అనంతపురం

‘ప్రజాకర్షణ’ పనిలో పార్టీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 19:రాష్ట్రంలో ముందస్తు, దేశ వ్యాప్తంగా ఒకే దఫా సార్వత్రిక ఎన్నికలు వస్తాయో, రావో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ 2019 ఎన్నికల దృష్ట్యా అధికార, ప్రతిపక్ష పార్టీలు ‘ప్రజాకర్షణ’ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు ఎవరి అజెండాతో వారు వెళుతున్నట్లు జిల్లా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైకాపా, వామపక్ష పార్టీలు ఎవరికి వారు తమదైన శైలిలో కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం జిల్లా రైతాంగానికి రూ.1032 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, తాజాగా రూ.419 కోట్ల వాతావరణ ఆధారిత పంటల బీమాను మంజూరు చేయడంతో టిడిపి ఈ నెల 24 నుంచి రైతు కృతజ్ఞత సభలకు శ్రీకారం చుట్టింది. జిల్లాకు చెందిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తన సొంత నియోజకవర్గం రాయదుర్గంలో జిల్లా స్థాయి రైతు కృతజ్ఞత సభ నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాను ఎడారీకరణ నుంచి కాపాడటంతో పాటు కరవు రహితంగా మార్చేందుకు ము ఖ్యమంత్రి నారా చంద్రబాబు కం కణం కట్టుకున్న విషయాల్ని ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకు వెళ్లడమే లక్ష్యంగా ఈ సభలకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలతో జిల్లాలోని అన్ని చెరువులను నింపేందుకు సిఎం కృత నిశ్చయంతో ఉన్నారని, ఇప్పటికే సుమారు 28 టిఎంసిల నీటిని హంద్రీ నీవా ద్వారా జిల్లాకు తరలించి తాగునీటి అవసరాలు తీర్చడం, సుమారు 32 చెరువులు, చెక్‌డ్యాంలు నింపారని ప్రజలకు వివరించనున్నారు. జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం జల ప్రాజెక్టులపై పదేపదే ప్రజలకు తెలియజేస్తుండటం తెలిసిందే. అలాగే అనంతపురం జిల్లా కరవు తీరే వరకు తన జన్మదినాన్ని సైతం ఏటా ఈ జిల్లాలోనే జరుపుకుంటానని ప్రకటించిన విషయం విదితమే. వీటితో పాటు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చడం, కియా, విమాన పరికరాల తయారీ కంపెనీ ఏర్పాటుతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ, గార్మెంట్స్ పరిశ్రమలు నెలకొల్పడం, ఇతరత్రా పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా టిడిపి నేతలు ఐక్యతను చాటుకుంటూ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, సంక్షేమ పథకాల అమలులో లోపాలతో పాటు జల వనరుల ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, భూముల కుంభకోణాలు అస్త్రాలుగా ముందుకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కూడా ‘గడప గడపకూ వైకాపా’ను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే సిఎం చంద్రబాబు అవినీతిపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. భూ కుంభకోణాల్లో ప్రభుత్వం, సిఎం, ఆయన కుమారుడి పాత్రపైనా ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పర్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ ఆధారిత పంటల బీమా సొమ్ము చెల్లింపులో ఎంగిలి చేత్తో విదిల్చినట్లుగా అరకొరగా నష్ట పరిహారం మంజూరు అంశాలపై ఆ పార్టీ జిల్లా నేతలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అలాగే హంద్రీ నీవా తొలి దశ కాలువను రూ.1030 కోట్లతో వెడల్పు చేసే పనిలో నిధులు దుర్వినియోగం గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వైకాపా ఆధ్వర్యంలో గడప గడపకూ కార్యక్రమంపై జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే పార్టీలో వర్గాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చతికిల పడిందన్న విషయాన్ని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చించుకుంటుండటం విశేషం. ఈ పరిస్థితుల్లో గడప గడపకూ కార్యక్రమం ద్వారానే ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎంత కష్టమైనా కొనసాగించాల్సిందేనని నిర్ణయించడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైనే జిల్లాలో అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో ఉనికిని చాటుకునే యత్నం చేస్తోంది. వామ పక్షాల నేతలు రైతు సంక్షేమ పథకాలు, జిల్లాలో పరిశ్రమల స్థాపన, కరవు నివారణ చర్యల్లో వైఫల్యాలపైనే పోరాటాలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీల అధిష్టానాలు పొత్తులపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నప్పటికీ ప్రస్తుతం వారి అజెండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలేనని స్పష్టంగా చెబుతున్నారు.

బాలయ్యకు కొత్త చిక్కులు!
హిందూపురం, జూన్ 19: ఇటీవలి కాలంలో పురం తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఉక్కిరి బిక్కిరైన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మరో సమస్య ఎదురవు తోంది. వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ వ్య వహారంతో సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. దీంతో సిఎం జోక్యం చేసుకుని శేఖర్‌ను తప్పిం చారు. అప్పటి నుండి బాలకృష్ణ హిందూపురం వైపు కనె్నత్తి చూడలేదు. తాజాగా పురం మున్సిపల్ వైస్ చైర్మన మార్పు రాజకీయం జోరందుకుంది. ఇచ్చిన వాగ్దానం మేరకు వైస్ ఛైర్మన్ జెపికె రాము స్థానంలో తనకు పదవి అప్పగించాలని కౌన్సిలర్ రోషన్‌అలీ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 23, 24వ తేదీల్లో హిందూపురం పర్యటనకు వస్తారన్న సమాచారంతో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కోసం మైనార్టీలు పట్టుబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మైనార్టీలకు వైస్ ఛైర్మన్ పదవి ఇస్తామని స్వయంగా బాలకృష్ణ హామీ ఇచ్చారని పదవిని ఆశిస్తున్న కౌన్సిలర్ రోషన్‌అలీ చెబుతున్నారు. ఇందులో భాగంగా రోషన్‌అలీ గత రెండు రోజులుగా ముతవల్లీలు, టిడిపి నేతలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణ ప్రస్తుత పర్యటనలో ఏ విషయం స్పష్టం చేయాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. బాలకృష్ణ పర్యటనలో భాగంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే మంచి అవకాశంగా భావించిన రోషన్‌అలీ వర్గీయులు వైస్ ఛైర్మన్ పదవి కోసం గట్టి ప్రయత్నాలకు పావులు కదుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు, ముస్లిం మత పెద్దలను కలుస్తూ తనకు సహకరించాలని విన్నవిస్తున్నారు.
గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోపాటు టిడిపి ముఖ్య నేతలు కూడా వైస్ ఛైర్మన్ పదవి ఇస్తామని భరోసా ఇచ్చారని, అయితే మూడేళ్లు గడిచినా ఆ విషయంపై కనీసం స్పందించడం లేదని అలీ పెదవి విరుస్తున్నారు. మూడుసార్లు వరుసగా తాను కౌన్సిలర్‌గా గెలిచానని, గత ఎన్నికల్లో మైనార్టీ వార్డుల్లో నందమూరి బాలకృష్ణకు మెజార్టీ వచ్చిందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త కృష్ణమూర్తి, పిఏ వీరయ్య దృష్టికి రోషన్ తీసుకెళ్ళారు. గతంలో తరహాలో బాలకృష్ణ మళ్లీ వాయిదా వేస్తే అంగీకరించబోమని రోషన్‌అలీ వర్గీయులు నేతలతో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం స్థానిక టిడిపి ముఖ్యనేతలను అయోమయానికి గురి చేస్తున్నట్లు సమాచారం. అవసరమయితే కౌన్సిలర్ పదవికి తాను రాజీనామా చేస్తానని రోషన్‌అలీ ఓ మాజీ ఎమ్మెల్యేతో స్పష్టం చేసినట్లు సమాచారం. జిల్లాలో ఎన్నికల సందర్భంగా కుదిర్చిన ఒప్పందం మేరకు మున్సిపల్ ఛైర్మన్‌లు, వైస్ ఛైర్మన్‌లు, ఎంపిపి వంటి పదవులను మార్చుతున్నారని, ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదని వాదిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుత మున్సిపల్ వైస్ ఛైర్మన్ జెపికె రాము తన పదవిని మార్చేందుకు ప్రయత్నిస్తే ఎలా స్పందిస్తారోనన్న అయోమయం ముఖ్య నేతల్లో నెలకొంది. తెలుగుదేశం పార్టీకి గట్టి ఓటుబ్యాంక్ కలిగిన ఆర్యవైశ్య సామాజిక వర్గంలో రాముకి మంచి పట్టు ఉంది. అటు రోషన్‌అలీ ఇటు రాములు పట్టుదలతో ఉండటంతో మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి మార్పు విషయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

24 నుండి రైతు కృతజ్ఞతా సభలు

అనంతపురం కల్చరల్, జూన్ 19: ఈ నెల 24వ తేదీ నుండి జిల్లాలో రైతు కృతజ్ఞతా సభలు నిర్వహించనున్నట్లు మంత్రు లు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పేర్కొన్నారు. ఈమేరకు టిడిపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారథి అధ్యక్షతన సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. జిల్లాలో 20 ఏళ్ల కాలంలో 17 ఏళ్లు కరవుకు గురైన కర్షకుల కన్నీరు తుడిచి, భవిష్యత్ పట్ల భరోసా కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇపుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వేరువేరుగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతు సమస్యల పట్ల చిత్తశుద్ధి, అవ్యాజమైన ప్రేమ, దృఢమైన సంకల్పం వుంటే అసాధ్యమన్నది ఏదీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరూపించారన్నారు. చంద్రబాబుకు తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జిల్లా రైతాంగం కూడా సిఎం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని, కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నారని వారు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా రైతులకు రూ.1032 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, రూ.419 కోట్ల ఇన్సూరెన్స్ వేరువేరుగా రైతుల ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు. హెక్టారుకు రూ.15 వేలు చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు. దీనిని రైతు సమస్యల పట్ల స్పందించే నాయకుడు చంద్రబాబు తీసుకున్న చారిత్రక నిర్ణయంగా మంత్రులు పేర్కొన్నారు. మూడేళ్ల పాలనా కాలంలో టిడిపి ప్రభుత్వం రైతుకు అన్ని విధాలా అండగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా సంక్లిష్ట సమయంలో, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని గట్టెక్కించేందుకు సిఎం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నామన్నారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి రైతు ఆశీస్సులు కోరుతూ, సిఎంకు ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రైతు కృతజ్ఞతా సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేనివన్నారు. ప్రతిపక్షాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో మేయర్ స్వరూప, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మొద్దీన్, బివి.వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి వలలో మున్సిపల్ ఉద్యోగి
* రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
కదిరి, జూన్ 19: కదిరి మున్సిపల్ కార్యాలయం లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నారాయణప్ప రూ. 8 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఎసిబి అధికారులకు పట్టుబడా డడు. ఎసిబి డిఎస్పీ జయరాంరాజు తెలిపిన వివరాలు మేరకు.. గతంలో మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన జయప్రకాష్ 2014లో పదివీ విరమణ పొందారన్నారు. జయప్రకాష్ భార్య రామాంజులమ్మ ఆరోగ్యం సరిగాలేదని, ఆరోగ్యశ్రీ కింద రూ. 30 వేలు బిల్లు పెట్టాలని అకౌంటెంట్ నారాయణప్పను కోరగా రూ. 10 వేలు లంచం అడిగాడన్నారు. దీంతో అతను రూ. 8 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకొని, ఎసిబి అధికారులను ఆశ్రయించారన్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రూ. 8 వేలు జయప్రకాష్ నుండి లంచం తీసుకుంటూ నారాయణప్ప పట్టుబడ్డారన్నారు. అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి కర్నూలు ఎసిబి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎసిబి డిఎస్పీ తెలిపారు. ల ఎసిబి సిఐలు ఖాదర్‌బాషా, ప్రతాప్‌రెడ్డి, చక్రవర్తి పాల్గొన్నారు.

నెలాఖరులో జిల్లాలో సిఎం పర్యటన!

అనంతపురం, జూన్ 19:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెలాఖరులోగా మరోమారు జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవలే ఉరవకొండ పర్యటనకు వచ్చి ఏరువాక పౌర్ణమి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ నెలలో మళ్లీ జిల్లారానున్నట్లు జిల్లా అధికారులకు అనధికారిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కియా కార్ల కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండకు వచ్చినపుడే జిల్లాకు రెండోసారి రానున్నట్లు పోలీసు శాఖకు సూచనప్రాయంగా సమాచారం వచ్చిందని సమాచారం. అయితే తేదీ విషయంలో స్పష్టం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు, నాలుగు జిల్లాల్లో వరుస పర్యటనలకు సిఎం ప్రణాళిక రూపొందించుకుని అందులో భాగంగా ఈ నెలలో ఈ నెల 24, లేదా 25వ తేదీ జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే 24వ తేదీ నుంచి జిల్లాలో రైతు కృతజ్ఞత యాత్రలు ప్రారంభిస్తున్నట్లు సోమవారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. ఈ నెల 25 లేదా నెలా ఖరులోగా ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని స మాచారం. జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సైతం అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోం ది. జిల్లా మంత్రు లు, టిడిపి జిల్లా కమిటీ నిర్ధారించకపోవడం విశేషం.
కదిరిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
కదిరి, జూన్ 19: పట్టణంలో గత నాలుగు రోజులుగా అక్రమ లే ఔట్లను తొలగించిన మున్సిపల్ అధికారులు సోమవారం గుంటూరు నుండి వచ్చిన టాస్క్ఫోర్స్ బృందంతో కలిసి మున్సిపల్ అనుమతి లేకుండా నిర్మించిన 20 భవనాలను స్వల్పంగా కూల్చివేశారు. ఎన్‌జిఓ కాలనీలో అక్రమంగా నిర్మించిన అపార్ట్‌మెంట్‌ను మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్ ఆధ్వర్యంలో జెసిబి యంత్రం ద్వారా కొంతవరకు కూల్చి వేశారు. గుంటూరు నుండి వ చ్చిన టాస్క్ఫోర్స్ ప్రత్యేక బృందం సభ్యులు ఆర్‌డిటిపి వెంకట చలపతిరెడ్డి, ఎసిపి శివనారాయణ, టిపిఓ మ ణిచంద్రశేఖర్, టిపిఎఫ్ మంజుల, టిపిఎస్ మారుతిప్రసాద్‌లు ఓ బృం దంగా ఏర్పడి ఎన్‌జిఓ కాలనీలో అక్ర మ కట్టడాలపై కొరడా ఝుళిపించారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలనీలో అపార్ట్‌మెంట్ ఏడు అంతస్తులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, మున్సిపాల్టీలో నాలుగు అంతస్తులకే అనుమతి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఈ అపార్ట్‌మెంట్ యజమానికి నోటీసులు కూడా ఇచ్చామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మూడు అంతస్తులు పైన భవనాలు నిర్మిస్తే కూల్చివేస్తామన్నారు. మున్సిపల్ శా ఖా మంత్రి నారాయణ, కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశాల మేరకు అక్రమ భవనాలు, లేఔట్లు తొలగిస్తున్నామన్నారు. మున్సిపల్ అనుమతి లే కుండా 120 భవనాలు ఉన్నట్లు గుర్తించామని, మున్సిపల్ యాక్ట్ 214-ఎ ప్రకారం మున్సిపాల్టీ అనుమతి లేకుం డా మూడు అంతస్తుల పైకి భవనాలు నిర్మిస్తే మూడు సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందన్నారు. కాగా అక్రమ కట్టడాలు తొలగిస్తున్న సమయంలో ము న్సిపల్ ఛైర్‌పర్సన్ షేక్ సురియా భానుతోపాటు కౌన్సిలర్లు వచ్చి అధికారులతో మాట్లాడారు. ఉన్నపళంగా నోటీసులు ఇస్తే వారి పరిస్థితి ఏమిటని, మున్సిపాల్టీకి ఆదాయం వచ్చేలా ప్ర యత్నించాలే కానీ భవనాలు కూల్చివేయడం తగదన్నారు. అ క్రమ కట్టడా లు క్రమబద్దీకరణకు నెల రోజులు సమయం కావాలని వారు అధికారులను కోరారు. మున్సిపల్ కమిషనర్ బుధవారం నుండి అక్రమ కట్టడాలు, అక్రమ లే ఔట్లు తొలగిస్తామన్నారు.
