అనంతపురం

భయం గుప్పిట్లో జీడిపల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, అక్టోబర్ 14 : రిజర్వాయర్ ఊటనీటితో గ్రామంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని జీడిపల్లి గ్రామస్థులు బిక్కుబిక్కుమం టూ జీవనం సాగిస్తున్నారు. ఓవైపు శ్రీశైలం డ్యాం ను ంచి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే పూర్తిస్థాయి లో రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు రావడంతో పిఎబిఆర్‌కు విడుదల చేస్తున్నారు. మరోవైపు వరుసగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలుతున్నాయి. రిజర్వాయర్ ఊటతో స్థానికులు నాగరాజు, రామాంజినేయులు, ఆ ంజనేయులు, ఇళ్లు పునాదుల్లో నుంచి నీరు పైకి ఉబి కి వస్తొంది. దీంతో ఇళ్ల మధ్యలోనే నీటి ప్రవాహం ఉంటోందని వాపోతున్నారు. మూడు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడంటూ స్థానికులు ఓబుళమ్మ, రామాంజినమ్మ, లింగన్న, ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నాయకులు వచ్చి వెళ్తున్నారె తప్ప చేసింది శూన్యమంటున్నారు. ఊటనీటితోపాటు వర్షాలకు ఇళ్ల గోడలు పాచిపట్టాయి. ఫలితంగా గాలి ఎర్రిస్వామి, వన్నూరప్ప, మారెన్న, శ్రీనివాసులు, పెన్నోబిలేసు, సన్నకుళ్లాయి, పెన్నోబులుకు చెందిన ఇళ్లు పూర్తిగా పడిపోయాయి. జీడిపల్లి రిజర్వాయర్ పరిశీలనతోపాటు రెండవ దశ పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినప్పుడు గ్రామం ముంపునకు గురవుతోందని, ఆదుకోవాలని ప్రజలు విన్నవించగా గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించాలని అప్పట్లో సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసి మూడు సంవత్సరాలు గడుస్తున్నా పునరావాసం కల్పించకపోవడం విడ్డూరం. అలాగే ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ గ్రామంలో నేరుగా ఊటనీటితో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమణించారు. అలాగే అప్పటి జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆర్డీఓ రామారావు సైతం పరిస్థితి నివేదికలను ప్రభుత్వానికి అందించారు. గతేడాది పుష్కరాల సమయంలో లక్షలాది మంది జలాశయంలో పుష్కరస్నానం చేశారు. అప్పుడు కూడా మంత్రులు జిల్లా అధికార యంత్రాంగం గ్రామ పరిస్థితిని కళ్లారా చూశారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఎవరొచ్చినా అదిగో, ఇదిగో అంటూ పనులు చేస్తామని కాలయాపన చేస్తున్నారే తప్ప తమకు పునరావాసం కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తుండటం విశేషం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు పునరావాసం కల్పించాలని జీడిపల్లి గ్రామస్థులుకోరుతున్నారు.
భయం జీవిస్తున్నాం..: సర్పంచ్ వెంకటనాయుడు
రిజర్వాయర్ ఊటనీటితో గ్రామంలో ఎప్పుడు ఇళ్లు కూలి ప్రాణ నష్టం జరుగుతుందో అని భయంలో బతుకుతున్నాం. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సహకారంతో పలుమార్లు గ్రామానికి పునరావాసం కల్పించాలని అమరావతికి వెళ్లి విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకుని గ్రామాన్ని తరలించాలని కోరుతున్నాం
ఎప్పడేం జరుగుతుందో..: గ్రామస్థుడు రవితేజ
గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందో దినదిన గండంగా బతుకుతున్నాం. నా ఇంటి పునాదుల నుంచే ఊటనీరు ఉబికి వస్తోంది. గోడలు ఎప్పుడు పడిపోతాయో భయంగా ఉంది..
విష పురుగుల బారిన పడుతున్నాం..: గ్రామస్థురాలు దేవి
మా ఊటనీరు ఎక్కువగా ప్రవహిస్తుండడంతో ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటే భయం వేస్తోంది. రాత్రిళ్లల్లో ఎప్పుడు ఏ విష పురుగు వచ్చి కాటేస్తుందో తెలియడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారే తప్ప చేసిందేమీ లేదు. పునరావాసం కల్పిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం..