అనంతపురం

నీటి కుంటలో పడి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శెట్టూరు, అక్టోబర్ 20 : మండల పరిధిలోని పెరుగుపాళ్యం గ్రామంలో ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రానికి చెందిన ఐదుగురు విద్యార్థులు సరదాగా నీటి పరిసర ప్రాంతాలకు ఈతకు వెళ్లారు. వీరిలో బెంగుళూరు, ములకలేడు పాఠశాలల్లో 9, 10వ తరగతి చదుతువున్న గ్రామానికి చెందిన నవీన్ (14), సురేష్ (10) దీపావళి పండగకు ఇంటికి వచ్చారు. ఈనేపథ్యంలో గ్రామం సమీపంలోని నీళ్లు తక్కువగా ఉన్నాయని నవీన్ నీటిలోకి దూకాడు. అయితే ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా గమణించిన సురేష్ కాపాడబోయి అతడూ నీటిలో మునిగిపోయాడు. వెంటనే మిగిలిన ముగ్గురు విద్యార్థులు గ్రామానికి చేరుకుని సమాచారం ఇచ్చారు. హుటాహుటిని గ్రామస్థులు చెక్‌డ్యాంకు చేరుకుని పరిశీలించగా అప్పటికే ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు గమణించారు. పండుగ రోజు విద్యార్థులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న డిఎస్పీ వెంకటరమణ, సిఐ శివప్రసాద్, ఎస్‌ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈరన్నకు ఒక్కగానొక్క కుమారుడు నవీన్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధురాలి మృతి
గుంతకల్లురూరల్, అక్టోబర్ 20 : స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఫాతిమా (65) అక్కడిక్కడే మృతి చెందింది. తిలక్‌నగర్‌కు చెందిన ఫాతిమా మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు.
రైల్వే అండర్ బ్రిడ్జి నీటిలో పడి విద్యార్థి మృతి
హిందూపురం, అక్టోబర్ 20 : పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి నీటిలో పడి విద్యార్థి శుక్రవారం మృతి చెందాడు. మున్సిపల్ పరిధిలోని మోడల్‌కాలనీకి చెందిన నరసప్ప కుమారుడు వెంకటేష్(11) ఈతకెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానిక నేతాజీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న వెంకటేష్ మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా స్థానిక గుడ్డం, ఆర్టీఏ, వీవర్స్ కాలనీ సమీపాల్లో ఉన్న మినీ రైల్వే అండర్ బ్రిడ్జిల్లో ఇప్పటికీ నీరు అలాగే నిలువ ఉండటంతో అటు వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండగా ఇటు సరదా కోసం ఈతకు వెళ్లే యువకులను ఆందోళనకు గురి చేస్తోంది. బ్రిడ్జిల వద్ద నీరు నిలువ ఉన్నట్లు ఎలాంటి సూచనలు చేయకపోగా కనీసం పెద్దగా నీరు నిలువ ఉన్న అండర్ బ్రిడ్జిల్లో ఎప్పటికప్పుడు నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శంగా నిలుస్తోంది. ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఉన్న అండర్ బ్రిడ్జిలో గత ఐదు రోజులుగా యువకులు ఈతకు వెళ్తున్నట్లు అధికారుల దృష్టికి వెళ్లినా కనీసం పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివాహిత అనుమానాస్పద మృతి
గుంతకల్లురూరల్, అక్టోబర్ 20 : మండలంలోని గుండాలలో చిట్టెమ్మ (35) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్థుల కథనం మేరకు గ్రామానికి చెందిన దంపతులు రాజు, చిట్టెమ్మ గురువారం రాత్రి గొడవపడ్డారు. ఈ ఘటనలో రాజు చిట్టెమ్మను కొట్టడంతో మృతి చెందినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. అయితే చిట్టెమ్మ ఎలా మృతి చెందిందనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
విద్యుదాఘాతంతో బేల్దారి మృతి
కంబదూరు, అక్టోబర్ 20 : మండల కేంద్రంలోని వడ్డే వీధిలో విద్యుదాఘాతంతో బేల్దారి చంద్ర (30) మృతి చెందాడు. ఇంటి పైకప్పుపైన బేల్దారి పని చేస్తుండగా కరెంటు తీగలు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. హుటాహటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.