అనంతపురం

అధైర్య పడవద్దు..వచ్చేది మన ప్రభుత్వమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 17 : అధై ర్య పడవద్దు.. వచ్చేది మన ప్రభు త్వమే.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ధర్మవరంలో చేనేత కార్మికు లు చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏడాదిలోపు మన(వైకాపా) ప్రభు త్వం వస్తోంది. మంచి అన్నయ్య ము ఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటున్నారని జనానికి చెప్పండి’ అంటూ పిలుపునిచ్చారు. ‘నేను సిఎం కావాలని దే వున్ని గట్టిగా ప్రార్థించండి. మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు కావాలి’ అని కో రారు. ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే చేనేతలకు రూ.2వేలు పెన్షన్ ఇస్తామన్నారు. పేదలందరికీ 25లక్షల ఇళ్లు, రూ.లక్ష వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా ధర్మవరం పట్టు వస్త్రాలు, చేనేతలకు పేరుగాంచిందన్నారు. ఇలాంటి పట్టణం గురించి దేశమంతా చెప్పుకుంటారన్నారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక చేనేతల సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. 65 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటే 11 మందికి ముష్టి వేసినట్లు పరిహారం అందించి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష మేర వడ్డీ లేని రుణాలు అందిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్రతి చేనేతకూ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వడంతోపాటు మగ్గం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చేనేతలకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక బ్యాంకు, నిధి ఏర్పాటు చేయిస్తామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక హెల్త్ స్కీమ్ ఎత్తిపోయిందన్నారు. అధికారం కోసం చంద్రబాబు కులాలను సైతం వదల్లేదని ఆరోపించారు. ఆయన అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయినా ఒక్క సబ్సిడీ కూడా దక్కలేదని విమర్శించారు. చంద్రబాబు మోస పూరిత వాగ్దానాల వల్లే చేనేతలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క రైతుకు కూడా మేలు జరగలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం కావాలని కోరారు. ‘చేనేత ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి, ఇంట్లో ముగ్గురు కష్టపడితే రోజుకు రూ.150 రాని పరిస్థితి. అయినా మీ బాధలను అడిగే నాథుడు లేడు.. పట్టించుకునే పరిస్థితి లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చేనేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలు తీవ్రతరం చేద్దామని పిలుపునిచ్చారు. వచ్చే ఒక్క సంవత్సరంలో జనం అందరం ఒక్కటై మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందామన్నారు.

ఆంత్రాక్స్ అలజడి
* చెట్లమొరంపల్లిలో ముగ్గురికి వ్యాధి లక్షణాలు * నిర్ధారించిన డిఎంహెచ్‌ఓ.. అనంతపురం తరలింపు
గోరంట్ల, అక్టోబర్ 17 : అనుకున్న ంతా అయింది... గొర్రెలకు సోకిన ఆ ంత్రాక్స్ మనుషులకు పాకింది. మం డల పరిధిలోని చెట్లమొరంపల్లిలో ఇప్పటికే ఆంత్రాక్స్ వ్యాధి సోకి 50 గొర్రెలు, మేకలు మృతి చెందిన విష యం తెలిసిందే. అయితే ఆంత్రాక్స్ వ్యాధి సోకి మృతి చెందిన గొర్రె మాంసం తిన్న ముగ్గురికి సైతం వ్యాధి సోకింది. సమాచారం అందుకున్న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, అదనపు డిఎంహెచ్‌ఓ పద్మావతి సిబ్బందితో గ్రామానికి చేరుకుని పరిశీలించారు. ఆయా బాధితులకు శరీరంపై బొబ్బలు వ్యా పించడంతో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణం గా భావించి స్థానిక వైద్యాధికారులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు. తొలుత ఇద్దరిని గోరం ట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పరీక్షించిన వైద్యాధికారులు ఆంత్రాక్స్ వ్యాధిగా ప్రాథమికంగా నిర్ధారించారు. మరి కొంతసేపటికే మరో మహిళను పిహెచ్‌సికి తీసుకొచ్చారు. వీరిని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆంత్రాక్స్ మనుషులకు పాకడంతో గ్రామంలో తీవ్రభయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వ్యాధి లక్షణాల మేరకు ఆంత్రాక్స్‌గా ప్రాథమికంగా నిర్ధారించామని, అనంతపురంలో రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు నాలుగు విధాలుగా ఉంటాయన్నారు. గొర్రెలకు వచ్చే బొబ్బర్ల వ్యాధిలా మనుషుల శరీరంపై బొబ్బలు వస్తాయన్నారు. వ్యాధి నివారణ కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో వైద్యాధికారి బండి రాజా, డాక్టర్ ప్రతాప్‌ల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మళ్లీ భూప్రకంపణలు
* మైలారం, జీడిపల్లిలో శబ్ధాలు.. * భయంతో పలుగులు తీసిన జనం..
బెళుగుప్ప/ఉరవకొండ, అక్టోబర్ 17 : బెళుగుప్ప మండలంలోని జీడిపల్లి, ఉరవకొండ మండలం మైలారంలో మంగళవారం మరోసారి భూప్రకంపనలు సంభవించారు. దీంతో భయాందోళనలతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. జీడిపల్లిలో మంగళవారం తెల్లవారుజామున 3:59 కు భారీ శబ్ధం వచ్చి భూమి కొన్ని సెకన్లపాటు కంపించినట్లుయిందని గ్రామస్థులు తెలిపారు. వారంలో రెండుసార్లు, ఈ ఏడాదిలో మూడు సార్లు భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ ఇళ్ల బయటే కాలం వెల్లదీస్తున్నారు. అయితే అధికారులు మాత్రం జలాశయాన్ని ఆనుకుని జీడిపల్లి ఉండడంతో ఇలా శబ్ధాలు రావడం సహజమే నంటున్నారు. గ్రామస్థులు మాత్రం ఎప్పుడు ఏ ప్రమాదం సంబవిస్తుందో అని భయాందోళన చెందుతున్నారు. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని సర్పంచు వెంకటనాయుడు, గ్రామస్థులు కోరుతున్నారు.
మైలారంలో స్వల్పంగా కంపించిన భూమి
ఉరవకొండ మండలంలోని మైలారంపల్లి గ్రామంలోని మంగళవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించి పెద్దఎత్తున శబ్ధాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెల్లవారుజామున గాఢనిద్రలో ఉన్న సమయంలో పెద్ద శబ్ధం రావడంతో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు భయపడి బయటికి పరుగులు తీశారు. దీంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. నాలుగురోజుల క్రితం పెద్ద శబ్ధం వచ్చి భూప్రకంపనలు వచ్చాయన్న విషయం పాఠకులకు విధితమే. జీడిపల్లి రిజర్వాయర్ అతిసమీపంలో ఉందని, రిజర్వాయర్‌లో నీటినిల్వలు ఎక్కువగా ఉందని, ఒక్కసారి శబ్ధాలు వచ్చినట్లు కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు.

