అనంతపురం

నేడు జడ్పీ చైర్మన్ ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 21 : ఎట్టకేలకు జడ్పీ పీఠం గుమ్మఘట్ట జడ్పీటీ సీ పూల నాగరాజును వరించబోతోం ది. నేడు స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ భవనంలో జడ్పీ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలు, ఎన్నికల నిబంధనల మేరకు సిఇఓ శోభా స్వరూపారాణి ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటింగ్ అర్హత ఉన్న సభ్యులతోపాటు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫిషియో మెంబర్లు హాజరు కానున్నారు. ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఇందు లో భాగంగా టిడిపికి చెందిన జడ్పీటీసీలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బికె పార్థసారధి గురువారమే జిల్లా కేంద్రానికి రప్పించి ఆర్డీటీ గెస్ట్‌హౌస్‌తోపాటు ఆర్‌అండ్‌బి, మున్సిపల్ గెస్ట్‌హౌస్‌ల్లో బస ఏర్పాట్లు చేశారు. ఒక్కరు కూడా ఓటింగ్‌కు గైర్హాజరు కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నేటి ఉదయం 09.30 గంటలకు ఎన్నికల నిబంధనల మేరకు నూతన చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. కాగా వైకాపాలో ఎవరూ చైర్మన్ స్థానానికి పోటీ పడలేదు. ప్రతిపక్ష వైకాపా, ఇండిపెండెంట్లతో పోలిస్తే 20 మంది జడ్పీటీసీల బలం టిడిపికి ఉంది.

వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
* వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు..
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 21: జిల్లా వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. దేవాలయాలు విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబయ్యాయి. జిల్లాలోని అన్ని దేవాలయాల్లో ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ద నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రులు జరుగుతాయి. నవరాత్రుల మొదటి రోజన నగరంలోని పాతవూరు శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవాలయంలో బిందె సేవ, శ్రీ మహాగణపతి పూజ, వాస్తు, వరుణ పూజ, స్వస్తి వాచనము, ఆలయంలో సర్వదేవతా మూర్తులకు పూజలు నిర్వహించారు. అనంతరం కన్యాకాపరమేశ్వరీని గాయిత్రి దేవి అలంకార రూపంలో భక్తాదులకు దర్శనమిచ్చారు. కొత్తవూరు అమ్మవారిశాల కన్యాకాపరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని గాయిత్రీ దేవి అలంకరణ చేశారు. నగరంలోని శారదా శృంగేరీ మఠంలో శారదాదేవిని గురువారం బ్రాహ్మీ అలంకారంలో భక్తాదులకు దర్శనమిచ్చింది. అనంతరం శంకరమఠంలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మాధికారి రొద్దం ప్రభాకర్, మేనేజర్లు విశ్వం, సత్యప్రాద్, భక్తాదాలు పాల్గొన్నారు. హెచ్‌ఎల్‌సి కెనాల్ వద్ద నసనకోట ముత్యాలమ్మను శాఖాంభరి అలంరకణతో మస్తాబు చేశారు. నగరంలోని పాతవూరు ఉమా నగర్‌లోని రేణుకా ఎల్లమ్మ స్వామిని పసుపు, కుంకుమతో అలంకరణ, కొత్తవూరు అమ్మవారిశాలలో వినాయకుడి, అన్నపూర్ణేశ్వరీ అలంకరణతో పూజలు నిర్వహించారు. నగరంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మత్సోవాలు భాగంగా శ్రీనివాసుడు గరుడు వాహనంలో ఊరేగించారు.
శ్రమ, పట్టుదలతోనే విజయం సాధ్యం
* టుంకూరు జిల్లా కలెక్టర్ మోహన్‌రాజ్
మడకశిర, సెప్టెంబర్ 21 : విద్యార్థులు శ్రమ, పట్టుదలతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని టుంకూరు జిల్లా కలెక్టర్ మోహన్‌రాజ్, పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని నీలకంఠాపురంలో స్వాతంత్య్ర సమర యోధుడు, రఘువీరారెడ్డి పెదనాన్న స్వర్గీయ శ్రీరామరెడ్డి 112వ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే బేధాలు లేకుండా కృషి, పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు విద్యకే పరిమితం కాకుండా క్రీడారంగంలో కూడా ప్రావీణ్యం సంపాందించాలన్నారు. క్రీడలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు. క్రీడల వల్ల మానసిక, శారీరక ఉల్లాసంతో పాటు పోటీతత్వాన్ని తట్టుకునే శక్తి, సామర్థ్యాలు వస్తాయన్నారు. అనంతరం కలెక్టర్ క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈపోటీల్లో 58 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు హనుమక్క, నరసింహమూర్తి, హెచ్‌ఎం శోభారాణి పాల్గొన్నారు.
స్థానికేతర ఆయిల్ ట్యాంకర్లను అడ్డుకుంటాం..
