి స్వరూప, నగర పాలక సంస్థ కమిషనర్ మూర్తి పేర్కొన్నారు. యోగాతో ప్రారంభమైన కార్యక్రమం వాలీబాల్, షటిల్, తాడులాగుట, రింగ్, కరాటే, మ్యూజికల్ చైర్ తదితర క్రీడలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. మేయర్‌తో పాటు పలువురు అధికారులు ఎంతో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హ్యాపీ సండే కార్యక్రమం పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇది అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తోందని మేయర్ పేర్కొన్నారు. ఉల్లాస భరితంగా, ఉత్సాహ పూరితంగా, సంతోషానందాలతో సాగిన హ్యాపీ సండే కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.