బాధ్యతగా మొక్కలు పెంచాలి
* మంత్రి పరిటాల సునీత
రామగిరి, అక్టోబర్ 17: ప్రతి ఒక్కరూ మొక్కలను బాధ్యతగా పెంచి సంరక్షించాలని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని నసనకోట మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో వనం-మనం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పా ఠశాల ఆవరణలో విద్యార్థులచే 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మొక్కలు నాటి ప్ర తి ఒక్కరూ మొక్కను దత్తత తీసుకుని పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ చెట్లు మానవ మనుగడకు ఆధారమని, వర్షాలు రావాలన్నా, మనం జీవించాలన్నా చెట్లు చాలా ప్ర ధానమైనవన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా తీసుకోవాలని, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించడానికి సమీప గ్రామాల ప్రజలు బాధ్యత తీసుకోవాలన్నారు. పాఠశాలలో విద్యార్థులు నాటిన మొక్కలను చక్కగా పెంచితే రేపటి తరాల్లో కూడా మీరు పెంచిన మొక్క చెట్టై గుర్తుండిపోతుందన్నారు. చదువుతోపాటు మొక్కలు పెంచడం కూడా ఇష్టంగా చేసుకోవాలన్నారు. సిఎం చంద్రబాబు ఎంతో మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, జల హారతి కార్యక్రమాన్ని కూడా సత్సంకల్పంతో చేపట్టడం జరిగిందన్నారు. మొక్కలు పెంచితే పరీక్షల్లో మార్కులు కూడా వేయాలని సిఎం ఆలోచనలో వుందని, ఇది త్వరలో అమలవుతుందన్నారు. అధికారులు కూడా మొక్కలు నాటడం కాదు, వాటిని ఎన్ని సంరక్షించగలిగాం, ఎన్ని పెద్దవయ్యాయన్నదే గుర్తించుకోవాలన్నారు. గ్రామాల్లో ఇంటింటికి 5 మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, వాటిని బాగా పెంచాలని తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎఫ్‌ఓలు వెంకటరమణ, చంద్రశేఖరరావు, డ్వామా పిడి వెంకటేశ్వర్లు, అటవీ శాఖ అధికారులు రామ్మోహన్‌రెడ్డి, గోవిందు, ఎంపిడిఓ పూల నరసింహులు, ఆర్‌డిఓ బాలానాయక్, తహశీల్దార్ ఆదినారాయణ, టిడిపి నాయకులు కొండన్న, ఎల్.నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, రంగయ్య, బడగొర్ల ఆంజనేయులు పాల్గొన్నారు.
త్వరితగతిన ‘కియా’ పనులు పూర్తి చేయాలి
* పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి
అనంతపురం సిటీ, అక్టోబర్ 17: జిల్లాలో ప్రారంభమవుతున్న కియా కార్ల కంపెనీ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఏపి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కొరియాలో సియోల్ నమ్‌యాంగ్ వద్ద వున్న కియా మోటార్స్ కార్పొరేషన్ వారి రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫెసిలిటీని మంత్రి, ఏపిఐఐసి ఎండి బాబు, కలెక్టర్ జి.వీరపాండ్యన్‌లను సందర్శించారు. అనంతరం కియా మోటార్స్ కార్పొరేషన్ వైస్ ఛైర్మెన్, సిఇఓ లీ, ప్రసిడెంట్ పార్క్, సిఎఫ్‌ఓ కిమ్, ఎండి షిమ్, కియా మోటార్స ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిండెంట్ జిన్‌లతో సమావేశం నిర్వహించారు. వైస్ ఛైర్మెన్, సిఇఓలు జిల్లాలోని ఎర్రమంచిలో జరుగుతున్న కియా ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి, కలెక్టర్‌లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి సైట్ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, వాటిని వేగవంతంగా జరిగేలా సిఎం సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. త్వరతిగతిన పూర్తి చేసి కియా మోటార్స్‌కు అప్పగిస్తామని మంత్రి తెలియజేసారు.
