అనంతపురం

ఇక కాసుల గలగలలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 23 : జిల్లాలోని చిన్న నీటి పారుదల శాఖ పరిధిలోని చెరువులు, భారీ, మధ్య, చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుల్లో మరమ్మతుల కోసం కాసుల దందాకు తెర లేచింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏళ్లుగా నిండని చెరువులు కూడా పూర్తి స్థాయి మొదలు పాక్షికంగా నీటితో నిండాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అనేకు చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు మరమ్మతులకు గురయ్యాయి. వర్షాలకు తెగిపోవడం, గండ్లు పడటం, పగుళ్లు రావడం, లీకేజీలు ఏర్పడటం వంటివి చోటుచేసుకున్నాయి. వీటి మరమ్మతుల నిమిత్తం మైనర్ ఇరిగేషన్ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. వర్షాల సమయంలోనే తాత్కాలికంగా చేపట్టిన పనులతో పాటు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు రూ.19.46 కోట్లతో మైనర్ ఇరిగేషన్ శాఖ అంచనాలు రూపొందించింది. ఇందులో మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లో మొత్తం 39 మరమ్మతులు గుర్తించారు. వీటికి చేపట్టిన తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం రూ.170.17 కోట్లు, శాశ్వతంగా పను లు చేపట్టేందుకు రూ.1384.32 కోట్లు మేర మొత్తం రూ.1555.17 (సుమారు (15.55 కోట్లు) నిధులు అవసరమని అంచనా వేయడం జరిగింది. అలాగే అనంతపురం, ధర్మవరం, పెనుకొండ డివిజన్ల పరిధిలోని చెరువుల మరమ్మతులకు రూ.390.62 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ పనుల్లో తాత్కాలికంగా చేపట్టిన వాటిలో అంచనాకు మించి నిధులకు ప్రతిపాదనలు వచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇక శాశ్వత ప్రాతిపదికన చేపట్టనున్న మరమ్మతుల పనులు దక్కించుకునేందుకు స్థానికంగా ఉన్న అధికార టిడి పి నేతలు, కాంట్రాక్టర్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యేలు, ఎం పిల సహకారంతో పొందేందుకు వారిని ప్రసన్నం చేసుకునే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తం గా మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు సంబంధించి 39 పనులు, చెరువుల మరమ్మతులకు 34 పనులు మొత్తం 73 పనులను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఒక్క పెనుకొండ డివిజన్‌లోనే అత్యధికంగా చెరువులు మరమ్మతులకు గురికాగా, అందులో మొత్తం 22 పనులు చేయా ల్సి ఉందని గుర్తించి నిధుల కోసం అంచనాలు రూపొందించారు. మీడి యం ప్రాజెక్టులో మరమ్మతులకు 3 పనులకు మొత్తం రూ.908 లక్షలు నిధులు అవసరమని అంచనా వేయగా, అందులో తాత్కాలిక పనుల చెల్లింపునకు రూ.98 లక్షలు, శాశ్వత పనులకు రూ.810 లక్షల నిధులు అవసరమని అంచనా వేశారు. అలాగే మైనర్ సాగునీటి ప్రాజెక్టుల్లో మొత్తం 36 మరమ్మతుల పనులు గుర్తించారు. వీటిలో ఇప్పటికే చేసిన తాత్కాలిక పనులకు రూ.170.83 లక్షలు, శాశ్వత పనులకు రూ.1384.32 లక్షలు చొప్పున రూ.1555.17 లక్షలు నిధుల అవసరమవుతున్నాయి. అనంతపురం డివిజన్‌లో వెంకటాంపల్లి చెరువు, జక్కల చెరువులో పైపింగ్, భూమిరెడ్డి కుంట, చెట్టికుంట, దాసప్పకుంట, నాగసముద్రం చెరువులు కట్టలు తెగాయి. వీటిలో తాత్కాలికంగా చేపట్టిన పనులకు రూ.22.20 లక్షలు చెల్లించాల్సి ఉంది. అలాగే శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రూ.117.40 లక్షల నిధులు అవసరమని అంచనా వేశారు. ధర్మవరం డివిజన్‌లో మొత్తం 6 పనులకు గానూ తాత్కాలికంగా చేపట్టిన పనులకు రూ.3.50 లక్షలు, శాశ్వతంగా చేపట్టేందుకు రూ.28.50 లక్షలు అవసరమన్నారు. ఈ మేరకు ఎపిఎఫ్‌సి నుంచి అంచనాలు అందాయి. పెనుకొండ డివిజన్‌లో తాత్కాలికంగా చేపట్టిన పనులకు రూ.30.43 లక్షలు, శాశ్వతంగా పనులు