అనంతపురం

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 22: పండుగ రోజు..అందులో నూతనంగా నిర్మించుకున్న ఇళ్లు ఘనంగా ప్రారంభించాలని కన్న కళలు. కళ్లలు కాగా ఇంటికి వచ్చిన బంధువులతో సంతోషంగా ఉండగా, పిడుగులాంటి వార్త రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందారన్న విషయం ఆ కుటుంబంలో శుక్రవారంలో పెను శోకానే్న మిగిల్చింది. కూడేరు ఎస్.ఐ రాజు, వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కూడేరు మండలం ఇప్పేరు గ్రామానికి చెందిన రామాంజినేయులు(45) లక్ష్మన్న (40) సొంత అన్నదమ్ములు ఇద్దరు నగరానికి వచ్చి హమాలీ పని చేసూకుంటూ జీవనం సాగిస్తున్నారు. దసరా పండుగ రోజున, శుభ మూహూర్తాన రామాంజినేయులు నూతనంగా స్వగ్రామంలో నిర్మించుకున్న గృహన్ని శనివారం గృహ ప్రవేశం చేయాల్సి ఉంది. బంధవులు అందరు గృహ ప్రవేశానికి తరలిరాగా, సరుకులు తీసుకురావటానికి అన్నదమ్ములు ఇద్దరు శుక్రవారం నగరానికి వచ్చారు. సరుకులు తీసుకుని తమ ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి తిరిగి అనంతపురం నుంచి బళ్ళారి వెల్లే జాతీయ రహదారిలో వెళ్తుండగా కూడేరు మండలం బ్రహ్మణపల్లి, గొట్కురుకు మధ్య ఉరవకొండ వైపు నుంచి వస్తున్న ఇన్నోవా కారు వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనం పూర్తిగా ధ్వసం కాగా ద్విచక్రవాహనంలో ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు కారు అద్దాలుపై ఎగిరి పడి మృతి చెందారని, మరోకరు రోడ్డుపైనే మృతి చెందినట్లు ఎస్.ఐ తెలిపారు. కారులో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణిస్తుండగా ప్రమాధం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. కారు డ్రైవర్‌కు సల్పగాయాలు అయ్యాయి. ప్రమాద ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి శవాలను పోస్టుమార్టమ్ నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు ఎస్.ఐ తెలిపారు.
కుటుంబ సభ్యుల రోదనలు..
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందారు అనే విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అప్పటి వరకు గృహప్రవేశం పేరుతో కుటుంబ సభ్యుల సంతోషంగా ఉన్న క్షణాలు ఎగిరిపోయాయి. ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్న మృతులు బంధువుల రోధనలతో ఆ ప్రాంతం విషాదంగా మారిపోయింది. ప్రమాదంలో మృతి చెందిన రామాంజినేయలకు భార్య లక్ష్మిదేవితో పాటు కుమారుడు ఉండగా, తమ్ముడు లక్ష్మన్నకు భార్య మంగమ్మకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
గూగూడు కుళ్లాయిస్వామి
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* నేత్రపర్వంగా స్వామివారి ప్రథమ దర్శనం
నార్పల, సెప్టెంబర్ 22: మత సామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లింల ఇలవేల్పుగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గూగూడు కుళ్లాయిస్వామి ప్రథమదర్శనం కన్నుల పండువగా అత్యంత రమణీయంగా విద్యుత్ కాంతుల వెలుగులో శోభాయమానంగా శుక్రవారం రాత్రి ప్రథమంగా దర్శనమిచ్చాడు. స్వామివారిని ప్రథమంగా దర్శించుకోవడానికి జిల్లా నలుమూలల నుండే కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఇకపోతే ఈనెల 22 శుక్రవారం స్వామి వారి ప్రథమ దర్శనం. 23న నిత్యపూజ నివేదన. 24న అగ్ని గుండం ఏర్పాటు, 25న స్వామివారిని నిలుపుట, 26న నిత్యపూజ నివేదన, 27న ఐదవ సరిగెత్తు, 28న నిత్యపూజ నివేదన, 29న స్వామి వారి ఏడవ సరిగెత్తు (చిన్న సరిగెత్తు), 30న నిత్య పూజ నివేదన (విడి దినం), అక్టోబరు 1న స్వామి వారి గ్రామోత్సవం (పెద్ద సరిగెత్తు), 2న స్వామి వారి అగ్ని గుండ ప్రవేశం సాయంత్రం నాలుగు గంటలకు జలధికి పోవుట, 4న స్వామి వారి చివరి దర్శనం. దీంతో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యమ్రంలో ఆనవాయితీగా స్వామివారిని దర్శింప జేసే వెంకటరెడ్డి, రామిరెడ్డి, ఆలయ నిర్వహణాధికారి మోహన్‌రెడ్డి, ఆలయ ధర్మకర్త రాజన్న తదితరులు పాల్గొన్నారు.