గుంతకల్లు, సెప్టెంబర్ 21 : స్థానిక ఐఓసి నుంచి ఇతర ప్రాంతాలకు ఇంధనాన్ని రవాణా చేసే స్థానికేర ట్యాంకర్లను స్థానిక ఆయిల్ ట్యాంకర్ యజమాన్యం, డ్రైవర్స్, క్లీనర్స్ అసోసియేషన్ నేతలు హెచ్చరించారు. ఈమేరకు గురువారం స్థానిక ఐఓసి దారిలో పెద్దఎత్తున ఆయిల్ ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు కాపుకాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంధన రవాణా ద్వారా సుమారు 150 ట్యాంకర్లకు చెందిన వెయ్యి కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరోవెయ్యి కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయన్నారు. అయితే ఈఏడాది మార్చిలో ఇంధన రవాణా కోసం టెండర్లను నిర్వహించగా స్థానికంగా 57, ఇతర ప్రాంతాలకు చెందిన 33 ట్యాంకర్లు దక్కించుకున్నాయి. ఫలితంగా స్థానికంగా ఉన్న ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్లకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. కనుక స్థానికేతరుల ట్యాంకర్లను అడ్డుకోనున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న స్థానికేతరులు వాహనాన్ని ఊరి బయటే నిలిచి గుంతకల్లు డిఎస్పీ శ్రీ్ధర్‌రావును కలిసి విన్నవించినట్లు సమాచారం.
ధర్మవరంలో కిడ్నాప్ కలకలం
* అప్రమత్తమైన పోలీసులు * కుణుతూరు వద్ద బాలికను వదిలి వెళ్లిన వైనం..
ధర్మవరం, సెప్టెంబర్ 21: ధర్మవరంలో రుషితప్రియ అనే బాలికను గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై ఎక్కించుకుని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించడంతోపాటు పాప ఫొటోలను పంపి వాహనాల తనిఖీలు చేపట్టడంతో కిడ్నాపర్ కుణుతూరు వద్ద బాలికను వదిలివెళ్లాడు. ఈ సంఘటనపై డిఎస్‌పి శివరామిరెడ్డి, పట్టణ సిఐ హరినాథ్‌లు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం 5వ రోడ్డులో నివాసముంటున్న రామ్మోహన్, లక్ష్మివసుంధర అనే దంపతుల కుమార్తె రుషితప్రియ అక్కడే 1వ తరగతి చదువుతోంది. అయితే దసరా సెలవులు రావడంతో లక్ష్మివసుంధర అక్క, బావలు శ్యామల, పోతులయ్యలు రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక మారుతినగర్‌లో వుంటుండడంతో పాపను సెలవుల నిమిత్తం బుధవారం తీసుకొచ్చారు. గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో రుషితప్రియ తోటి పిల్లలతో ఆటలాడుతుండడంతో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి వాహనంలో ఎక్కించుకుని వెళ్ళాడు. తోటి పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న పోతులయ్య, శ్యామలలు కంగారుపడి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి వాహనాలను తనిఖీ చేపట్టేలా చేశారు. అదేవిధంగా రుషిత ఫొటోలను సైతం వాట్సాప్‌ల ద్వారా పంపించారు. దీంతో 3గంటల సమయంలో పట్టణానికి సమీపంలోని కుణుతూరు వాగు వద్ద కిడ్నాపర్ పాపను వదిలి పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డిఎస్‌పి, సిఐ, ఎస్‌ఐలు తల్లిదండ్రులను కలిసి పాపను స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే పాప ద్వారా కిడ్నాప్ చేసిన వ్యక్తి వివరాలను బాలిక ద్వారా పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే బాలిక తల్లిదండ్రులకు ఎవరితోనైనా కక్షలు వున్నాయా? అన్న కోణంలో సైతం ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బాలామృతంతో చిన్నారుల ఆరోగ్యం
* మంత్రి పరిటాల సునీత
రామగిరి, సెప్టెంబర్ 21: చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి బాలామృతం ఉపయోగపడుతుందని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. గురువారం రామగిరి అంగన్‌వాడీ కేంద్రంలో బాలామృతాన్ని పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలు, చిన్నారులకు 7నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం అందించడం జరుగుతుందన్నారు. ఒక్కొక్కరికి నెలకు 2.50 కిలోల బాలామృతం ఇవ్వడం జరుగుతుందని, దీన్ని ప్రతి రోజు 100 గ్రాములు మూడుసార్లు తినిపించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16.15 లక్షల మంది చిన్నారులు బాలామృతం లబ్ది పొందుతారన్నారు. బాలామృతం కిలో రూ.54.50లు అని, రాష్ట్రానికి నెలకు 4038 మెట్రిక్ టన్నుల బాలామృతం అవసరం అవుతుందని, ఇందుకు రూ.264 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి బాలామృతాన్ని ప్రవేశపెట్టాలని కోరగానే వెంటనే అందుకు అంగీకరించారని, ప్రొటీన్లతో కూడిన బలమైన ఆహారం బాలామృతమని, దీన్ని చిన్నారులకు తినిపించడం వల్ల ఎదుగుదల బాగా వుంటుందని తెలిపారు. రామగిరిలో అంగన్‌వాడీ కేంద్రాలు రెండింటిని కలిపి ప్రీ స్కూల్ నిర్వహించాలని, ఇక్కడ అంగన్‌వాడీలో గల 44మంది చిన్నారులకు కుర్చీలు, టేబుళ్లను పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు వితరణ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బడగొర్ల ఆంజనేయులు, సర్పంచ్ శ్రీనివాసులు మండల ప్రధాన కార్యదర్శి పేపర్‌శీనా, ఆంజనేయులు, ఐసిడిఎస్ సిడిపిఓలు శ్రీదేవి, గాయత్రి, సూపర్‌వైజర్ లీలావతి, ఏరియా కోఆర్డినేటర్ మంజుల పాల్గొన్నారు.