అనంతపురం

రాష్టస్థ్రాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 21: రాష్ట్రం అనంతకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిలో ముందు వెళ్లాలని కాంక్షిస్తోందని, అభివృద్ధిని అందుకోవటంలో అనంత తీరుపై రాష్ట్రం దృష్టి సారిస్తుందని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. గురువారం స్థానిక అనంత క్రీడా గ్రామంలోని అనంతపురం క్రీడా మైదానంలో జరగుతున్న ఫాదర్ ఫెర్రర్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఆర్డీటి ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ , డిఎస్పీ మల్లికార్జునవర్మ, ఏపిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజినేయులు, ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అమిలినేని అవినీష్ చౌదరిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కేశవ్ మాట్లాడుతూ జిల్లాలో రాష్టస్థ్రాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నీ నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. ఆర్డీటి సంస్థ జిల్లాకు వరంలాంటిదన్నారు. ప్రధానంగా జర్నలిస్ట్‌లు పని ఒత్తిడి వల్ల శారీరకంగా అనేక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. క్రికెట్ పోటీల వల్ల ఉల్లాసం, ఉత్సాహంతోపాటు పోటీతత్వం మెండుగా ఉంటుందన్నారు. మంఛో ఫెర్రర్ మాట్లాడుతూ ఈ టోర్నిలో కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గూంటూరు, అనంతపురం జిల్లాకు సంబంధించి మూడు జట్లు పోటీపడుతున్నాయన్నారు. సమావేశంలో ఐపిఎల్ క్రికెటర్, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కె.ఎస్ షాబుద్దిన్ పాల్గొన్నారు.
జర్నలిస్ట్ జట్టుపై పోలీస్ జట్టు విజయం
అనంత క్రీడా మైదానంలో జర్నలిస్ట్, పోలీసు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పోలీస్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మీడియా జట్టు 15.1 ఓవర్లలో 86 పరుగులకు ఆలౌట్ అయ్యారు. జట్టులో శ్రీనివాస్ అత్యధికంగా 27 పరుగులు సాధించారు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించకపోవటంతో నిర్ణీత ఓవర్లను సైతం మీడియా జట్టు ఆడలేక ఆలౌట్ అయ్యింది. పోలీస్ జట్టు బౌలర్లలో విష్ణు 4 వికెట్లు తీయగా, రెడ్డి 3 వికెట్లు, బాబు 2 వికెట్లు తీసారు. అనంతరం పోలీస్ జట్టు 12 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. పోలీస్ జట్టులో నాగేంద్రప్రసాద్ అత్యధికంగా బ్యాటింగ్‌లో 24 సాధించి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
సర్వీస్ రూల్స్‌లో భాషా పండితులకు అన్యాయం
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: ఉమ్మడి సర్వీస్ రూల్స్ జివోలు వెలువడిన నేపథ్యంలో భాషా పండితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నాయకులు పేర్కొన్నారు. గురువారం ఉపాధ్యాయ భవన్‌లో ఎస్‌ఎల్‌టిఏ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌టిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆదిశేషయ్యలు మాట్లాడుతూ భాష లేనిదే భావి సమాజం లేదన్న నిజాన్ని మరచిన సర్వీస్ రూల్స్ కమిటీ భాషలకు ప్రాతినిత్యం వహిస్తూ ఎస్‌ఎల్‌టిఏ చేసిన సూచనలను కమిటీ బుట్టదాఖలు చేసిందన్నారు. ఫలితంగా ఎన్నో సంవత్సరాలుగా అన్యాయానికి, అసమానతలకు, అవమానాలకు గురవుతూ, భాషలను బతికించిన భాషా పండితులకు సర్వీస్ రూల్స్ కమిటీ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. దీనిపై తక్షణమే ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలని నిర్ణయించినట్లు వారు ప్రకటించారు.