రాజరాజేశ్వరీదేవి అలంకారంలో అమ్మవారు
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 22:నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా నగరంలోని వివిధ దేవాలయాల్లో అమ్మవార్లును రాజరాజేశ్వరీదేవిగా ప్రజలకు దర్శనమిచ్చింది. రెండవ రోజు శుక్రవారం నగరంలోని పాతపూరు అమ్మవారిశాలలో కన్యాపరమేశ్వరీదేవిని బంగారుకాసులతో రాజరాజేశ్వరీదేవిగా అలంకరణ చేశారు. శ్రీ మహాగణపతి పూజ, వాస్తు, వరుణ పూజ, స్వస్తి వాచనము, ఆలయంలో సర్వదేవతా మూర్తులకు పూజలు నిర్వహించారు. కొత్తవూరు అమ్మవారిశాలలోని కన్యాకాపరమేశ్వరీని భగవతీదేవి, గాజులతో అంలకరణ చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నగరంలోని శారద శృంగేరీ మఠంలో శారదదేవిని మహేశ్వరీదేవి అలంకరము చేసి భక్తాదాలకు దర్శనమిచ్చింది. అనంతరం శంకర మఠంలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హెచ్‌ఎల్‌సి కెనాల వద్దనసనకోట ముత్యాలమ్మను గజలక్ష్మి అలంరకణతోను, చాముండేశ్వరీదేవిని గజలక్ష్మితో మస్తాబు చేశారు. ఈ దేవాలయాల్లో పిల్లలు చేసిన నృత్యాలు అలరించాయి. పాతవూరు ఉమానగర్‌లోని రేణుకా ఎల్లమ్మ స్వామిని ప్రత్యేక అలంరకణ చేశారు. నగరంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మత్సోవాలు భాగంగా శ్రీనివాసుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నంది ఉత్సవాలకు స్థల పరిశీలన
లేపాక్షి, సెప్టెంబర్ 22 : ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందిన లేపాక్షిలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో 2018వ సంవత్సరంలో నిర్వహించనున్న నంది ఉత్సవాల కోసం పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు గోపాల్, విన్సన్ గ్రాఫిక్స్ వాస్కోడిగామా బృందం సభ్యులు శుక్రవారం లేపాక్షిని సందర్శించారు. ఈ సందర్భంగా నంది విగ్రహానికి తూర్పున ఉన్న ఖాళీ స్థలాన్ని, దక్షిణాన ఉన్న గుట్టకు ముందున్న ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని, నవోదయ విద్యాలయ, గురుకుల పాఠశాల క్రీడా మైదానాలను పరిశీలించారు. అదేవిధంగా జఠాయు ఘాట్ సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ విషయాలపై కలెక్టర్ వీరపాండ్యన్‌కు నివేదిక సమర్పిస్తామన్నారు.
జలచౌర్యానికి పాల్పడితే చర్యలు
* హెచ్చెల్సీ డిఇ రామసంజప్ప
బొమ్మనహాల్, సెప్టెంబర్ 22 : ఎవరైనా జలచౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చెల్సీ డిఇ రామసంజప్ప హెచ్చరించారు. ఈమేరకు శుక్రవారం కర్నాటక సరిహద్దు హెచ్‌ఎల్‌సి ప్రధాన కాలువను డిఇ పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాన కాలువ వెంబడి కణేకల్లు రిజర్వాయర్ నుంచి 105 కిలోమీటర్ వరకూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాత్రివేళ క్వాలిటీ కంట్రోల్ అధికారులు, పగటి వేళ లష్కర్లు కాపలా కాస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘించి జలచౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఈకార్యక్రమంలో జెఇ రంజిత్‌కుమార్, లష్కర్లు, వర్క్‌ఇన్స్‌పెక్టర్ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
తాగునీరైనా విడుదల చేయండి..
