అనంతపురం

టిడిపితోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, అక్టోబర్ 20: మండల పరిధిలోని గొరిదిండ్ల గ్రామంలో దీపావళి రోజు మంత్రి పరిటాల సునీత ఇంటింటింకి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి రు.25 లక్షలతో నిర్మించిన సిసిరోడ్లను ప్రారంభించారు. మరో రు.60 లక్షలతో నిర్మించనున్న సిసిరోడ్లకు భూమిపూజ చేశారు. రు.10 లక్షలతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఆతర్వాత ఇంటింట తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని, పేదల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత టిడిపికే దక్కుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికి ఒక సైనికుడిలా పనిచేస్తున్నారని కార్యకర్త అదే స్ఫూర్తితో అంకితబావంతో పనిచేసి పార్టీ ప్రతిష్ట ఇనుమడింపజేయాలని మంత్రి కార్యకర్తలను కోరారు. ఆత్మకూరు చెరువు నిర్మాణం చేయించమని ప్రజల నుంచి వత్తిడి వస్తోందని అందుకు సంబందించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. డికె తాండాకు తారురోడ్డు మంజూరైందని ఆ రోడ్డు వేయించాకే ఆ గ్రామానికి వస్తానన్నారు. ఆత్మకూరు పేరూరు రోడ్డుకు రు.8కోట్ల 50 లక్షలతో ప్రతిపాదన వెళ్ళిందని త్వరలోనే రోడ్డు నిర్మాణం పనులు చేయిస్తామన్నారు. గొరిదిండ్ల గ్రామాభివృద్ధికి ఇప్పటికే రు.కోటి ఖర్చు చేశామన్నారు. రాప్తాడు నియోజక వర్గంలో ఇంటింటికి తెలుగేశం కార్యక్రమంలో వచ్చిన సమస్యలు రికార్డు చేయడానికి 20 మంది కార్యకర్తలు ట్యాబ్‌లతో వచ్చి సమస్యలు రికార్డు చేస్తున్నారని, మీకేమైనా సమస్యలంటే వాటిని రికార్డు చేయిస్లే ముఖమంత్రి వాటికి పరిష్కారం చూపుతారన్నారు. మొదటి విడత రుణమాఫీలో లక్షాయాభై వేలమందికి ఏకకాలంలో రు.100కోట్లతో మాఫీ జరిగింది. మన నియోజకవర్గానికి ఇంకా రు.126 కోట్లు రుణ మాఫీకి అందాల్సి ఉంటుందన్నారు. ఆత్మకూరు మండలానికి మొదటి విడతలో రు.19 కోట్లు, రెండవ విడతలో రు.9కోట్లు, మూడవ విడతలో రు.12 కోట్లు రుణమాఫీకి వచ్చిందని, మూడు విడతల్లో రు.40 కోట్లు మాఫీ అయ్యిందన్నారు. పంటల బీమా కోసం నియోజకవర్గానికి రు.42 కోట్లు విడుదలైందన్నారు. దీంతో బాటు పరిటాల మొమోరియల్ ట్రస్టుద్వారా అనేక రకాల సేవాకార్యక్రమాలు అందుబాటోలోకి తెచ్చామన్నారు. రాబోయే ఎన్నికలలో మరోమారు టిడిపికే ఓటు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటిసి రామమూర్తినాయుడు, జడ్పీటిసి కుళ్ళాయప్ప, ఎంపిపి మారెక్క తదితరులు పాల్గొని ప్రసంగించారు. మండల స్థాయి అధికారులు ఈకార్యక్రమానికి హాజరయారు. ఇదేవేదికపై ప్రజలలో హెల్మెట్ వాడకంపై సిఐ శివనారాయణస్వామి మంత్రితో మాట్లాడి మంత్రి నోట హెల్మెట్ వాడేవిధంగా ప్రజలకు సందేశం ఇప్పించారు. చివరగా మంత్రి లబ్ధిదారులకు వ్యవసాయశాఖ ఆధ్వర్యలో మంజూరైన రెండు ట్రాక్టర్లు రైతులకు పంపిణీ చేశారు.