అనంతపురం

గజలక్ష్మి అలంకారంలో అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 25: శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా నగరంలోని వివిధ దేవాలయాల్లో అమ్మవారిని గజలక్ష్మి అలంకారంతో అలంకరించారు. సోమవారం నగరంలోని పాతవూరు అమ్మవారిశాలలో కన్యకాపరమేశ్వరీదేవిని గజలక్ష్మిగా అలంకరణ చేశారు. కొత్తవూరు అమ్మవారిశాలలోని కన్యకాపరమేశ్వరిని మూకాంబికాదేవి, బాదం, పిస్తాతో అలంకారం చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నగరంలోని శారద శృంగేరీ మఠంలో శారదాదేవిని ఇంద్రాణి అలంకరణ చేసారు. శంకర మఠంలో భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్‌ఎల్‌సి కాలనీలో ముత్యాలమ్మకు అన్నపూర్ణాదేవి అలంకారం, చాముడేంశ్వరీగా గజలక్ష్మి అలంకారం, ఉమానగర్‌లో రేణుకా ఎల్లమ్మ స్వామిని థర్మాకోల్ అలంకారం చేశారు. నగరంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మత్సోవాలు భాగంగా శ్రీనివాసుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కృష్ణావతారంలో దర్శనమిచ్చిన శ్రీవారు
కదిరి, సెప్టెంబర్ 25: శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి కృష్ణావతార అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా విశేషంగా అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. స్వామివారిని ప్రత్యక్షంగా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి ఛైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, పాలక మండలి సభ్యులు మోపూరిశెట్టి చంద్రశేఖర్, రొడ్డారపు నాగరాజు, ఆలయ ఈఓ వెంకటేశ్వరరెడ్డితోపాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాగా మదనపల్లి రోడ్డులో వున్న శ్రీ చౌడేశ్వరిదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం లలితాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గాయత్రీమాతగా దర్శనమిచ్చిన దుర్గాదేవి
లేపాక్షి, సెప్టెంబర్ 25: శిల్పకళారామంగా పేరొందిన లేపాక్షి వీరభద్రాలయంలో వెలసిన దుర్గాదేవి సోమవారం భక్తులకు గాయత్రీమాతగా దర్శనమిచ్చింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి అర్చకులు సూర్యప్రకాశరావు, నరసింహశర్మల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, సప్తశతి పారాయణం, రుద్రాభిషేకం, శ్రీ చక్రార్చన వంటి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆంధ్ర, కర్నాటక ప్రాంతాలకు చెందిన పలువురు భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లేపాక్షికి చెందిన కాంట్రాక్టర్ నారాయణస్వామి భక్తులకు ప్రసాద వినియోగం కావించారు.