మండల కేంద్రానికి కనీసం తాగునీరైనా విడుదల చేయాలని మండలానికి చెందిన పలువురు రైతులు డిఇని కలిసి కోరారు. ఆంధ్రా సరిహద్దులోని బొమ్మనహాల్, కణేకల్లు మండలాలకు తాగునీరు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. హెచ్‌ఎల్‌సి నీటిని చూడటమే తప్ప తాగడానికి అనర్హులయ్యామని వాపోయారు. ఇప్పటికైనా తాగునీరు ఇచ్చి ప్రజలు, పశువులను ఆదుకోవాలని కోరారు.
జంబూద్వీప చక్రస్థలాన్ని అప్పగించండి..
* రెవెన్యూ అధికారులకు ముంబాయి జైనుల విన్నపం
వజ్రకరూరు, సెప్టెంబర్ 22 : మండలంలోని కొనకొండ్ల కొండమీద ఉన్న జంబూద్వీప చక్రస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు తమకు అప్పగించాలని ముంబాయి జైనులు కోరారు. ఈమేరకు ముంబాయి జైన కమిటీ సభ్యులు కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జంబు ద్వీపచక్రం, రససిద్దులను సందర్శించారు. అనంతరం రెవెన్యూ అధికారులను కలిసి సంబంధిత ప్రాంతాలను తమకు అప్పగించాలని విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంబంధిత ప్రాంతాలను తమకు అప్పగిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే చేసి స్థలాన్ని అప్పజెపితే ఇంత వరకూ ఎలాంటి అభివృద్ధి చేయలేదని రెవెన్యూ సిబ్బంది జైన కమిటీ సభ్యులకు సూచించారు. అయితే కొనకొండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా రససిద్దులు విద్యను బోధించిన స్థలాన్ని అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ఓ మారెన్న, డిప్యూటీ తహశీల్దార్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.
విష జ్వరాలతో వి.అగ్రహారం విలవిల
* ప్రతి ఇంటా జ్వర పీడితులే..
అమరాపురం, సెప్టెంబర్ 22 : మండల పరిధిలోని వి.అగ్రహారం విషజ్వరాలతో విలవిలలాడుతోంది. గత 15 రోజులుగా ప్రతి ఇంటా జ్వర పీడితులే దర్శనమిస్తున్నారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల సమీపంలోని కర్నాటక కండెనహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలువురు చికిత్స పొందుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు తుంకూరు తదితర ప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నట్లు సర్పంచు క్రిష్టప్ప తెలిపారు. ఈ విషయాన్ని వైద్య సిబ్బందికి తెలియజేసినా ప్రయోజనం లేకుండా పోయిందని సర్పంచు ఆందోళన వ్యక్తం చేశారు. అమరాపురం అగ్రహారానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉందని, దీంతో కర్నాటక కండెనహళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్సల నిమిత్తం వెళ్తున్నామని జ్వర పీడితులు గౌరమ్మ, నరసమ్మ, అభిజిత్, అనిత, మారెక్క, ఈరన్న తదితరులు వాపోయారు. ఇదేవిధంగా కొనసాగితే మరింత మంది విష జ్వరాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అమరాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.
ప్రజల్లో విశ్వాసం కలగాలి..
* అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, సైకాలజిస్టు సురేష్‌కుమార్

అనంతపురం, సెప్టెంబర్ 22 : ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా పోలీసులు విధులు నిర్వహించాలని అదనపు ఎస్పీ మాల్యాద్రి, కౌనె్సలింగ్ సైకాలజిస్టు ఎలుగు సురేష్‌కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని డిటిసిలో శిక్షణ పొందుతున్న ట్రైనీ పోలీసు మెకానిక్‌లు, డ్రైవర్లకు వ్యక్తిత్వ వికాసం, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులకు ఉండాల్సిన లక్షణాల్లో శారీరక దారుఢ్యం, మనోబుద్ధి, నైతిక బలా లు ముఖ్యమైనవన్నారు. అలాగే క్రమ శిక్షణతో కూడిన జీవన విధానం అలవర్చుకుంటే విధి నిర్వహణలో చేయాల్సిన పనులు, సమాజానికి సేవలు సంపూర్ణంగా అందించవచ్చన్నారు. వివిధ రకాల బాధలు, సమస్యలతో ప్రజలు పోలీసు స్టేషన్లకు వస్తుంటారని, అదే స్థాయిలో పోలీసులు తక్షణం స్పందించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రజలల్లో పోలీసుల పట్ల గౌరవం పెంపొందించేలా మసలుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉండి, కల్మషం లేకుండా కులమతాలకు అతీతంగా, సమభావంతో వ్యవహరించి బాధిత ప్రజలకు పరిష్కారం చూపాలన్నారు. సమాజంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఉద్యోగాల్లో వైద్యులు, ఉపాధ్యాయులు, పోలీసులు తొలి వరుసలో ఉంటారని వివరించారు. అనంతరం వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఇర్ఫాన్ వివిధ అంశాలపై ట్రైనీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిటిసి డిఎస్పీ ఖాసీం సాహెబ్, ఎస్‌ఐలు వంశీకృష్ణ, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
అప్పుల ఊబిలో రాష్ట్రం
* ఎమ్మెల్యే విశ్వ, మాజీ ఎంపి అనంత
బెళుగుప్ప, సెప్టెంబర్ 22 : ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడని ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, మాజీ ఎంపి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలో వైఎస్సార్ కుటుంబం, ఇంటింటికీ నవరత్నాలు కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి నవరత్నాలు కరపత్రాలను పంచిపెట్టారు. అనంతరం బెళుగుప్ప సహకార సంఘం అధ్యక్షుడు శివలింగప్ప నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినప్పుడు రూ.96వేల కోట్లు అప్పులుంటే ప్రస్తుతం రూ.1.8 వేల కోట్ల కొత్త అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఇకపోతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేసిన పాపానపోలేదన్నారు. జిల్లాలో కరవు తాండవిస్తోంటే హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరివ్వకుండా ఎక్కడో ఉన్న కుప్పంకు తీసుకెళ్లాలని చూడటం బాధాకరమన్నారు. కేవలం టెండర్ల కోసమే హంద్రీనీవా పనులకు అధిక మోతాదులో టెండర్లు వేసుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాసులు, ఏడిసిసి బ్యాంక్ డైరెక్టర్ శివలింగప్ప, సర్పంచు రామేశ్వరరెడ్డి, మహిళా కన్వీనర్ యశోదమ్మ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిప్పేస్వామి, నాయకులు కొట్టాల అశోక్, భాస్కర్‌రెడ్డి, చెక్కెతిప్పేస్వామి, ఎర్రగుడి ఎర్రిస్వామి, శ్రీనివాసరెడ్డి, తిమ్మారెడ్డి, తగ్గుపర్తి రాజగోపాల్, సుదర్శన్‌రెడ్డి, తిప్పేస్వామి నాయక్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గోరంట్ల, సెప్టెంబర్ 22 : మండల పరిధిలోని మిషన్‌తండా వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు ఎస్సై వేంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో సావిత్రమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే ఆమె అల్లుడు సూర్యప్రకాష్, కుమార్తె పద్మశ్రీ తీవ్రగాయాలకు గురయ్యారు. సమాచారం అందగానే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరిలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదవశాత్తు హోంగార్డు మృతి
యాడికి, సెప్టెంబర్ 22 : మండలపరిధిలోని నిట్టూరు గ్రామానికి చెందిన హోంగార్డు పెద్దన్న (32) ప్రమాదవశాత్తు శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం వెంకటాంపల్లి సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పెద్దన్న కింద పడడంతో ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అయితే గురువారం రాత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. తాడిపత్రి పట్టణం పోలీస్ స్టేషన్‌లో పెద్దన్న విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
కదిరి, సెప్టెంబర్ 22: పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్ శేఖర్ నాయుడు (19) అనే విద్యార్థి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఓబుళదేవరచెరువు మండలం టి.కుంట్లపల్లికి చెందిన విజయ్ శేఖర్ నాయుడు కదిరిలోని ఎస్‌టి ఎస్ ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం స్వగ్రామం నుండి కదిరికి వచ్చి ద్విచక్రవాహనంలో కళాశాలకు వెళ్తుండగా బాలికోన్నత పాఠశాల వద్ద బస్సును దాటుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డాడు. దీంతో విజయ్ శేఖర్ నాయుడుకు బస్సు రేకు తగిలి కొంత దూరం వరకు బస్సు లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో విజయ్ శేఖర్ నాయుడుకు తీవ్ర గాయాలు కాగా వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.