చేసేందుకు రూ.234.92 లక్షల నిధులు అవసరమని అంచనా వేశారు. లీకేజీలను అరికట్టేందుకు ఇసుక మూటలతో ఏర్పాటు చేసిన రింగ్‌బండ్స్, బంకమట్టి, మట్టితో చేసిన పనులు, పురోగతిలో ఉన్న పనులు ఉన్నట్లు అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అలాగే హిందూపురం సమీపంలోని పెన్నార్ కుముద్వతి ప్రాజెక్టులో కుడి, ఎడమ వైపున్న గేట్లలో లీకేజీలున్నాయి. వీటిని తాత్కాలికంగా అరికట్టారు. ఇందుకోసం రూ.2 లక్షలు, శాశ్వత ప్రతిపదికన పనులు చేసేందుకు రూ.10 లక్షలు అవసరమని అంచనాలు తయారు చేశారు. అధికారిక గణాంకాల మేరకు జిల్లాలోని 1263 చెరువుల్లో.. 100 ఎకరాల పైబడి ఆయకట్టు ఉన్నవి అనంతపురం డివిజన్‌లో 17చ ధర్మవరంలో 12, పెనుకొండలో 37 చొప్పున 66 చెరువులు, వంద ఎకరాల లోపున్న చెరువులు అనంతపురంలో 13, ధర్మవరంలో 14, పెనుకొండ డివిజన్‌లో 74 మేరకు 201 మొత్తం 267 చెరువులు పూర్తిగా నిండాయి. అలాగే 75 శాతం ఈ మూడు డివిజన్లలోనూ 244, సగం వరకు 161 చెరువులు నిండాయి. కేవలం 25 శాతం నిండిన చెరువులు 203, స్వల్పంగా నిండినవి 109 ఉండగా, 279 చెరువులు అసలు నిండకపోవడం విశేషం. చెరువులు నిండిన ప్రాంతాల్లో రైతులు ఆయకట్టు సాగుకు సిద్ధమవుతున్నారు. రబీ పంటలు వేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మంత్రి ఇంటింటి ప్రచారం
ఆత్మకూరు, అక్టోబర్ 23: ఆత్మకూ రు మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సోమవారం ఇంటిం టి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పి.యాలేరు రోడ్డు సర్కిల్‌లో పార్టీ పతాకం ఆవిష్కరించి అనంతరం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాలు మీ దరికి చేరుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆ త్మకూరు గ్రామంలో పరిశుభ్రత సరి గా లేదని కేవలం మేము వచ్చినప్పు డు సంచుల కొద్ది బ్లీచింగ్ చల్లినంత మాత్రాన పరిశుభ్రత ఏర్పడదని అధికారులు చిత్తశుద్ధితో స్వచ్ఛ కార్యక్రమానికి చేయూతనందించాలన్నారు. రూ.32 లక్షలతో ఈనాడు స్ర్తి శక్తి భవనం ప్రారంభించుకున్నామని తెలిపారు. దీనికొక ప్రహరీ నిర్మించుకోవాలన్నారు. స్ర్తిలు ఇదొక దేవాలయంగా భావించుకోవాలన్నారు. అలాగే రూ. 24.60 లక్షలతో నిర్మించిన వ్యవసాయ శాఖ గోడౌన్‌ను మంత్రి ప్రారంభించారు. రూ.27 లక్షల రాయితీతో 18 మంది రైతులకు ట్రాక్టర్లను అందచేశారు. ఆత్మకూరులో తహశీల్దార్ కా ర్యాలయం పాతబడిపోయినందున ఆ భవన నిర్మాణానికి ఇప్పటికే రూ.90 లక్షలు మంజూరయ్యాయన్నారు. రా ప్తాడు నియోజక వర్గంలోని అన్ని ర కాల ప్రభుత్వ కార్యాలయాలకు తన హయాంలో కొత్త భవంతులు నిర్మిం ప జేశామన్నారు. ప్రతి మహిళ నెలకు కనీసం రూ.10వేలు సంపాదించుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు రుణమాఫీ చేశామని, డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు మాఫీ చేశామన్నారు. ఇందుకో సం ముఖ్యమంత్రి రూ. 10వేల కోట్లు కేటాయించారన్నారు. చంద్రన్న పసు పు కుంకుమ కానుక కింద ఒక్కొక్కరికి 6 వేలు అందచేశామని, మరో రెం డు నెలల్లో మిగిలిన 4 వేలు అందచేస్తామన్నారు. ప్రభుత్వం లోటుబడ్జెట్‌లో ఉన్నా రూ. 5070 కోట్లు రుణమాఫీకి విడుదల చేసిందన్నారు. 70 లక్షల మంది మహిళలకు, 20 లక్షల మంది మొప్మా కార్యకర్తలకు ఆర్థిక పరిస్థితి మెరుగుకోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. చంద్రన్న బీమా కింద ఆకస్మిక మరణాలకు రూ.5 లక్షలు, సాధారణ మరణాలకు రూ. 30 వేల నుంచి రూ.2 లక్షలు ప్రభుత్వం అందచేస్తోందన్నారు. రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్ల కోసం రూ.6 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. బ్యాంక్ లింకేజి కింద రూ. 