సరిహద్దులో హెచ్చెల్సీకి తగ్గిన నీటి మట్టం
బొమ్మనహాల్, అక్టోబర్ 17 : తుంగభద్ర జలాశయం ద్వారా హెచ్‌ఎల్‌సి ప్రధాన కాలువకు వచ్చే నీటిని నిలుపుదల చేసినట్లు జలాశయం సిబ్బంది తెలిపారు. ఆంధ్రా, కర్నాటకల్లో వర్షాలు కురుస్తున్న కారణంగా నీటితో పెద్దగా అవసరం లేని కారణంగా ప్రస్తుతానికి వారంరోజులు హెచ్‌ఎల్‌సికి నీరు నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు తీర్మానం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో ఇన్‌ఫ్లో 13,738 క్యూసెక్కులు వస్తుండగా, 86.342 టిఎంసీలు నిల్వ ఉన్నట్లు తెలిపారు. జలాశయం నుంచి రోజూ 2,700ల క్యూసెక్కుల నీరు విడుదల చేసేవారమని, ప్రస్తుతం 300ల క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నట్లు తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి ప్రకారం ప్రతి నెలా 15 రోజులు విడుదల చేసి, 15 రోజులు ఆఫ్ చేయాలని జలాశయం ట్రిబ్యునల్ కమిటీ తీర్మానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో సరిహద్దులో 200 క్యూస్కెలు మాత్రమే వస్తున్నట్లు జెఇ తెలిపారు.
ఫౌంటేన్ కాదు..
సత్యసాయి పైపులైన్..
బత్తలపల్లి, అక్టోబర్ 17: మండలంలోని మాల్యవంతం, తాడిమర్రి ప్రధాన రహదారిలో మంగళవారం సత్యసాయి పైపు పగలడంతో నీరు ఒక్కసారిగా ఆకాశం వైపు ఎగిరాయి. దీంతో ఆ దృశ్యం ఫౌంటేన్ తరహాలో అగుపించింది. అటువైపు వెళుతున్న వారు, బస్సులలో ప్రయాణించే వారు ఆ దృశ్యాన్ని తిలకిస్తూ సెల్‌ఫోన్లలో బంధించారు. అటుగా వెళుతున్న బత్తలపల్లి ఎస్‌ఐ హరూన్‌బాషా సత్యసాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో స్పందించిన సత్యసాయి సిబ్బంది నీటి సరఫరాను నిలుపుదల చేసి మరమ్మతు పనులు చేపట్టారు.
పంటలను పరిశీలించిన జగన్

అనంతపురం, అక్టోబర్ 17 : జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్ష నేత వై ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ధర్మవరం మండలం సీతారాంపల్లిలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ధర్మవరానికి వచ్చిన ఆయన మార్గమధ్యంలో పంటల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భారీవర్షాలతో నష్టపోతే కనీసం వచ్చి చూసే నాథుడే లేకుండా పోయాడని మండిపడ్డారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతన్నలు తమ కష్టాలను జగన్‌కు మొరపెట్టుకున్నారు.
ఘనంగా హజ్రత్ సయ్యద్‌షా మస్తాన్‌వలి ఊరేగింపు
గుంతకల్లు, అక్టోబర్ 17 : మతసామరస్యానికి ప్రతీకగా పట్టణంలో వెలసిన హజ్రత్ సయ్యద్‌షా మస్తాన్‌వలి ఊరేగింపు వేలాది మంది భక్త జనసందోహం నడుమ మంగళవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున పాత గుంతకల్లుకు చెందిన తిమ్మారెడ్డి కుటుంబ సభ్యుల ఇంటి వద్ద నుంచి మస్తాన్‌వలి షంషీర్‌ను పూలు, చద్దర్‌లతో ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నగరాలు, డప్పులు, దీవిటిలతో స్వామివారి ఉరేగింపు నిర్వహించారు. స్వామి దర్శనానికి జిల్లా నుంచే కాకుండా కర్నాటక, మహారాష్టల్ర నుండి విచ్చేయడంతో పాత గుంతకల్లు భక్తజనసంద్రమైంది. తెల్లవారుజాము 1 గంట నుంచి ప్రారంభమైన షంషీర్ ఊరేగింపు ఉదయం 10 గంటలకు దర్గాలోని మస్తాన్‌వలి సమాధి మందిరం చేరుకుంది. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారి కోసం ఏర్పాటు చేసిన ధివిటీలలో కొబ్బరిని కాల్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఉదయం దర్గాను చేరుకోగానే స్వామి షంషీర్‌ను కొలువుదీర్చి ప్రత్యేక చదివింపులు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఊరేగింపులో తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ రాజ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

వేపరాళ్ల చెరువులో మహిళ మృతదేహం
రాయదుర్గం రూరల్, అక్టోబర్ 17 : మండల పరిధిలోని వేపరాళ్ల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం మంగళవారం బయటపడింది. వేపరాళ్ల చెరువులో నుంచి పైకి తేలిన మృతదేహాన్ని గమణించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చి శవాన్ని బయటికి తీశారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 45 ఉండవచ్చని, మెడకు తాడుబిగించి ఉండటంతో హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.