రూ.23 కోట్లతో మార్కెట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
* ఎట్టకేలకు జివో జారీ చేసిన ప్రభుత్వం
హిందూపురం టౌన్, జూన్ 19: అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన నూతన కూరగాయాల మార్కె ట్ నిర్మాణానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభు త్వం ఆమోద ముద్ర వేసింది. రూ.23 కోట్లతో మార్కెట్ నిర్మాణ ప్రణాళికకు పచ్చజెండా ఊపింది. పురపాలక శాఖ తయారు చేసిన ప్రణాళికను ఆమోదిస్తూ సోమవారం జివోనెంబర్ 439ని జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మార్కెట్ నిర్మాణానికి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రయత్నాలతో రూ.10 కోట్ల గ్రాంట్‌ను ప్రభుత్వం మంజూరు చేయడానికి అంగీకరించింది. మరో రూ.10 కోట్లను గుడ్‌విల్ యాక్షన్ ద్వారా సేకరించాలని, రూ.3కోట్లు మున్సిపాలిటీ భరించాలని ఆదేశాలు జారీ చేశారు. గుడ్‌విల్ యాక్షన్ ద్వారా మార్కెట్‌ను నిర్మించాలని సూచించింది. మార్కెట్‌లో 271 గదులను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 271 గదుల నిర్మాణానికి తయారుచేసిన సమగ్ర ప్రణాళికను రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగం ఆమోదించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మా ర్కెట్ నిర్మాణంపై పడిన చిక్కుముడి వీడినట్లయింది. అయితే సమగ్ర ప్రణాళికతోపాటు గుడ్‌విల్ యాక్షన్ నిర్వహణ అనంతరం మా ర్కెట్ నిర్మాణంపై పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడికానున్నాయి. ఇదిలా ఉండగా మార్కెట్ నిర్మాణంపై అటు వ్యాపారులతోపాటు ప్రతిపక్ష వైకాపా తదితర రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. గత రెండు నెలల క్రితమే మార్కెట్ నిర్మాణంపై ఉత్తర్వులు వస్తాయని స్థానిక టిడిపి నేతలు ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఉత్తర్వుల జారీలో జాప్యమైనట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు పోర్చుగల్ నుండి షూటింగ్ ముగించుకొని బాలకృష్ణ హైదరాబాద్‌కు చేరుకోగానే మార్కెట్ నిర్మాణంపై ఉన్నతాధికారులతో సంప్రదించగా సమగ్ర ప్రణాళికలు ఉండటంతో జివో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈవిషయంలో టిడిపి నేతల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అనుకూలిస్తే త్వరలోనే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణచే భూమిపూజ నిర్వహింప చేయాలని టిడిపి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
రైతు సంక్షేమ ప్రభుత్వం టిడిపి లక్ష్యం
రామగిరి, జూన్ 19: రైతు సంక్షేమమే టిడిపి లక్ష్యమని స్ర్తి, శిశు సం క్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నా రు. సోమవారం మంత్రి స్వగ్రామం వెంకటాపురంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతుల క ష్టాలు, వారి ఇబ్బందులను గుర్తించి సిఎం చంద్రబాబునాయుడు ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా వేరువేరుగా మంజూరు చేసి రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతోందన్నారు. రైతులకు వాతావరణ బీమా ఆలస్యంపై కాంగ్రెస్, వైసిపి నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా వున్న రఘువీరారెడ్డి ఆయన హ యాంలో ఏమి చేశారో చెప్పాలన్నారు. రైతుల గురించి చంద్రబాబుకన్నా ఎవరు ఎక్కువ శ్రద్ధ చూపారో తెలియజేయాలన్నారు. రైతుల కోసం నదుల అనుసంధానం, కాలవల ద్వారా చెరువులకు నీళ్లు, ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా, తక్కువ ధరతో వున్నపుడు కొనుగోళ్లు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి రైతులకు అండగా నిలుస్తోందన్నారు. కాంగ్రెస్, వైసిపి నాయకులు రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పి ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టినపుడు ఎవరూ సహకరించవద్దని మంత్రి సూచించారు. ప్రజలు, లబ్దిదారుల్లో ప్రశ్నించే తత్వం రావాలని మంత్రి సూచించారు. సమావేశంలో టిడిపి నాయకులు కొండన్న, రామ్మూర్తినాయుడు, సింగిల్ విండో ప్రెసిడెంట్ వెంకటేశులు పాల్గొన్నారు. మండలంలో మంజూరైన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా పంపిణీ చేశారు. వెంకటాపురంలో జరిగిన కార్యక్రమంలో దుబ్బార్లపల్లికి చెందిన కురబ మహేంద్ర కుటుంబానికి రూ.3,52,912లు, మంగాపురం కురబ గంగయ్యకు రూ.20వేలు, ఆదెమ్మకు రూ.26,890, నసనకోట ఆంజనేయులుకు రూ.23వేలు, రామగిరి అబ్దుల్ రహిమాన్‌కు రూ.10వేలు, దుద్దుకుంట పల్లికి చెందిన నరసమ్మకు రూ.14వేలు, వెంకటేష్‌నాయక్‌కు రూ.18వేలు పంపిణీ చేశారు.
