అనంతపురం

చలి..జ్వరం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, సెప్టెంబర్ 23: నిండా దుప్పటి కప్పుకుని వణుకుతూ బాధపడుతూ అబ్బో చలీ..జ్వరం అంటూ ఇంటికి ఇద్దరూ లేదా ముగ్గురు పడకేసిన దృశ్యం ప్రస్తుతం ప్రతి పల్లెలోనూ దర్శనమిస్తోంది. కురిసిన వర్షాలతో పల్లెల నిండా మురికి నీటి గుంటలూ...పేరుకుపోయిన చెత్తా చెదారాలూ...విరివిగా అభివృద్ధి చెందుతున్న దోమలు. వీటి కారణంగా ప్రతి ఇంటా జ్వరమే. దీంతో చిన్న చిన్న ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులూ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. యధావిధిగా కొనసాగే ఓపీ రెండింతలు, మూడింతల రెట్టింపయ్యింది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వుండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే చలి జ్వరంతో వెళ్తే అక్కడ రక్త పరీక్షలు చేసి మలేరియానా, టైఫాయిడ్ జ్వరమా అని నిర్ధారణ జరిపి చికిత్సలు చేస్తున్నారు. అయితే కొన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణకు ఆలస్యమవుతోంది. అంతవరకు జ్వరం తీవ్రం కాకుండా అక్కడున్న వైద్యాధికారులు రోగులు ఊరట చెందేలా ఏదో ఓ విధంగా చికిత్సలు జరుపుతున్నారు. మండల కేంద్రాల్లోని ప్రైవేటు క్లినిక్‌లలో అయితే చలి జ్వరం అనగానే మలేరియా జ్వరానికి ఇవ్వాల్సిన సూదిమందులిచ్చేస్తున్నారు. ఏ జ్వరం వచ్చినా కొంతవరకూ రక్త కణాలు తగ్గుముఖం పట్టే అవకాశం వుందని వైద్యులు చెప్తున్నారు. అయితే కొన్ని పట్టణాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే ఏ మాత్రం రక్త కణాలు తగ్గుముఖం పట్టినా డెంగ్యూ అని చెప్తూ రోగికి హైడోస్ మందులిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాస్తవానికైతే ప్రస్తుతం పారిశుద్ధ్యం లోపం కారణంగానే వ్యాధులొస్తున్నాయన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. పారిశుద్ధ్య పనులను చేబట్టాల్సిన పూర్తి బాధ్యత పంచాయతీ పాలకులపై ఉన్నప్పటికీ వారు ఏ మాత్రం పట్టించుకోకపోయినా జిల్లాస్థాయి అధికారులు కూడా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దోమలపై దండయాత్ర అంటూ కేవలం ర్యాలీలతో దోమలను తరిమేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పా చేతల్లో చూపడం లేదన్న విమర్శలూ లేకపోలేదు. గ్రామాల్లో అనునిత్యం పర్యవేక్షణ కొనసాగిస్తూ దోమల నిర్మూలనకు ఆరోగ్య శాఖ అధికారులు ఎన్ని చర్యలు చేబట్టినా గ్రామాల్లో చెత్తా చెదారాలు, మురికి నీటి గుంటలు అధికంగా వుండటంతో దోమల అభివృద్ధి మాత్రం ఆగడం లేదు. అభివృద్ధి చెందిన దోమల నిర్మూలనకు కనీసం ఫాగింగ్ చేయడానికి కూడా పంచాయతీ పాలకులు ముందుకు రాని పరిస్థితి ఉండటంతో ఆరోగ్య శాఖ అధికారులు తలబాదుకుంటున్నారు. కాగా అధిక స్థాయిలో మలేరియా జ్వరాలు సోకినప్పుడే మలేరియా అధికారులు స్పందించడం జరుగుతోంది. జిల్లాలోని మలేరియా విభాగంలో కేవలం పది ఫాగింగ్ యంత్రాలు మాత్రమే వున్నాయనీ మలేరియా జ్వరాలు అధికమైనప్పుడే వాటిని వినియోగించడం జరుగుతుందని కొందరు మలేరియా విభాగ అధికారులే చెప్పడం విడ్డూరం. వారి పరిధిలో పది ఫాగింగ్ యంత్రాలు వున్నా వాటిలో పనిచేసే యంత్రాలు తక్కువేనని ఆరోగ్య శాఖ అధికారులే విమర్శిస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కచ్చితంగా పంచాయతీల్లో ఫాగింగ్ యంత్రాలను ఏర్పాటు చేసుకోవాల్సి వుండగా వెయ్యికి పైగా