కమ్యూనిస్టుల దిష్టిబొమ్మ దహనం
అనంతపురం సిటీ, అక్టోబర్ 17: కేరళ రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కేరళ రాష్ట్ర బిజెపి చేపట్టిన ర్యాలీకి మద్దతుగా మంగళవారం బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ వద్ద కమ్యూనిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. మొదట కృష్ణ కళామందిర్ నుండి భాజపా నాయకులు టవర్‌క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో . బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిఎన్‌ఎస్ లలిత్‌కుమార్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు ఓలేటి రత్నమయ్య, నగర అధ్యక్షుడు కెఎం శ్రీనివాసులు, సోమయ్య, నరసింహయ్య, పెద్దన్న, వీరాంజినేయులు, పగడాల శ్రీనివాసులు, మల్లీశ్వరీ, లీలావతిమ్మ, మోహన్, రామచంద్ర పాల్గొన్నారు.
రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కార్యవర్గం ఏర్పాటు
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 17: రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కార్యవర్గాన్ని వ్యవస్థాప అధ్యక్షులు జి.నాగరాజు మంగళవారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా సాకే రామతీర్థ, ఆవుల చక్రధర్‌యాదవ్, మహబూబ్‌బాషా, మల్లికార్జున నాయక్, జి.రంగనాయకులు నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కె.ఆనంద్, ఇమామ్, విఠల్‌గౌడ్, పుల్లయ్య, నిమ్మలనాగరాజు, అధికార ప్రతినిధులుగా నేసే కోదండరామ్, పవన్‌కుమార్, శివశంకరనాయక్, వెంకటరాముడు, గఫూర్ తదితరులతో పాటు మరో 22 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈసందర్భంగా అధ్యక్షులు జి.నాగరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల పరిరక్షణ కొరకు ఆర్‌పిఎస్ పనిచేస్తుందని, త్వరలో జిల్లా మండల కమిటీలను ఎంపిక చేస్తామని తెలిపారు.
కవులకు కృతజ్ఞతలు
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 17: 33 గంటల, 44 నిమిషాల, 55 సెకన్ల ప్రపంచ రికార్డు కవిసమ్మేళనానికి విచ్చేసి విజయవంతం చేసిన కవులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు నిర్వాహకులు తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరిక్రిష్ణ పేర్కొన్నారు. ఎల్కేపిలో మంగళవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. కవిసమ్మేళనం ఊహించిన దానికన్నా విజయవంతమైందని, వివిధ రాష్ట్రాల నుండి కవులు రావడం, జిల్లా కవుల సహకారం, ప్రజల ఆదరణ మరువలేనివన్నారు. ఈసమావేశంలో వేదిక జిల్లా అధ్యక్షులు బాలికొండ ఆంజనేయులు, కవులు, రచయితలు ఏలూరి ఎంగన్న, డా.శాంతినారాయణ, రాధేయ, మల్లెల నరసింహమూర్తి, రాజారాం, జూపల్లి ప్రేమ్‌చంద్, షేక్ రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి ధనలక్ష్మి డిపాజిట్ పథకం
అనంతపురం సిటీ, అక్టోబర్ 17: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు డిపాజిట్ చేసుకునే వారికి ప్రగతి ధనలక్ష్మి పేరుతో నూతన డిపాజిట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ ఎం.నంద్, రీజనల్ మేనేజర్ ఎల్.జయసింహారెడ్డిలు తెలియజేసారు. మంగళవారం నగరంలోని ఎపిజిబి ప్రధాన శాఖలో ప్రగతి ధనలక్ష్మి బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రగతి ధనలక్ష్మి డిపాజిట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నేడు ప్రారంభిస్తున్నామని, అందులో కాలపరిమితి 500 రోజులుగా నిర్ణయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీనియర్ మేనేజర్లు కామేశ్వరరావు, శంకరనారాయణ, శ్రీరామ్, అధికారులు పాల్గొన్నారు.
