అనంతపురం

ఇదెక్కడి అన్యాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, అక్టోబర్ 13 : రూ.లక్షలు వెచ్చించి పనులు చేస్తే ఏడాదిన్నర కాలంగా విచారణ పేర జాప్యం చేసి తక్కువగా బిల్లులు మంజూరు చేస్తుండటంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. రూ.లక్షల్లో పనులు చేస్తే రూ.వేలల్లో బిల్లులు మంజూరు చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విచారణల పేరుతో ఇచ్చిన నివేదికల ఆధారంగా బిల్లులు ఇస్తున్న తీరు చూస్తుంటే అప్పుల వాళ్లకు కుటుంబమంతా కుదువకున్నా జీవితంలో తీర్చలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్‌లో ఎడాది నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులను నాలుగైదు రోజులుగా చెల్లిస్తున్నారు. చేసిన పనులకు రాబడి మాట దేవుడెరుగు, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. రూ.60వేలకు పైగా పని చేసినవారికి రూ.6వేలు, రూ.2.70 లక్షలు పని చేసినవారికి రూ.40వేలు చెల్లించాలని ఏడాదిన్నర క్రితం విచారణ చేసిన అధికారుల నివేదికల ప్రకారం బిల్లులు చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పబ్లిక్‌హెల్త్ ఎస్.ఇ శ్రీనాథరెడ్డితో ఏడాదిక్రితమే విచారణ చేసి నివేదికను కార్పొరేషన్ కార్యాలయానికి పంపితే ఆ నివేదికను బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉంచటంలో ఆంతర్యమేంటని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యనేత ఆడించినట్లా ఆడుతూ ఆయన చెప్పిందే వేదం అన్నట్లుగా కాంట్రాక్టర్లను విచారణాధికారులు నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో ఏడాదిన్నర కాలంగా బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసిన అధికారుల తీరు చూస్తుంటే ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంలా ఉందంటున్నారు. వాస్తవంగా చేసిన బిల్లులకన్నా బోగస్ బిల్లులకు కోతలు లేకుండానే ముందుగానే చెల్లించారని ఆరోపిస్తున్నారు. వాస్తవంగా రూ.పది లక్షలతో చేసిన సిమెంటు రోడ్డు, కాలువకానీ ఉంటే దాన్ని అంచనా ప్రకారం ప్రారంభ డోర్ నెంబరు నుంచి ముగింపు డోర్ నంబర్ వరకూ స్పష్టంగా పేర్కొన్నారన్నారు. అయితే బోగస్ బిల్లుల్లో ముగింపుడోర్ నంబర్ నుంచి ప్రారంభ డోర్ నంబర్ వరకు రివర్స్ అంచనాలు తయారుచేసి ముందుగా బోగస్ బిల్లు మంజూరు చేసిన ఘటనలు అనేకంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటి బోగస్ బిల్లులు విచారణాధికారుల కంటికి కనపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వ్యక్తులపై కక్షసాధించటానికి విచారణ పేర కాంట్రాక్టర్లందరినీ బలిపశువులు చేయటం తగదని వాపోతున్నారు. పాలకవర్గం, ముఖ్యనేత నిర్వాకాలతో ఆర్థికంగా నష్టపోయి వీధినపడాల్సిన పరిస్థితి తలెత్తిదంటున్నారు. నేతలు, విచారణాధికారుల నిర్వాకాలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కొంతమంది యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కాంట్రాక్టర్ల బిల్లుల ‘ఊచకోత’ కోసిన విచారణాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఆనందించాలా.. బాధపడాలా..!
* వర్షం కురిసిందని ప్రజల సంతోషం.. * పంట నష్టంతో రైతుల్లో ఆందోళన
* జిల్లాలో 25వేల ఎకరాల్లో పంటనష్టం * వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా
నల్లమాడ, అక్టోబర్ 13 : దశాబ్దకాలంగా వర్షాభావ పరిస్థితులు, కరువుతో సతమతమవుతున్న సమయం లో వర్షాలు కురిసి ఊరటనిచ్చాయని ఆనందించాలో... అరకొరగా సాగు చేసుకున్న పంట చేతికొచ్చే సమయ ంలో నీళ్లపాలైనందుకు బాధపడా లో.. తెలియని అయోమయ పరిస్థితు ల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు సుమారు 25వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అధికంగా గుంతకల్లు, వజ్రకరూరు, పామిడి, గుత్తి, పెద్దవడగూ రు, పెద్దపప్పూరు, యల్లనూరు మం డలాల్లో రైతన్నలు అధికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇందులోనూ వేరుశెనగ పంట పూర్తి కావడంతో పొ లాల్లో తొలగించి ఉంచగా వర్షానికి కొట్టుకుపోయింది. మరికొంత కుళ్లిపోయింది. నల్లరేగడి భూములున్న ప్రాంతాల్లో అత్యధికంగా సాగులో ఉన్న పత్తి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పంట సాగు చేసినప్పటి నుంచి చేతికొచ్చేంత వరకు చీడలు సోకకుండా పిచికారి చేసే రసాయనిక మందుల కోసం రూ.వేలు వెచ్చిస్తుంటారు. పొలాల్లో నుంచి పత్తి ని తొలగిద్దామనుకున్న సమయంలో కురిసిన భారీ వర్షాలకు నల్లగా మారి నష్టాన్ని మిగిల్చింది. అదేవిధంగా వరి, మిరప, టమోటా, వంగ, తదితర పంటలు నీట మునిగాయి. ముదిగుబ్బ మండలంలో టమోటా, వంగ, మిరప, వేరుశెనగ పొలాల్లో పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో భారీ స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది. వర్షాలు కురవడం తగ్గిపోతే ఉన్న పంటలు సైతం చేతికొచ్చే పరిస్థితి కనిపించలేదు. రానున్న రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనిన వాతావరణ శాఖ వార్తల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగి వర్షాలు వస్తే మరికొన్ని ప్రాంతాల్లో మరింత పంట నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఏదేమైనా జిల్లాలో కురిసిన వర్షాలు కొంతమందికి ఆనందాన్ని మిగిలిస్తే మరికొంతమందికి కష్టాలు తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు.
ప్రాథమికంగా నష్టం అంచనా..
- శ్రీరామ్మూర్తి, జిల్లా వ్యవసాయ సంచాలకులు.
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను ప్రాథమికంగా అంచనా వేశాం. వర్షాలు ఇంతటితో ఆగితే కొంత నష్టం తగ్గొచ్చు. ఒకవేళ కురిస్తే మరింత నష్టం వాటిల్లవచ్చు. వర్షాలు బాగా కురుస్తున్నందుకు ఆనందం వ్యక్తమవుతోంది. అయితే నష్టపోతున్న రైతన్నలను చూస్తే బాధ కలుగుతోంది. రైతన్నలు అధైర్యపడొద్దు. వర్షం కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాం.