అనంతపురం

విభిన్న ప్రతిభావంతుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు నుండి ఉచితంగా మోటరైజ్డ్ మూడు చక్రముల వాహనములు అందించుటకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపి విభిన్న ప్రతిభావంతుల, వృయో వృద్ధుల జిల్లా మేనేజర్ టి.రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. శారీరక వైకల్యం గల వారు ఈ ఉచిత 3 చక్రాల వాహనములకు అర్హులని, వారు ఏపిడిఏఎస్‌సిఎసి.ఏపి.జిఓవి.ఇన్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ దరఖాస్తును నింపి, అర్హత గల సర్ట్ఫికెట్లును అప్‌లోడ్ చేసి అక్టోబర్ 16వ తేదీలోపు చేయాలన్నారు. కాపీలను మేనేజర్, విభిన్న ప్రతిభావంతుల జిల్లా కార్యాలయం నందు అందజేయాలని తెలిపారు.
ఎయిడెడ్ పాఠశాలల పదోన్నతుల సీనియార్టీ లిస్టు ఆన్‌లైన్‌లో చూసుకోండి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: జిల్లాలోని అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పదోన్నతులకు కల్పించేందుకు సీనియార్టీ లిస్టును డిఇఓ అనంతపురం బ్లాక్ స్పాట్ నందు ఉంచబడినదని, ఆ లిస్టులు చూసుకోవాలని డిఇఓ పి.లక్ష్మినారాయణ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు ఒక ప్రకటనలో తెలియజేసారు. సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీలోపు రాతపూర్వకంగా అందజేయాలని తెలియజేసారు.
స్పోర్ట్స్ కిట్ పంపిణీ
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: కబడ్డీ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్‌ను కెరీర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పంపిణీ చేసారు. గురువారం స్థానిక ఆర్ట్స్ కాలేజి మైదానంలో గుంతకల్లుకు చెందిన ఎస్కేడి డిగ్రీ కాలేజి కబడ్డీ జట్టుకు స్పోర్ట్స్ కిట్‌ను అందజేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు వై.హరీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో బిజెవైఎం ప్రధాన కార్యదర్శి సాకే ఓబిలేసు, కెరీర్ స్టడీ సర్కిల్ నిర్వాహకులు గంగి వినోద్‌కుమార్, పిడిలు పాల్గొన్నారు.
5న అనంతలో సినీ స్టార్ క్రికెట్ సందడి
అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 21: నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజి మైదానంలో వచ్చే నెల 5న సినీ స్టార్ క్రిసెంట్ క్రికెట్ (సిసిసి) మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు సినీ క్రిసెంట్ క్రికెట్ స్టార్ చైర్మన్ షకీల్ షఫీ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 24న క్రికెట్ కప్ క్రిసెంట్ ఫంక్షన్ హాల్ ప్రారంభించటం జరుగుతుందన్నారు. అదే రోజు రక్తదాతల నుంచి రక్తసేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సినీ స్టార్ క్రిసెంట్ క్రికెట్ కప్ మ్యాచ్‌లో టాలివుడ్‌కు చెందిన పలువురు హీరోలు, హీరోయిను పాల్గొంటారు.
ఎస్కేయూ బోధనేతర ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా జి.రామకృష్ణ
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: ఎస్కేయూ బోధనేతర ఉద్యోగ సంఘం ఎన్నికల్లో జి.రామకృష్ణ ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఎన్.కేశవరెడ్డి 19 ఓట్లు, ఉపాధ్యక్షుడిగా ఎం.నాగయ్య 22 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎస్కేయూ బోధనేతర సిబ్బంది మొత్తం 267 ఓట్లు ఉండగా అందులో పది మంది గైర్హాజరు కావడంతో 257 ఓట్లు పోలయ్యాయి. ఈ పోటీలో గట్టి పోటీనిచ్చిన మరొక ప్యానల్ వెంకటరాముడు, నాగప్రసాద్, కేశవరెడ్డిలు ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిచిన ఫ్యానల్ సంఘం నాయకులు సంబరాలు చేసుకున్నారు.
వైద్యసేవలందించడంలో ప్రభుత్వం వైఫల్యం
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: జిల్లాలో ప్రజలకు వైద్య సేవలందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగరాజు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్‌పిఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ విష జ్వరాలు ప్రబలుతున్నాయని, అనేకమంది ప్రజలు విష జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే అక్కడ సరైన వైద్య సిబ్బంది, మందులు లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు ఇంటింటికి కాదు తిరిగేది ఆసుపత్రికి తిరిగి ప్రజలకు నాణ్యమైన వైద్యం, కనీస సౌకర్యాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని పిహెచ్‌సిలను 200 పడకల ఆసుపత్రులుగాను, ఖాళీగా ఉన్న వైద్యులను నియమించి, సరియైన సమయానికి మందులు అందజేయాలని, మండల కేంద్రంలో జనరిక్ మందుల షాపులను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పిఎస్ నాయకులు విఠల్ గౌడ్, కిరణ్‌కుమార్, చక్రధర్ యాదవ్, సుబ్బరాయుడు, సుధాకర్ యాదవ్, ఇమామ్, రామాంజినేయులు, పవన్, బాబా, లక్ష్మన్, ప్రవీణకుమార్ పాల్గొన్నారు.