మిస్ మ్యాచ్ కేసులను పరిష్కరించండి
అనంతపురం సిటీ, అక్టోబర్ 17: జిల్లాలో ఇన్‌పుట్ సబ్సిడీకి సంబందించిన మిస్ మ్యాచ్ కేసులను వెంటనే పరిష్కరించి, రైతుల ఖాతాలకు జమ చేయాలని జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాల్‌లో వ్యవసాయ శాఖ, ట్రెజరీ అధికారులతో జెసి-2 సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి-2 మాట్లాడుతూ జిల్లాలో 958 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తంలో దాదాపు 25 వేల మందికి చెందిన సుమారు 67 కోట్ల మిస్‌మ్యాచ్ అయిందన్నారు. వీటిని పరిష్కరించేందుకు వ్యవసాయ శాఖ, ట్రెజరీ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు.

సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించండి
* డిఎస్పీల పిలుపు
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 17: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ మెరుగుదల, సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని డిఎస్పీ, ట్రాఫిక్ డిఎస్పీలు జె.వెంకటరావు, యు.నరసింగప్ప పిలుపునిచ్చారు. మంగళవారం ఎల్కెపిలో రాజు రోడ్డు, సుభాష్ రోడ్డు దుకాణదారులు, వ్యాపారస్తులు, ఆటో యూనియన్ల నాయకులతో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని సుభాష్ రోడ్డు, రాజు రోడ్డులో వివిధ వ్యాపార సముదాయాలు, దుకాణాలు అధికంగా ఉన్నాయన్నారు. వీటన్నింటిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరరహిత అనంతకు సిసి కెమెరాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ట్రాఫిక్ మెరుగుదలకు జిల్లి యంత్రాంగం వివిధ చర్యలు చేపట్టిందన్నారు. సుభాష్ రోడ్డు, రాజు రోడ్డులను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకుని వాహనాలు సాఫీగా వెళ్లేలా కృషి చేస్తున్నామన్నారు. దుకాణదారులు తమ వాహనాలను రోడ్డుకు అడ్డంగా కాకుండా సెల్లార్‌లో పెట్టుకోవాలన్నారు. ఆటోలు రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆపరాదన్నారు. విశ్రాంత అదనపు ఎస్పీ బాలనరసింహారెడ్డి, ట్రాఫిక్ ఎస్సైలు నాగేంద్ర, సతీష్‌కుమార్, దుకాణదారులు, ఆటో యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.