నిస్వార్థ సేవకుడు ఫాదర్ ఫెర్రర్
* ఫెర్రర్ ఘాట్ వద్ద ఘనంగా వర్ధంతి వేడుకలు
బత్తలపల్లి, జూన్ 19: కరవు జిల్లాగా ప్రసిద్ధిగాంచిన అనంతలో బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం నిస్వార్థ సేవకుడిగా మన్ననలు పొందిన ఆర్‌డిటి సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ 8వ వర్ధంతి సందర్భంగా సంస్థ డైరెక్టర్లు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. బత్తలపల్లిలోని ఫాదర్ ఫెర్రర్ ఘాట్‌ను వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం సంస్థ సిబ్బంది పుష్పాలతో అలంకరించారు. సాయంత్రం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిస్టర్ అనె్న ఫెర్రర్ తన మనుమరాళ్లతో కలిసి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఉదయానే్న ఘాట్‌ను సందర్శించి పుష్పగుచ్ఛం వుంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక సేవ చేయాలనే కోరిక కొందరికే కలుగుతుందని, అందులో ఫాదర్ ఫెర్రర్ ఒక్కరన్నారు. అనంతరం ఆర్‌డిటి మెయింటేనెన్స్ డైరెక్టర్ సుధీంద్రరావు, రీజనల్ డైరెక్టర్ మల్లికార్జున, హనుమంతరెడ్డి, ఎమ్మెల్యే వెంట వీరనారప్ప, సుబ్బరాయుడు, ఈశ్వరయ్య, వెంకటేశ్వరచౌదరి, నెట్టెం రామకృష్ణ, ముతవల్లి హసన్ బాషా, ఆర్‌డిటి డైరెక్టర్లు టోరిన్ సిస్టర్, జెవి ఆర్, నాగేశ్వరరెడ్డి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్, రీజనల్ డైరెక్టర్ మల్లికార్జున, ఏటిఎల్ వేమ య్య, ఆర్థోపెడిక్ మేనేజర్ నాగరాజు, మెయింటేనెన్స్ మేనేజర్ హనుమంతరెడ్డితోపాటు ఆస్పత్రి , ఆర్‌డిటి సిబ్బంది పాల్గొన్నారు.
రాజీనామా యోచన లేదు...

* సిఎంను కలిసాకే నిర్ణయం...
* పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పిసి.గంగన్న
పుట్టపర్తి, జూన్ 19: రాజీనామా యోచన తనకు లేదని పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పిసి.గంగన్న మరోమారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు సవివరంగా వివరించి తరువాతే తన నిర్ణయం వుంటుందన్నారు. సోమవారం పుట టపర్తిలో ఆయన విలేఖరులతో మాటా లడుతూ పుట్టపర్తి సింగిల్‌విండో అధ్య క్ష పదవి, ఎంపిపి, పుడా చైర్మన్, మరికొన్ని పదవుల విషయంలో ఒక విధంగా మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో మరో విధంగా నిర్ణయాలు వుండడం సముచితం కాదన్నారు. తాను రెండున్నరేళ్లు మాత్రమే వుంటానని ఏనాడు అంగీకరించలేదన్నారు. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తనను దించే కుట్రలో భాగంగా ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలేనన్నారు. ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు వివరిస్తానన్నారు. పుట్టపర్తి మున్సిపల్ నూతన కార్యాలయ భవనాన్ని తన హయాంలోనే నిర్మించి తీరుతానన్నారు. ఆయన వెంటవాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులు అక్కులప్ప, ఆస్పత్రి కమిటీ చైర్మన్ జయరాంనాయుడు, సింగిల్‌విండో డైరెక్టర్ ముమ్మనేని వెంకటరాముడు, దేశం నాయకులు పోలంకి చంద్రశేఖర్, బివి.ప్రసాద్ తదితరులు వున్నారు.