పంచాయతీలకుగాను కేవలం 60నుంచి 70 మేజర్ పంచాయతీల్లో మాత్రమే ఫాగింగ్ యంత్రాలున్నాయని సమాచారం. అయినప్పటికీ వాటిని ఏడాదికొక్కమారు కూడా పూర్తి స్థాయిలో వినియోగించని పంచాయతీలున్నాయనీ చెప్పుకోవచ్చు. దోమల అభివృద్ధికి ముఖ్య కారణం అపరిశుభ్రతే. అయితే గ్రామాలను పరిశుభ్రంగా వుంచాల్సిన పంచాయతీలూ, దోమల నిర్మూలనకు పూర్తి బాధ్యత వహించాల్సిన మలేరియా విభాగ అధికారులూ ఏ మాత్రం పట్టించుకోక పోవడం వల్లే దోమలు అధికమై ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. పారిశుద్ధ్య పనులు చేబట్టాల్సిన పంచాయతీలూ.. పట్టీపట్టనట్లు వ్యవహరించే మలేరియా విభాగం.. ఇళ్ల వద్ద పరిశుభ్రంగా వుంచుకోవడంతోపాటు ఇళ్లల్లో నీటిలో లార్వా నిల్వలు జరగకుండా జాగ్రత్త పడాల్సిన ప్రజలూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం జ్వరాల తీవ్రతకు కారణమవుతోంది. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ ఏవైనా పల్లెల్లో జ్వరాల తీవ్రత అధికమైనప్పుడు కేవలం ఆ గ్రామాల్లో విధులు నిర్వహించే ఆరోగ్య కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారంటూ వారిపై నేరం మోపడం సహజంగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రక్రియ.
ఆన్‌లైన్ మోసం!
* రూ.49 లక్షలు దోచిన నైజీరియన్ అరెస్టు * డిఎస్పీ మల్లికార్జునవర్మ
అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 23: నగరానికి చెందిన ఓ కుటుంబం అత్యాశకు పోయి నిండా మునిగిపోయింది. ఆన్‌లైన్ పేరిట ఏకంగా రూ .49,12,900 లక్షలను బురిడీ కొట్టించిన నయా మోసగాడు నైజీరియన్ దేశస్తుడు డెస్మాండ్ ఓఈబోను రా ప్తాడు పోలీసులు అరెస్టు చేసినట్లు డిఎస్పీ మల్లికార్జునవర్మ తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ వెల్లడించారు. 2014లో నైజీరియన్ దేశానికి చెందిన డెస్మాండ్ ఓఈబో స్టూడెంట్ పాస్ కింద భారతదేశం రావటం జరిగిందన్నారు. స్టూడెంట్ వీసా కింద సమయం పూర్తయినా తన స్వదేశానికి వెళ్లకుండా బెంగళూరు కేంద్రంగా చేసుకొని ఆన్‌లైన్ మోసాలకు పెద్ద ఎత్తున పాల్పడటం జరిగిందన్నారు. రాప్తాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక గెజిటెడ్ కమ్యూనిటి టౌన్‌షిప్‌లో నివాసం ఉండే మారుతి, కవిత దంపతులు నగరంలో చికెన్ వ్యాపా రం చేస్తున్నారన్నారు. ఆయన సతీమణి చీరల వ్యాపారం చేస్తుందని తెలిపారు. రెండు వ్యాపారాల్లో నష్టాలు రావటంతో అప్పులపాలు కావటం జరిగిందన్నారు. ఎలాగైన డబ్బు సంపాధించాలి అనే లక్ష్యంతో ఆన్‌లైన్‌లో వ్యాపారాల కోసం నెట్‌లో తరుచూ వెదికే వారు అన్నారు. ఇదే సందర్భంలో డాక్టర్ అమర్ పేరును ఓ ప్రకటన ఆన్‌లైన్‌లో వీరి దృష్టిని ఆకర్షించటం జరిగిందన్నారు. తమకు కిడ్నీ కావాలని ..కిడ్నీ ఇస్తే రూ. కోటి ఇస్తామని నమ్మబలుకుతూ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను సైతం ఇవ్వటం జరిగిందన్నారు. ఇది సులభంగా ఉందని భ్రమించిన కవిత అత్యాశలో పడి అప్పుల ఊబిలో నుంచి బయటపడటానికి ఇంతకన్నా మంచి మార్గం లేదని భావించటం జరిగిందన్నారు. ముందుగా రూ.11 వేలు ఆన్‌లైన్‌లో కవిత డిపాజిట్ చేయటం జరిగిందన్నారు. నమ్మించటానికి నిబంధనలు, షరతులు విధించటం జరిగిందన్నారు. అన్నింటికి దంపతులు ఒప్పుకోవటం జరిగిందన్నారు. కిడ్నీ మార్పిడికి సంబంధించి అవసరమయ్యే సర్ట్ఫికెట్లు వివరాలు తెలపటం సైతం జరిగిందన్నారు. వీటన్నింటిని తెలివిగా ఆన్‌లైన్ ద్వారా నిందితుడు జరపటం జరిగిందన్నారు. రూ.