అనంతపురం

ఆంధ్రా సరిహద్దుకు చేరిన హెచ్చెల్సీ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మనహాల్, అక్టోబర్ 20 : ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి ప్రకారం బుధవారం ఉదయం 10 గంటలకు తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి విడుదల చేసిన నీరు శుక్రవారం ఆంధ్రాలో వెయ్యి క్యూసెక్కులు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి 7,738 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 6,514 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉన్నట్లు తెలిపారు. హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సికి, పవర్‌ప్లాంట్‌కు, కర్నాటక కెనాల్‌కు వదిలినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం జలాశయంలో 90.543 టిఎంసీల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు.
చిలమత్తూరులో ఆంత్రాక్స్ కలకలం!
చిలమత్తూరు, అక్టోబర్ 20 : మండల పరిధిలోని వడ్డిచెన్నంపల్లి, కొడికొండ గ్రామాల్లో ఇద్దరికి శరీరంపై బొబ్బలు రావడంతో కలకలం రేగింది. వడ్డిచెన్నంపల్లికి చెందిన చౌడప్ప, కొడికొండకు చెందిన హర్షవర్ధన్‌కు ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో హుటాహుటిన చిలమత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వ్యాధి నిర్ధారణ కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఆంత్రాక్స్ వ్యాధి కాదని నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు. కేవలం శరీరంపై బొబ్బలు రావడంతో ఆంత్రాక్స్‌గా వదంతులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఘనంగా హనుమాన్ మాలధారణ
గుంతకల్లు, అక్టోబర్ 20 : నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు శుక్రవారం మాలధారణ చేసి హనుమాన్ దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం స్వామివారికి ప్ర త్యేక పూజలు చేసి వేదపండితుల ఆధ్వర్యం లో దీక్షను స్వీకరించారు. వీరందరూ మం డలం రోజుల పాటు నియమనిష్టలు, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దీక్షనుబూని హనుమాన్ వ్రతాన్ని ఆచరిస్తారు. శుక్రవారం పూర్తిస్థాయిలో మండల దీక్ష కార్యక్రమం ప్రారంభమైంది. అదేవిధంగా నవంబర్ 10న అర్ధమండల దీక్ష ప్రారంభమవుతుంది. నవంబర్ 30వ తేదీ ఇరుముడి సమర్పణ, డిసెంబర్ 1న హనుమాన్ వ్రతం నిర్వహిస్తారు.