పతి ఇంటికి నెంబర్లు ఉండేలా చూడాలి
అనంతపురం సిటీ, అక్టోబర్ 17: జిల్లాలోని ఇంటి నెంబర్లు ప్రతి ఇంటికి వుండేలా చూడాలని ఇన్‌చార్జి కలెక్టర్ టికె.రమామణి అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఉప తహశీల్దార్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమామణి మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇంటిన్సివ్ రివిజన్ ఆఫ్ ఫొటో ఎలక్టోరల్ రోల్స్ 2018ని నేటి నుండి నిర్వహించాలని సూచించారు. ముందుగా అన్ని రాజకీయ పార్టీలతో కమిషనర్లు సమావేశం నిర్వహించి, సూచనలు, సలహాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ మల్లీశ్వరీదేవి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌ఎంఎస్‌ఎ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు నమోదు చేసుకోండి
అనంతపురం సిటీ, అక్టోబర్ 17: జిల్లాలో ఆర్‌ఎంఎస్‌ఎ విద్యా వైజ్ఞానిక 2017 ప్రదర్శనకు విద్యార్థుల పేర్లును నమోదు చేసుకోవాలని డిఇఓ పి.లక్ష్మినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కేవలం 40 ఎగ్జిబిట్స్ మాత్రమే అనుమతి ఉంటుందని, ఇందులో విజ్ఞాన శాస్త్రం, సమాజం, పర్యావరణ అనే అంశాలపై ఎగ్జిబిట్స్‌ను నిర్వహించాలని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఎంపిక చేసుకున్న అంశంపై వివరణాత్మక నివేదికను తీసుకొని ఈ నెల 20వ తేదీన నగరంలోని సైన్సు సెంటర్ నందు హాజరుకావాలని తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు
* ఎస్పీ జివిజి. అశోక్‌కుమార్
అనంతపురం కల్చరల్, అక్టోబర్ 17: పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించినా, వాటి జోలికెళ్లినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జివిజి.అశోక్‌కుమార్ పేర్కొన్నారు. అసాంఘిక, అరాచక శక్తుల ఆగడాలు జిల్లాలో ఎక్కడా జరుగకూడదని హెచ్చరికలు జారీ చేస్తూ ఎస్పీ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మట్కాపై ఉక్కుపాదం మోపామన్నారు. అమాయక ప్రజల జీవితాల ఛిన్నాభిన్నంకు కారణమైన 8 మంది మట్కా నిర్వాహకులకు జిల్లా బహిష్కరణ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ జారీ చేశారన్నారు. రూపాయికి 80 లేదా 90 రూపాయలు ఇస్తామని ఆశ చూపి, మట్కా ఊబిలోకి దింపి ప్రజల జీవితాలను బజారు పాల్జేసినందునే వీరిపై జిల్లా బహిష్కరణ చర్యలకు ప్రతిపాదనలు పంపామన్నారు. వీటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. అరాచక శక్తుల ఆగడాలపై డయల్ 100, వాట్సాప్ నెంబర్ 9989819191కు సమాచారం అందించాలన్నారు.
డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
అనంతపురం సిటీ, అక్టోబర్ 17: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డివైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం డిఇఓ కార్యాలయంలో అర్ధ గుండును గీయించుకుని డివైఎఫ్‌ఐ నాయకులు నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కసాపురం ఆంజినేయులు, విద్యార్థి నాయకులు సూర్యచంద్ర, రమేష్, నారాయణస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ప్రభుత్వం వైఫల్యం
అనంతపురం సిటీ, అక్టోబర్ 17: విష జ్వరాల బారి నుండి ప్రజలను కాపాడటంలో, ఆసుపత్రి ఖాళీల భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి పేర్కొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో సర్వజన ఆసుపత్రి ముందు చేపట్టిన నిరవధిక దీక్షలు మంగళవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆసుప్రతి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు దీక్షలకు మద్దతుగా ఆసుపత్రి నుండి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రామస్వామి నాయక్, మానవత రక్తదాతల సంస్థ తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి, సలీమ్ మాలీక్, జాకీర్ హుస్సెన్, సిపిఐ నగర కార్యదర్శి లింగమయ్య, శ్రీరాములు, అల్లీపీరా, ఇతర నాయకులు పాల్గొన్నారు.