స్టేషన్‌బెయిల్ మంజూరు
పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పిసి. గంగన్న స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యారు. సోమవారం పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్‌కు హాజరైన గంగన్న స్టేషన్ బెయిల్ పొందారు. ఈ నెల 9న ము ఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీ సులను దూషించా రన్న కారణం గా గంగన్నపై కేసు నమోదుచేసిన సంగ తి తెలిసిందే. అప్పటి నుండి పిసి.గం గన్న అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఎట్టకేలకు సోమవారం పుట్టపర్తి పోలీస్ స్టేషన్‌కు హాజరై స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. అక్కడి నుండి తన అనుచరులతో కలిసి ర్యాలీగా హనుమాన్ సర్కిల్ వరకు వెళ్లారు. సత్యసాయి విమానాశ్రయంలో అవమానం జరిగిందని భావించి అసహనానికి లోనై నోరుజా రి రెడ్ల కులం పేరుతో దూషించడం ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదన్నారు. డిఎస్‌పిని మాత్ర మే ఉద్దేశించి అన్నానన్నారు. రెడ్ల సామాజిక వర్గాన్ని దృ ష్టిలో పెట్టుకుని తాను దూషించలేదని, వారి మనోభావాలు దెబ్బతిని వుంటే ఆ సామాజిక వర్గానికి, అ ధికారులకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానన్నారు.

అధికారులను కూడా క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు.
పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

* జడ్పీ ఛైర్మన్ చమన్‌సాబ్
మడకశిర, జూన్ 19:పేదలకు మం చి ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని జడ్పీ ఛైర్మన్ చమన్‌సాబ్ పేర్కొన్నారు. సోమవారం ము ఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని 161 మందికి సిఎం సహాయ నిధి కింద మంజూరైన చె క్కులను బాధితులకు చమన్‌సాబ్, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మె ల్యే ఈరన్నలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తగిన వైద్య సేవలు అందించడానికి ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ద్వారా పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేసుకున్నా వారికి కూడా అందుకయ్యే ఖర్చును సిఎం సహాయ నిధి ద్వారా అందిస్తున్నారన్నారు. పేద లు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి రోగాలను నయం చేసుకోవాలన్నారు. సిఎం సహాయ నిధి చెక్కులను మంజూరు చేయించడంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవడం మరింత సంతోషదాయకమన్నారు. అనంతరం 161 మంది బాధితులకు చెందిన రూ. 50లక్షల చెక్కులను వారు అందించారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపిపిలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
పేదల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
* జడ్పీ ఛైర్మన్ చమన్‌సాబ్
మడకశిర, జూన్ 19:పేదలకు మం చి ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని జడ్పీ ఛైర్మన్ చమన్‌సాబ్ పేర్కొన్నారు. సోమవారం ము ఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని 161 మందికి సిఎం సహాయ నిధి కింద మంజూరైన చె క్కులను బాధితులకు చమన్‌సాబ్, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్నలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మంచి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో తగిన వైద్య సేవలు అందించడానికి ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ద్వారా లక్షలాది రూపాయలతో ఉచితంగా శస్త్ర చికిత్సలు సైతం అందించి ప్రాణాలను పోస్తున్నారన్నారు. దాంతో పాటు పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సలు చేసుకొన్నా వారికి కూడా అందుకయ్యే ఖర్చును సిఎం సహాయ నిధి ద్వారా అందిస్తున్నారన్నారు. పేదలు ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకొన్నా దానికి సంబంధించిన బిల్లులతో దరఖాస్తు చేసుకొంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. పేద లు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి రోగాలను నయం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మడకశిర నియోజకవర్గంలో సిఎం సహాయ నిధిని ప్రజలు సద్వినియోగం చేసుకొంటున్నారని, ఇది మడకశిర నియోజకవర్గానికే గర్వకారణమన్నారు. సిఎం సహాయ నిధి చెక్కులను మంజూరు చేయించడంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవడం మరింత సంతోషదాయకమన్నారు. అనంతరం 161 మంది బాధితులకు చెందిన రూ. 50లక్షల చెక్కులను వారు అందించారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపిపిలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ గ్రీవెన్స్‌సెల్‌కు తొమ్మిది ఫిర్యాదులు
అనంతపురంటౌన్, జూన్ 19: కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో సోమవారం కమిషనర్ పివివిఎస్.మూర్తి నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు తొమ్మిది ఫిర్యాదులు అందాయి. సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి ముందు, కెఎస్‌ఆర్ బాలికల జూనియర్ కాలేజీ ముందున్న పూల, చిరుతిళ్ల దుకాణాలను తొలగించాలని ఎసిపి ఇషాక్‌ను కమిషనర్ ఆదేశించారు. రోడ్లపైకి దుకాణాలు పెట్టుకోవటం వలన రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతోందన్నారు. అలాగే వ్యర్థ పదార్థాలను రోడ్లపైకి పారవేయటం వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటి తొలగింపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త పెన్షన్లు ఇవ్వాలని, వీధి దీపాలు అమర్చాలని కోరుతూ వినతిపత్రాలు అందచేశారు.
అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
అనంతపురం సిటీ, జూన్ 19: అగ్రిగోల్డ్ యాజమాన్యం బోర్డు తిప్పేయడంతో జిల్లాలో మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని మీకోసం కార్యక్రమానికి ర్యాలీగా వెళ్లి జెసి2కు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.విశ్వనాథ్‌రెడ్డి, జిల్లా నాయకులు నారాయణప్ప, సిద్దేశ్వర, మృతుల కుటుంబాల సభ్యులు తిరుమలమ్మ, రామలక్ష్మి, ఆదినారాయణ, ఆంజినేయులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ధర్నా
అనంతపురం కల్చరల్, జూన్ 19: జిఎస్టీ వస్తు సేవల పన్ను వ్యవస్థలోకి మారుతున్న సందర్భంలో ఉద్యోగుల సర్వీసులకు సంబంధించి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు నగరంలోని వాణిజ్య పన్నుల ఉప అధినేత కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ నెల 14 నుండి 17 వరకు ప్రతి రోజు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగానే సోమవారం కార్యాలయ సిబ్బంది మొత్తం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డివిజన్ శాఖ అధ్యక్షులు అబ్దుల్ హబీబ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాణిగ్రాహి మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమాచార శాఖ డివిజన్ పిఆర్‌ఓ జ్యోతి ఆకస్మిక మృతి
అనంతపురం కల్చరల్, జూన్ 19: కర్నూలు సమాచార పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పిఆర్‌ఓగా పనిచేస్తున్న ఎన్.జ్యోతి ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో అనంతపురంలో ఏపిఆర్‌ఓగా పనిచేసిన జ్యోతి మృతి పట్ల పలువురు అధికారులు, ఉద్యోగులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సమాచార శాఖ కర్నూలు డిడి శామ్యూల్, అనంతపురం సహాయ సంచాలకులు జయమ్మ, కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పిఆర్‌ఓలు, రెవెన్యూ ఉద్యోగులు, ఆల్‌మేవా, పెన్షనర్ల సంఘం నాయకులు, పాత్రికేయులు ఆమె మృతదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రత్యేకాలంకరణలో శ్రీ భోగేశ్వర స్వామి
పామిడి, జూన్ 19::శ్రీ భోగేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రీ భోగేశ్వర స్వామి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయంలోని అర్చకులు శ్రీ భోగేశ్వరస్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. శ్రీ భోగేశ్వరస్వామి ప్రత్యేక అలంకరణలో దర్శనమివ్వటంతో ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

సేవకు ప్రతిరూపం ఫాదర్ ఫెర్రర్
అనంతపురం కల్చరల్, జూన్ 19: ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ వినె్సంట్ ఫెర్రర్ సేవకు ప్రతిరూపని, జిల్లా ప్రజల హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నారని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈమేరకు ఫెర్రర్ 8వ వర్థంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఫెర్రర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అవే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి, డిప్యూటి మేయర్ సాకే గంపన్న ఫెర్రర్‌కు నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన, కరవులకు నిలయమైన జిల్లాలో ఆర్డీటీ సంస్థను స్థాపించి, గ్రామాల్లో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేశారన్నారు. విద్య, వైద్యంతోపాటు ఆర్థిక చేయూత, సామాజిక కార్యక్రమాలను అమలుచేయడంలో ఆర్టీటీ చేస్తున్న సేవలు ఎనలేనివన్నారు. ఫెర్రర్ స్ఫూర్తితో నేడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయన్నారు. ఫెర్రర్ విగ్రహ ఏర్పాటులో ప్రభాకర చౌదరి కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళి, టౌన్ బ్యాంక్ అధ్యక్షులు జెఎల్.మురళీధర్, అవే సభ్యులు ప్రదీప్‌కుమార్, కాకర్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే రాయల్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఫెర్రర్ వర్థంతిని నిర్వహించారు. కలెక్టరేట్ ఎదురుగా గల ఫెర్రర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.