అనంతపురం

మత్స్యావతారంలో దర్శనమిచ్చిన నారసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, సెప్టెంబర్ 21: దసరా శరన్నవరాత్రులు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మరకత మహాలక్ష్మి ఆలయం, సరస్వతిదేవి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి మత్య్సావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి, పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, పాలక మండలి సభ్యులు మోపూరిశెట్టి చంద్రశేఖర్, కరే నాగరాజు, రెడ్డెప్ప, రొడ్డారపు నాగరాజు, హనుమంతు, గంగులమ్మ, కటికల వరలక్ష్మి, ఇద్దె రఘునాథ్‌రెడ్డి, సురగాని రవికుమార్, తేపల్లి రామక్రిష్ణతోపాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సందర్భంలో మదనపల్లి రోడ్డులో వున్న శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా చౌడేశ్వరిదేవి శ్రీ జేష్టదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
కణేకల్లు, సెప్టెంబర్ 21 : పట్టణానికి చెందిన రైతు గంగలాపురం ఖలీల్ (52) విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ యువరాజ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న పొలంలో మోటార్‌ను ఆన్‌చేసి పైపు తిప్పుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితికి వెళ్లాడు. గమణించిన స్థానికులు కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
యాడికి, సెప్టెంబర్ 21 : మండల పరిధిలోని వెంగన్నపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (78) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల మేరకు లక్ష్మీదేవికి అనారోగ్యం, ఒంటరితనంతో బాధపడుతూ బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. గమణించిన కుటుంబీకులు వెంటనే అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థి ఆత్మహత్య
గోరంట్ల, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని చొండూరువాండ్లపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థి రవికుమార్ (20) ఆత్మహత్యకు పాల్పడినట్లు హెడ్ కానిస్టేబుల్ మద్దిలేటి తెలిపారు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన రవికుమార్‌ను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అనాథ శవానికి అంత్యక్రియలు
హిందూపురం టౌన్, సెప్టెంబర్ 21 : స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి గురువారం మృతి చెందాడు. ఇతని ఆచూకీ తెలియకపోవడంతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఉదయ్‌కుమార్, ఉమర్‌ఫరూక్, శ్రీరాములు, అమర్‌నాథ్, కానిస్టేబుల్ కుమారనాయక్ మృతదేహాన్ని శ్రీకంఠపురం శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

ఉరవకొండలో దారుణం..
* చెత్తకుప్పలో శిశువు
ఉరవకొండ, సెప్టెంబర్ 21 : పట్టణంలోని ఇందిరానగర్ 6వ లైన్‌లో ఉన్న చెత్త కుప్పలో రెండు రోజుల క్రితం పుట్టిన ఓ ఆడ శిశువును గోనె సంచిలో వేసిన ఘటన గురువారం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఇందిరానగర్‌కు చెందిన కొంతమంది చెత్తకుప్పలో చిన్నపిల్ల ఏడుస్తున్నట్లు శబ్ధం రావడంతో గోనె సంచిని పరిశీలించగా ఆడ శిశువును చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిశువును చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చికిత్స అనంతరం అనంతపురంలోని శిశుభవన్‌కు తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ నగేష్‌బాబు తెలిపారు.