33 వేల కోట్లు సహాయం అందిస్తోందన్నారు. ఆత్మకూరులో ఇప్పటి వరకు రూ.60 లక్షలతో సిసి రోడ్లు నిర్మింపజేశామని, మరో 54 లక్షలతో కొత్తగా సిసి రోడ్లు నిర్మిస్తామని పేర్కొన్నారు. కోటి 25 లక్షలతో సివిల్ సప్లయి గోడౌన్ కట్టించామన్నారు. మండల పరిధిలోని 18 మంది రైతులకు రూ.27 లక్షల సబ్సిడీతో 18 ట్రాక్టర్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ రోజుల్లో ప్రతి ఇంటికీ కనీసం 3 సెల్‌ఫోన్లున్నాయని, అలాగే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించుకుని తీరాలని ఈ విషయంలో గ్రామీణ ప్రజలకు మంచి అవగాహన కల్పించాలని మహిళా సంఘాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిడి రామారావు, సర్వశిక్ష అభియాన్ పిడి సుబ్రహ్మణ్యం, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రామసుబ్బమ్మ, గృహ నిర్మాణ సంస్థ డిఈ మహబూబ్ బాషా, స్థానిక అధికారులు, ఎంపిపి మారెక్క, సర్పంచ్‌లు ఎంపిటిసిలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధి అంటే మోదీ
* మంత్రి మాణిక్యాలరావు

అనంతపురం సిటీ, అక్టోబర్ 23: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా నరేంద్రమోదీ పాలన సాగుతోందని రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. సోమవారం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు హరీష్‌రెడ్డి అధ్యక్షతన నవ భారత యువ చైతన్య మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మాణిక్యాలరావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎంఎస్.పార్థసారథిలు హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ దేశం లో నరేంద్రమోదీ పాలన అవినీతి రహితంగా జరుగుతోందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా స్కాంలతో, అవినీతి భారీగా జరిగాయని గుర్తుచేశారు. దేశంలోని 35 వేల గ్రామాలకు విద్యుత్ పూర్తిగా లేకుంటే, వాటికి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి గ్రామాలకు వెలుగునింపారన్నారు. దీన్ దయాల్ పథకం కింద ప్రతి ఒక్కరికి గ్యాస్‌ను అందజేసారని తెలిపారు. మోదీ పిలుపు మేరకు గ్యాస్ సబ్సిడీని 5 కోట్ల మంది వదులుకున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని గ్రామాల్లోను స్వచ్ఛతను పాటిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోకెల్లా మన దేశాన్ని టెక్నాలజీలో అగ్రస్థానం నిలిపేందుకు నరేం ద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలియజేసారు. దేశంలో ని ప్రతి ఒక్కరు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపా రు. మోదీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దుతో, జీఎస్టీతో అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు ద్వారా సమగ్రమైన ఆర్థిక అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రాచబాటలు వేసిందన్నారు. స్కిల్ ఇండియా ద్వారా కోట్లమంది యువతకు కొత్త ఉపాధి మార్గానికి మోదీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. దేశంలో రాజకీయాలు కాకుండా దేశ భద్రత, అభివృద్ధితో మూడు సంవత్సరాల సుస్థిర పాలనలో అవినీతి లేని పాలనను దేశ ప్రజలకు బిజెపి అందిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వేల కో ట్ల రూపాయల నిధులను కేంద్రం అం దిస్తోందన్నారు. రాజధాని నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసామని తెలిపారు. రాష్ట్రానికి నిష్పక్షపాతంగా మోదీ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్భ్రావృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సందిరెడ్డి శ్రీనివాసులు, లలిత్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, బిజెవైఎం నాయకులు తిరుమలేసు, అశోక్‌రెడ్డి, ఇతర రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.