కోటి వస్తుందన్న ఆశతో నిందితుడు అడిగినంత ఆన్‌లైన్ అకౌంట్‌లో 37,62,900 జమ చేయటం జరిగిందన్నారు. నిందితుడి తీరుపై అనుమానం కలిగిన దంపతులకు కిడ్నీ ఇవ్వకనే రూ. కోటి ఓ వ్యక్తి ద్వారా పంపుతానని అవతలి వ్యక్తి వీరికి తెలియజేయటంతో చెప్పినట్లుగానే ఓ వ్యక్తి పంపటం జరిగిందన్నారు. అసలు నిందితుడు నైజీరియన్ దేశస్తుడేనన్నారు. తన వద్ద ఉన్న సూట్‌కేసులో రూ.2వేలు నోట్లు కలిగిన కోటి ఉందని తీసుకోమని ఇవ్వటం జరిగిందన్నారు. కెమికల్ వాడితే నల్ల నోట్లు ఆసలైన రూ.2 వేలు నోట్లుగా మారతాయని మరోసారి మోసం చేయటం జరిగిందన్నారు. అందులో ఓ మూడు నోట్లు అసలైన నోట్లు ఉంచటం జరిగిందన్నారు. కెమికల్ బాటిళ్లు కావాలంటే రూ.15.50 లక్షలు ఖర్చవుతుందని తెలపటం జరిగిందన్నారు. బెంగళూరులో దొరుకుతుందని నమ్మించటం జరిగిందన్నారు. నిందితుడి మాటలు నమ్మి మరో రూ.11,50,000 చేతిలో పెట్టడం జరిగిందన్నారు. నిందితుడు కెమికల్ బాటిల్ ఇవ్వటం జరిగిందన్నారు. ఆ బాటిల్ సైతం పగలిపోవటంతో చేసేది లేక మరోసారి నిందితుడికి ఫోన్ ద్వారా మరో బాటిల్ కావాలంటూ వేడుకోవటం జరిగిందన్నారు. ఈసారి మరింత అదనంగా డబ్బు ఇస్తే కెమికల్ బాటిల్ ఇస్తానని పేర్కొనటంతో ఇదే సందర్భంలో తాము మోసపోయామని తెలిసి ఈ నెల 17న రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. అనుకొన్న ప్రకారమే నిందితుడు డెస్మాండ్ ఓఈబో అనంతపురం రావటం జరిగిందన్నారు. తన పర్యవేక్షణలో ఇటుకలపల్లి ఇంచార్జి సిఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ ధరణిబాబు ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్టు చేయటం జరిగిందన్నారు. డాక్టర్ అమర్ పేరును తానే ప్రకటన ఇవ్వటం జరిగిందని, తాను చేసిన మోసాలను వెల్లడించటం జరిగిందని ఒప్పుకోవటం జరిగిందన్నారు. ప్రజలు ఇలాంటి ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని డిఎస్పీ ప్రజలకు సూచించారు.
ఆటోను ఢీకొన్న ఐచర్ ఇద్దరి మృతి
* నలుగురికి తీవ్రగాయాలు
పెద్దవడుగూరు, సెప్టెంబర్ 23 : మండల పరిధిలోని గుత్తి అనంతపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఆటోను ఐచర్ ఢీకొనడంతో గుత్తి మండలం రజాపురానికి చెందిన ఆంజనేయులు (35), శ్రీనివాసులు (34) మృతి చెందారు. ఎస్సై రమణారెడ్డి తెలిపిన వివరాల మేరకు రజాపురానికి చెందిన శ్రీనివాసులు, ఆంజనేయులు, వెంకటేష్, నాగమ్మ, శివరాజు గుత్తి గేట్స్ కళాశాల వద్ద ఉన్న వంక వద్ద కొట్టాలపై కప్పుకునే జంబు గడ్డి కోసుకుని ఆటో గాంధీనగర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దేవేంద్రతో మాట్లాడుతుండగా కర్నూల్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. దీంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుత్తి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శ్రీనివాసులు, ఆంజనేయులు మృతి చెందారు. వెంకటేష్, నాగమ్మ, శివరాజు గుత్తిలోనే చికిత్స పొందుతున్నారు. ఆటో డ్రైవర్ దేవేంద్ర పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించినట్లు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతి చెందిన శ్రీనివాసులుకు భార్య, కుమారుడు, ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
ఎసిబి వలలో విఆర్‌ఓ
* రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం..