రక్తదానం చాలా గొప్పది

అనంతపురం అర్బన్, అక్టోబర్ 17: అన్ని దానాలకంటే రక్తదానం చాలా గొప్పదని అనంతపురం రేంజ్ డిఐజి ప్రభాకర్‌రావు అభిప్రాయపడ్డారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని రామాలయ కల్యాణమండపం, షాదీఖానాలలో రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. యువతకు, విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ డిఐజి ప్రభాకర్‌రావు, ఎస్పీ అశోక్‌కుమార్ మొదటిగా రక్తదానం చేసారు. వీరితోపాటు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న పోలీసు సిబ్బంది, ఏఆర్, స్పెషల్ పార్టీ, హోంగార్డులు, పిటిసి, డిటిసీలలో శిక్షణ పొందుతున్న ట్రైనీలు, సిఆర్‌ఐటి, విద్యాసంస్థల విద్యార్థినీ విద్యార్థులు, సంజీవరెడ్డి ఆర్మీ స్కూలు, రత్న ఆర్మీ డిఫెన్స్ అకాడమీ యువత భారీగా తరిలివచ్చి 500 మంది రక్తదానం చేయటం పట్ల డిఐజి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం డిఐజి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ 1959 సంవత్సరంలో చైనాతో సరిహద్దులో జరిగిన యుద్ధంలో 10 మంది సైనికులు వీరమరణం పొందటం జరిగిందన్నారు. అప్పటి నుంచి వారోత్సవాలు నిర్వహించటం జరుగుతోందన్నారు రక్తం దొరక్క చాలామంది నిత్యం ప్రాణాలు కోల్పోవటం జరుగుతోందన్నారు. రక్తదానం వల్ల కొంతమంది ప్రాణాలైన కాపాడే అవకాశం లభించటం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిటిసి ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, అదనపు ఎస్పీ మాల్యాద్రి, డిఎస్పీలు వెంకటరావు, చిన్నికృష్ణ, శ్రీనివాసరెడ్డి, సిఆర్‌ఐటి విద్యాసంస్థల అధినేత చిరంజీవిరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసాద్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు త్రిలోక్‌నాథ్, రెడ్‌క్రాస్, ఆర్డీటీ సంస్థలు పాల్గొన్నాయి.
పదోన్నతులు కల్పించడంలో ఆలస్యం చేస్తే చర్యలు
అనంతపురం సిటీ, అక్టోబర్ 17: జిల్లా వ్యాప్తంగా అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేందుకు ఆలస్యం చేస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని ఆర్‌జెడి ప్రతాప్‌రెడ్డి విద్యా శాఖ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం స్థానిక డిఇఓ కార్యాలయంలో ఎడి, ఎడి-2, సూపరింటెండెంట్లు, సిబ్బందితో పదోన్నతులు, బయోమెట్రిక్, సైకిళ్ల పంపిణీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇతర జిల్లాల్లో పూర్తి చేశారని, కానీ అనంతపురం జిల్లాలో ఒక్కటి చేయకపోవడం చాలా దారుణమన్నారు. దీనిపై కాలయాపన చేయకుండా తక్షణమే మూడు రోజుల్లోపు పదోన్నతులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా బయోమెట్రిక్‌ను బాగా పనిచేసేలా మానటరింగ్ కమిటీలతో పర్యవేక్షింప జేయాలన్నారు. అలా చేయలేకపోతే ఉన్న కమిటీని రద్దు చేసి నూతన కమిటీని వేయాలని ఆదేశించారు. మూడు రోజుల్లోపు బయోమెట్రిక్ హాజరు శాతం పెంచాలని సూచించారు. పాఠశాలలకు ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎంలకు, తక్కువ శాతం చేసిన 8 మండలాల ఎంఇఓలకు మెమోలు జారీ చేయాలని, అన్ని పూర్తి చేసిన ఎంఇఓలను అభినందించాలని ఏడిలను ఆదేశించారు. అలాగే అన్ని పాఠశాలలకు సైకిళ్లు పంపిణీ పూర్తి చేసినట్లు ఆన్‌లైన్‌లో నింపాలని ఎఎస్‌ఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడిలు, ఏసి గోవిందనాయక్, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.