అనంతపురం

అన్నీ రూ.40పైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 17 : జిల్లాలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమోటా, మిరప, బెండ, వంకాయ, ఉల్లి, బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికం వంటి కూరగాయల రేట్లు మండుతున్నాయి. ధరల వారీగా చూస్తే.. టమోటా రూ.40, వంకాయలు రూ.40, బెండ రూ.30, పచ్చిమిరప రూ.20, బీన్స్ రూ.60, క్యారెట్ రూ.40, బంగాళాదుంపలు రూ.30, రూ.20, ఉల్లిగడ్డలు (నాణ్యత ఉన్నవి) 40, నాణ్యత, చిన్నగా ఉన్నవి రూ.20, రూ.30 (మూడు కిలోలు-దడెం : రూ.50, రూ.60), బీట్‌రూట్ రూ.40, క్యాబేజీ రూ.40, క్యాప్సికం రూ.40 మేరకు పలుకుతున్నాయి. వర్షాల కారణంగా గతవారం నుంచి బెంగళూరు, కర్నూలు, మదనపల్లి, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పది రోజుల క్రితం టమోటా 3కిలోలు రూ.10 ఉండగా, ఇప్పుడు కిలో రూ.30పైనే పలుకుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో చాలాచోట్ల రైతులు పండించిన టమోటా వర్షం దెబ్బకు కుళ్లిపోవడం, దిగుబడి బాగా తగ్గిపోయింది. కాగా ఆకుకూరల ధరలు కొంత మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. వర్షాలు మరికొన్ని రోజులు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అరకొరగా మార్కెట్ వస్తున్న స్థానికంగా పండే టమోటా, మిరప, బెండ, వంకాయ తదితర కూరగాయలు భారీగా తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ వర్షాలు రాకున్నా నేలకొరిగిన పంటలు తిరిగి కోలుకోవడానికి మరిన్ని రోజుల సమయం పట్టే అవకాశంది. కాగా టమోటా, ఉల్లిగడ్డలు, ఇతర కూరగాయల దిగుమతికి జిల్లా యంత్రాంగం, మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకుంటే ధరలు చుక్కల్ని చూపించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా హార్టికల్చర్ శాఖ గణాంకాల మేరకు టమోటా పంట జిల్లాలో 493.36 హెక్టార్లలో భారీ వర్షాలకు నాశనమైంది. దీంతో రూ.641.27 లక్షలను రైతులు నష్టపోయారు. మిరప పంట 1324.40 హెక్టార్లలో వర్షార్పణం కాగా, రూ.3864.83 లక్షలు నష్టం వాటిల్లింది. వంకాయ పంట 38 హెక్టార్లలో ధ్వంసం కాగా, రూ.24.52 లక్షలు నష్టం జరిగింది. బీన్స్ 0.80 లక్షల హెక్టార్లు, ఉల్లి పంట 44.80 హెక్టార్లలో నీటిపాలైంది. దీంతో ఉల్లి రైతులు 51 మంది రూ.30.12 లక్షలను నష్టపోయారు. బెండ 14.60 హెక్టార్లలో, అరటి 188.60 హెక్టార్లలో నష్టం జరిగింది. కరివేపాకు పంటలు కూడా జిల్లాలో చాలా చోట్ల నష్టపోయాయి.
ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి
- హిమశైల, ఎడి మార్కెటింగ్
రైతులు తమ ఉత్పత్తుల్ని నేరుగా రైతు బజార్లకు తీసుకొచ్చి విక్రయించుకోవచ్చు. వారికి ఉచితంగానే స్టాల్స్ ఇస్తాం. వర్షాల కారణంగా కూరగాయల ధరలు పెరుగున్నందున టమోటా, ఉల్లిగడ్డలు, ఇతరత్రా అత్యవసర నిత్యావసర కూరగాయల దిగుమతి, కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత కొన్ని నెలల క్రితం కర్నూలు నుంచి ఉల్లిగడ్డలు కొనుగోలు చేసి సరఫరా చేశాము. ఇదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం అనుమతిస్తే జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టమాట, ఉల్లి వంటి వాటి దిగుమతికి చర్యలు తీసుకుంటాం.