పెనుకొండ, సెప్టెంబర్ 23 : మండల పరిధిలోని గుట్టూరుకు చెందిన విఆర్వో రంగనాథ్ శనివారం అవినీతి నిరోధక శా ఖ అధికారులకు ప ట్టుబట్డాడు. గుట్టూరు కు చెందిన రైతు మల్లికార్జునకు పట్టాదార్ పాసు పుస్తకాలు మం జూరు చేయడానికి రూ.8 వేలు డిమాండ్ చేశాడు. అయితే తిరిగి, తిరిగి బతిమాలిన తర్వాత రూ.5 వేలు ఇస్తే పాసు పుస్తకాలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈనేపథ్యంలో మల్లికార్జున ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఎసిబి డిఎస్పీ జయరామ్‌రాజ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని విచారణ నిర్వహించి సోమవారం కర్నూలు ఎసిబి కోర్టులో హాజరు పరచనున్నట్లు డిఎస్పీ తెలిపారు.
అన్నపూర్ణా దేవి అలంకారంలో అమ్మవారు
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 23: నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా నగరంలోని వివిధ దేవాలయాల్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. మూడవ రోజు శనివారం నగరంలోని పాతవూరు అమ్మవారిశాలలో కన్యాకాపరమేశ్వరీదేవిని అన్నపూర్ణదేవిగాను, చీరల లేస్‌లతో అలంకరణ చేశారు. శ్రీ మహాగణపతి పూజ, వాస్తు, వరుణ పూజ, స్వస్తి వాచనము, ఆలయంలో సర్వదేవతా మూర్తులకు మంత్ర పుష్పం మహామంగళహారతిని నిర్వహించారు. కొత్తవూరు అమ్మవారిశాలలోని కన్యాకాపరమేశ్వరిని శాఖాంబరి, రాజరాజేశ్వరీ దర్బార్ అలంకరణ చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నగరంలోని శారద శృంగేరీ మఠంలో శారదాదేవిని కౌమరీదేవి అలంకారం చేసి పల్లకీ సేవలో భక్తులకు దర్శనమిచ్చింది. అనంతరం శంకరమఠంలో సాంస్కృతిక, భజన కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్‌ఎల్‌సి కెనాల వద్ద నసనకోట ముత్యాలమ్మను మీనాక్షిదేవి అలంకరణతో, చాముండేశ్వరీదేవిని సంతానలక్ష్మిగా అలంకరణ చేశారు. ఈ దేవాలయాల్లో పిల్లలు చేసిన నృత్యాలు అలరించాయి. పాతవూరు ఉమానగర్‌లోని రేణుకా ఎల్లమ్మ స్వామిని చాకెట్లుతో ప్రత్యేక అలంరకణ చేశారు. నగరంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మత్సోవాలు భాగంగా శ్రీనివాసుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నృసింహావతారంలో దర్శనమిచ్చిన ఖాద్రీశుడు
కదిరి, సెప్టెంబర్ 23: శరన్నవరాత్రుల్లో భాగంగా శనివారం శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి నృసింహావతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్గించారు. స్వామివారిని విశేషంగా అలంకరించిన అనంతరం తిరువీధుల్లో ఊరేగించారు. శ్రీవారిని ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డి, పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబుతోపాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. కాగా మదనపల్లి రోడ్డులో వున్న శ్రీ చౌడేశ్వరిదేవి గౌరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెరచుకోని వేతనాల వెబ్‌సైట్!
* ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ జీతాలు లేనట్టేనా...
మడకశిర, సెప్టెంబర్ 23 : ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల వేతనాల చెల్లింపుల వెబ్‌సైట్ నాలుగు రోజులుగా తెరచుకోకపోవడంతో ఉద్యోగులకు పండుగకు వేతనాలు అందే అవకాశాలు కనిపించడం లేదు. ఈనెల 28, 29, 30వ తేదీల్లో దసరా, మొహ ర్రం పండుగలు ఉండటంతో తెలంగా ణ ప్రభుత్వం ఈనెల 25వ తేదీనే ప్ర భుత్వ శాఖల ఉద్యోగులకు వేతనాలు చెల్లించనుంది. రాష్ట్రంలో కూడా అదే తేదీ నాటికి ఉద్యోగులకు వేతనాలు అందుతాయని వ్యాట్సాప్ సమాచార ం రావడంతో హర్షం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు ఈనెల 20వ తేదీ నే బిల్లులను ఖజానా కార్యాలయానికి చేరవేశారు. అయితే నాలుగు రోజులుగా ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన వెబ్‌సైట్ ఏమాత్రం తెరచుకోకపోవడంతో పండుగలకు వేతనాలు అందడం కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేతనాలు అక్టోబర్ 3వ తేదీ వరకు అందే అవకాశాలు కనిపించడం లేదని, దీంతో పండుగలను ఎలా జరుపుకోవాలో అర్థం కావడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల శ్రద్ధ కనబర్చకపోవడం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టులపై శే్వతపత్రం విడుదల చేయాలి
* ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి
ఉరవకొండ, సెప్టెంబర్ 23 : పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శే్వతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఇందిరానగర్‌లో వైఎస్ కుంటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జలయజ్ఞం చేపట్టారన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏకరాకు నీరు అందించాలని అప్పట్లోనే దాదాపు 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. కనీసం 20 పనులు కూడా పూర్తి చేయలేని చంద్రబాబు గొప్లపు చెప్పుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్టుల పనులపై శే్వతపత్రం విడుదల చేయాలన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేసిన పాపాన పోలేదన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందేలాగా చూస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బసవరాజు, నిరంజన్‌గౌడ్, లెనిన్‌బాబు, గోవిందు, వెంకటేశులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి ప్రాశస్త్యాన్ని దశదిశలా వ్యాపింపజేయాలి
* జెసి టికె.రమామణి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 23: లేపాక్షి ప్రాశస్త్యం దశదిశలా వ్యాప్తి చెందేలా 2018 ఫిబ్రవరి 23న, 24వ తేదీల్లో లేపాక్షి ఉత్సవాలను నిర్వహించాలని జూయింట్ కలెక్టర్ టికె.రమామణి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో జిల్లా పర్యాటక ప్రోత్సాహక మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులు లేపాక్షి ఉత్సవాలను వీక్షించేలా ప్రణాళికాబద్ధంగా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. సూక్ష్మ స్థాయిలో లేపాక్షి ప్రాశస్త్యాన్ని జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు వివరించేలా ప్రముఖ గైడ్‌లను ఏర్పాటుచేయాలన్నారు. లేపాక్షి చేతి వృత్తుల స్టాళ్లు ఎప్పటికీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, తదితర ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించేలా ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల లోగో, నిర్వహణ వివరాలను రూపొందించి, కౌన్సిల్‌కు సమర్పించాల్సిందిగా ఈవెంట్ నిర్వహణ సంస్థను జెసి ఆదేశించారు. అనంతరం పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ జి.గోపాల్ మాట్లాడుతూ 2018 ఫిబ్రవరి 23, 24వ తేదీల్లో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాలను ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ విన్నన్ గ్రాఫిక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే జిల్లాలో 25 లక్షలతో కుంభకర్ణ పార్కు పునరుద్ధరణ, 15.36 లక్షలతో శిల్పారామంలో ప్రహరీ గోడ, 40 లక్షలతో పెనుకొండలో ప్రవేశద్వారం, 12 లక్షలతో మరూరు టోల్‌గేట్ వద్ద స్నాక్‌బార్, 35 లక్షలతో గొల్లపల్లి రిజర్వాయర్‌లో బోటింగ్ ఏర్పాటు, 15 లక్షలతో పెనుకొండ శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద లాండ్ స్కేపింగ్ పనులు, 25 లక్షలతో సైనేజీ బోర్డులు, 3 కోట్లతో పుట్టపర్తిలో నదీముఖ అభివృద్ధి పనులు, వెంకటాపురం వద్ద తిరుమల దేవరస్వామి దేవాలయంలో 2.50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆర్‌డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ సంస్థ ప్రతినిధి ఫెర్నాండెజ్, సభ్యులు సంధ్యామూర్తి, మాసినేని ఎండి రామయ్య, సెరికల్చర్ జెడి అరుణకుమారి, డిర్‌డిఏ పిడి వెంకటేశ్వర్లు, ఏసి వాణి, ఆన్‌సెట్ సిఈఓ వెంకటేశం, టూరిజం అధికారి బాలభాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి
* అధికారులకు జెసి ఆదేశం
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 23: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని జెసి టికె.రమామణి తహశీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో ఇసుక అక్రమ రవాణా, రెవిన్యూ ల్యాండ్స్ రికార్డ్సు, స్పెషల్ సమ్మరీ రోల్స్, ఈ-ఆఫీసు, పిటీషన్ల పరిష్కారం తదితర అంశాలపై జెసి సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ మండల పరిధిలో వున్న ఇసుక రీచ్ల నుండి ఇసుక అక్రమంగా రవాణా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. మండల పరిధిలోని మీ సేవా కేంద్రాన్ని తహశీల్దార్లు తనిఖీ చేసి నెలకొకసారి నివేదికను జిల్లా కేంద్రానికి అందించాలన్నారు. ల్యాండ్ రికార్డ్స్‌ను ఎలాంటి తప్పిదాలు లేకుండా అప్‌డేట్ చేయాలన్నారు. మండల కార్యాలయాల్లో అవసరమయ్యే ఫర్నిచర్ వివరాలను డిఆర్‌ఓకు పంపాలన్నారు. మండల తహశీల్దార్ల కార్యాలయాల్లో వౌలిక వసతులు కల్పించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అందుబాటులో వున్న బడ్జెట్ మేరకు తెల్ల కాగితాలు, క్యాట్రేజ్‌లను కొనుగోలు చేయడం జరిగిందని వాటిని సమావేశం అనంతరం తహశీల్దార్లు తీసుకెళ్లాలన్నారు. ఎలక్ట్రోరల్ స్పెషల్ సమ్మరీ రోల్స్ 2017కు సంబందించి 6, 7, 8, 8-ఎ ఫారాలను తనిఖీ చేసి ఆన్‌లైన్‌ళో అప్‌లోడ్ చేయాలని సూచించారు. సంబంధిత ఫారాల్లో ఈఆర్‌ఓలు తప్పనిసరిగా సంతకాలు చేసి పంపాలన్నారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా వ్యక్తిగతంగా తనిఖీ చేసి నివేదికలు పంపాలన్నారు. మండల స్థాయిలో ఈ నెల 25లోపు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఆర్‌డిఓ మలోలా మాట్లాడుతూ కొండ లు, గుట్టలు, వాగులు సాగుకు పనికిరాని భూములను పొరపాటున ఎవరికైనా కేటాయింపు చేసి వుంటే అలాంటి వాటిని గుర్తించి సంబంధిత ప్రతిపాదనలను జెసికి పంపాలన్నారు. అలాంటి వాటిని పరిశీలించి రికార్డుల నుండి తొలగించనున్నట్లు తెలిపారు. వెబ్‌ల్యాడ్ పట్టాదారు పాసు పుస్తకాల్లో పేరును మార్చేందుకు తహీశీల్దార్లకు అధికారులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి, డిఎస్‌ఓ శివప్రసాద్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
ఈ-ఆఫీస్ నిర్వహణలో జిల్లాను
మొదటిస్థానానికి తీసుకురావాలి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 23: జిల్లాలో ప్రతి కార్యాలయం ఈ-ఆఫీస్ ద్వారానే ఫైల్స్ నిర్వహణ తప్పక నిర్వహించాలని, తద్వారా జిల్లా రాష్ట్రంలోనే ఈ-ఆఫీస్ నిర్వహణలో మొదటిస్థానానికి తీసుకురావాలని కలెక్టర్ జి.వీరపాండ్యన్ జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు ఈ-ఆఫీస్ శిక్షణాధికారి భాస్కర్‌నారాయణ తెలిపారు. శనివారం దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు రెవిన్యూ భవన్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా భాస్కర్‌నారాయణ మాట్లాడుతూ ఈ-ఆఫీస్ ద్వారా ఫైల్స్ నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా తెలిపారు. జిల్లాను మొదటిస్థానానికి తీసుకువచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారులకు ఈ రోజు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతి నోటు ఫైలులో ఫేరా నెంబర్లు తప్పనిసరన్నారు. మీ-కోసం, సిఎంఓ, పరిష్కార వేదిక, కైజాలా యాప్ ద్వారా అందే పిటీషన్లను ప్రతి రోజూ విధిగా జిల్లా అధికారులకు వారి మెయిల్ ఇన్‌బాక్స్‌ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని మీకోసం తహశీల్దార్లు అనుపకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులను, ఈ-ఆఫీస్ టెక్నికల్ టీమ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తెలపండి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 23: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎన్‌రోల్‌మెంట్ విద్యార్థుల సంఖ్యను తెలియజేయాలని డిఇఓ పి.లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో ప్రధానోపాధ్యాయులకు, ఎంఇఓలకు తెలియజేసారు. 2018-19 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను సంబందించిన ప్రొఫార్మలను ఎక్స్‌ల్ ఫార్మట్‌లో ఈ నెల 27వ తేదీలోపు డిఇఓ కార్యాలయానికి అందజేయాలన్నారు.
కంటి ఆపరేషన్‌కై నగదు వితరణ
తాడిపత్రి, సెప్టెంబర్ 23: స్వామి వివేకానంద షటిల్ క్లబ్ సభ్యుడు నాగరాజు కంటి ఆపరేషన్ నిమిత్తం శనివారం షటిల్ కోర్టులో క్లబ్ సభ్యులు నగదు వితరణగావించారు. విశ్వహిందూ పరిషత్ రాయలసీమ విభాగ్ అధ్యక్షులు రాధాకృష్ణ మాట్లాడుతూ తమతోటి ఆటగాడు నాగరాజు కంటి ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం క్లబ్ సభ్యుల సహకారంతో రూ.14 వేలు నగదును అందజేస్తున్నామని తెలిపారు. మానవతా దృక్పధంతో సహకరించిన క్లబ్ సభ్యులకు నాగారాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి, విహెచ్‌పి నాయకులు శింగిరి లక్ష్మినారాయణ, గణేష్‌బాబు, అంబటి రాఘవేంద్రారెడ్డి, నారాయణరెడ్డి, మాధవరెడ్డి, సుధాకర్, నాగరాజు పాల్గొన్నారు.
తపాలా జీవిత బీమా మేళా
ఆత్మకూరు, సెప్టెంబర్ 23: ఆత్మకూరులో తపాలా జీవిత బీమా మేళాను శనివారం తపాలా శాఖ అడిషనల్ ఎస్పీ సుందరనాయుడు ప్రారంభించారు. ఆత్మకూరు గ్రామంలో తిరుగుతూ దీనిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్‌మాస్టర్, బిపిఎంలు పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో జిల్లా గ్రంథాలయ సంస్థ
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 23: జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా గౌస్ మొహిద్దీన్ చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడవ సంవత్సరంలో అడుగిడుతూ అభివృద్ధి పథంలో నడుస్తోందని సంస్థ కార్యదర్శి లలిత పేర్కొన్నారు. శనివారం గ్రంథాలయ సంస్థ మూడవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఛైర్మెన్ గౌస్ మొహిద్దీన్‌కు ఉద్యోగులు ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మెన్ గౌస్ మాట్లాడుతూ ఉద్యోగుల సహకారంతో జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. అనంతరం సంస్థ కార్యదర్శి లలిత మాట్లాడుతూ సంస్థను రెండు సంవత్సరాలుగా మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ఉద్యోగులకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. అనంతరం గౌస్ మొహిద్దీన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, బాలకృష్ణ అభిమానులు రామకృష్ణ, గోపాల్, జాఫర్, సురేష్, మాబు, గౌస్, సుధాకర్, హరీష్‌రెడ్డి పాల్గొన్నారు.
టిడిపి కార్యకర్తకు నగదు వితరణ
తాడిపత్రి, సెప్టెంబర్ 23: తెలుగుదేశం పార్టీ కార్యకర్త నజీర్‌కు టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి హిరాపురం ఫయాజ్‌బాషా శనివారం నగదు వితరణగావించారు. పడమటిగేరిలోని 5వ నెంబర్ బీడీ కార్యాలయంలో టైలర్స్ కాలనీకి చెందిన నజీర్‌కు ఫయాజ్‌బాషా రూ.5వేలు నగదును అందజేశారు. మునిసిపల్ కోఆప్షన్ మెంబర్ నియాజ్‌బాషా, జాఫర్, జగదీశ్వరరెడ్డి, రంగనాథ పాల్గొన్నారు.
భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 23: ఉమ్మడి సర్వీస్ రూల్స్‌లో భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలని శనివారం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఉపాధ్యాయులు స్థానిక ఎస్పీ కార్యాలయం ముందున్న తెలుగు తల్లి విగ్రహానికి వినతిపత్రం అందజేసారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద ఉపాధ్యాయులు మూతికి నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌టిఎ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదిశేషయ్య, వేణుగోపాల్‌లు మాట్లాడుతూ విద్యా శాఖలోని ఉపాధ్యాయులకు గత 20 సంవత్సరాలుగా పదోన్నతులు చేపట్టలేదని, ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించుకున్నా, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగును బోధించే భాషోపాధ్యాయులకు, హిందీ భాషోపాధ్యాయులకు తగిన న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎల్‌టిఏ సంఘం ఉపాధ్యాయులు శివానందరెడ్డి, రాజన్న, సలీం, ఆదిమూర్తి, తిమ్మప్ప, శ్రీదేవి, శ్రీలత, మోతీలాల్, నాగరాజు, వెంకటరాముడు, మల్లికార్జునరెడ్డి, హరికృష్ణ, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
న్యాయవాదులు అనుసంధాన కర్తలుగా ఉండాలి
అనంతపురం సిటీ, సెప్టెంబర్ 23: న్యాయవాదులు కోర్టులకు, ప్రభుత్వ అధికారులకు అనుసంధాన కర్తలుగా ఉండాలని డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి న్యాయవాదులకు సూచించారు. శనివారం స్థానిక రెవిన్యూ భవన్‌లో జిల్లాలోని ప్రభుత్వ న్యాయవాదుల, సహాయ ప్రభుత్వ న్యాయవాదులతో డిఆర్‌ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ న్యాయస్థానం వారీగా ఎన్ని కేసులు నమోదైనవి, ఎన్ని పరిష్కరించబడనవి, అందులో ప్రభుత్వం ఎన్నిక కేసులలో అనుకూల తీర్పులు పొందినది, ఎన్ని కేసులలో ప్రతికూల తీర్పులు పొందనవి, ఎన్ని కేసులు పరిష్కారం కాలేదని వివరాలను న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిఆర్‌ఓ మాట్లాడుతూ ప్రభుత్వ కేసులను త్వరిగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు పాల్గొన్నారు.
ఆత్మకూరు తహశీల్దార్‌గా నారాయణ
ఆత్మకూరు, సెప్టెంబర్ 23: ఆత్మకూరు తహశీల్దార్‌గా నారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్ కార్యాలయ సిబ్బం ది ఆయనకు స్వాగతం పలికి పూలమాలతో సత్కరించారు.

హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 23: ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపాలని ఎస్పీ జివిజి అశోక్‌కుమార్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం ఇటుకలపల్లిలోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ, డిప్యూటి ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సుధీర్‌వడ్డే, ఆర్‌టిఓ శ్రీ్ధర్, కాలేజి ఛైర్మెన్ అనంత రాముడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరానికి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో 600 మరణిస్తున్నారని, అందులో ఎక్కువగా యువత ఉన్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు రవాణా శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతందని తెలిపారు. యువత అతివేగంగా వాహనాలను నడపడం వల్ల మృత్యవాతపడుతున్నారని, 18 సంవత్సరాల నుండి 30 సంవ్సరాల వయస్సు కలిగిన వారే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని కాలేజిల్లోని యువతీ యువకులకు ఎల్‌ఎల్‌ఆర్ మేళా ద్వారా అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలను అమలుచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఆర్‌వి మధుసూదన్, మల్లికార్జున, రమేష్, కరుణాసాగర్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

కరవును సమర్థవంతంగా ఎదుర్కొంటాం

అనంతపురం అర్బ న్, సెప్టెంబర్ 23: వరస కరవులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనంత రైతన్నను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో బాసటగా నిలుస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ బోయ నాగరాజు తెలిపారు. శనివారం మొదటి రోజున తన ఛాంబర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గానికి చెందిన తనకు దక్కడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కృషి మరవలేనన్నారు. పార్టీని నమ్ముకున్నందుకు తనకు జిల్లా పరిషత్ చైర్మన్ దక్కిందన్నారు. బిసిలకు తెదేపాలోనే న్యాయం జరుగుతుందన్నది తన ఎంపిక ద్వారా మరోసారి రుజువైందన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధిలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా తనవంతు పాత్ర వహిస్తానన్నారు. జిల్లాకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అనంతపురం జిల్లాకు పెద్ద ఎత్తున ఇవ్వటం జరిగిందన్నారు. త్వరలో రుణమాఫీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జిల్లాపై ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. ఇప్పటికే జిల్లాకు కియో కార్ల కంపెనీ రావటం జరిగిందన్నారు. జిల్లా పరిషత్‌లో నిధులు లేమి వాస్తవమేనని వీటిని త్వరలోనే అధిగమిస్తామన్నారు. అనంతరం పంచాయతీ రాజ్ ఉద్యోగులు ఏర్పాటుచేసిన అభినందన సభలో చైర్మన్ పాల్గొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ఉద్యోగులంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. జిల్లా పరిషత్‌లో సమస్యల పరిష్కారం కోసం నూతనంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు