అనంతపురం

పురంలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 23: ము న్సిపాలిటీకి లక్షలాది రూపాయల ప న్నులు చెల్లిస్తున్న ముద్దిరెడ్డిపల్లికి మాత్రం అభివృద్ధి విషయాల్లో అధికా ర పార్టీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సోమవారం ఆ గ్రామ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన ప్రజ లు స్థానిక మేళాపురం సర్కిల్‌లో ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా వైకాపా కౌన్సిలర్ నాగభూషణ్‌రెడ్డి ఆ పార్టీ నాయకులు రమేష్, నరసారెడ్డి తదితరులు బైఠాయించారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ ఎస్సై దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చే రుకుని మంతనాలు సాగించారు. దాదాపు అరగంటకు పైగా బైఠాయిం పు జరగ్గా ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. ముద్దిరెడ్డిపల్లి నుండి మున్సిపాలిటీకి ప్రతినెలా లక్షలాది రూపాయాల్లో ఆదాయం లభిస్తుండగా అభివృద్ధికి మాత్రం మున్సిపల్ ఛైర్‌పర్సన్, అధికారులు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించడం లేదంటూ పోలీసులతో నాగభూషణ్‌రెడ్డి తదితరులు వాగ్వివాదానికి దిగారు. అదే సమయంలో ఇం టింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి భర్త నాగరాజు, కౌన్సిలర్ నంజప్ప తదితర టిడిపి నేతలు ఆ ప్రాంతానికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ సమయంలో చాకచక్యంగా, సమయస్ఫూరిగా వ్యవహరించిన పోలీసులు ఆందోళనకారులను అటుగా అనుమతించడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఉంటే ఇరు వర్గాలు ఎదురయ్యే అవకాశమే ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు టిడిపి నేతలు ఇంటింటి ప్రచారానికి వెళ్తుండగా మరో వైపు వైకాపా మద్దతుతో అటుగా వస్తున్న ఆందోళనకారులు ఎమ్మెల్యే, ఛైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా, ముద్దిరెడ్డిపల్లికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన టిడిపి నేతలు అటుగా వెళుతున్న ఆందోళనకారుల ర్యాలీ వైపు దూసుకెళ్లారు. పోలీసులు వారించినా పట్టించుకోకుండా కౌన్సిలర్ నాగభూషణ్‌రెడ్డి, నారాయణలపై దాడి చేశారు. దీంతో ప్రధాన రహదారిపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కౌన్సిలర్ నాగభూషణ్‌రెడ్డిపై టిడిపి నేతలు దాడికి పాల్పడగా భయంతో పరుగులు తీశారు. పోలీసుల ఉదాసీనత కారణంగానే ఇరు వర్గాలుతారసపడటం, రెచ్చిపోవడం జరిగిందని స్థానికులు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అటు టిడిపి నేతలను గాని ఇటు ఆందోళనకారులను సముదాయించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదని కొందరు పేర్కొంటున్నారు. అనంతరం టిడిపి నేతలు వైకాపా కౌన్సిలర్ నాగభూషణ్‌రెడ్డి తదితరులు రెచ్చగొట్టడమే కాకుండా దుర్భషలాడి తమపైకి వచ్చారంటూ వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా వైకాపా నియోజకవర్గ సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో సాయంత్రం సద్భావనా సర్కిల్ వద్ద వైకాపా నిరసన కార్యక్రమం చేపట్టింది. ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు వస్తున్న ప్రజలు, వైకాపా కౌన్సిలర్ పట్ల టిడిపి నేతలు రౌడీలుగా దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారంటూ రాస్తారోకో నిర్వహించారు. కనీసం హిందూపురంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాగభూషణ్‌రెడ్డి తదితరులపై దాడికి పాల్పడ్డ టిడిపి నేతలను వెంటనే అరెస్టు చేయాలని లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఇన్‌చార్జి సిఐ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. హిందూపురంలో చోటు చేసుకున్న వివిధ సంఘటనలు పోలీసుల ఉదాసీనత కారణంగానే ఉద్రిక్తతకు దారి తీశాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపించిన విషయం విదితమే. ఇటీవల రహమత్‌పురం, శ్రీకంఠపురం వర్గీయుల నడుమ చోటు చేసుకున్న పరిణామాల్లో అప్పట్లో పోలీసులు ఉదాసీనతే బహిర్గతమయింది. దీనికి తోడు వైకాపా నీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేయగా ముందస్తుగా దృష్టి పెట్టకుండా లాఠీచార్జి చేయడం అప్పట్లో దుమారం రేపింది. ముక్కడిపేటలో జరిగిన సంఘటన కూడా పోలీసుల వైఖరిపై తీవ్రస్థాయిలో ఓ వర్గం ఆరోపణలు చేసింది. తాజాగా ఇంటింటా టిడిపి జరుగుతున్న విషయం తెలిసినా వైకాపా మద్దతుతో జరిగిన నిరసన ర్యాలీని అదే సమయంలో అటుగా అనుమతించడం స్థానిక పోలీసుల నిర్లక్ష్యానికి మరో ఉదాహరణగా విమర్శలు ఉన్నాయి. ఆందోళన కార్యక్రమానికి అనుమతి లేకపోయినా సర్ది చెప్పడం, నిరసనకు తావు లేకుండా చేయడంలో విఫలం కాగా టిడిపి, వైకాపాల రచ్చకు పోలీసుల వైఖరే కారణమంటూ బహిరంగ విమర్శలు ఉన్నాయి.
ప్రకృతి వ్యవసాయం.. రైతుకు వరం
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, అక్టోబర్ 23: రైతు లు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేయడాన్ని మరింత అధికంగా చేపట్టాలని, తద్వారా విష రహి త వ్యవసాయోత్పత్తులు అందుబాటులోకి వచ్చి ప్రజారోగ్యం బాగు పడుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి టి.విజయకుమార్ అన్నా రు. సోమవారం అనంతపురంలోని ఆర్డీటీ ఎకాలజీ సెంటర్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని 18 కొత్త క్లస్టర్ల నుంచి విచ్చేసిన సిఆర్‌పిలు, సిఎలు, ఎంపిఇఒలు, ఎన్‌ఎఫ్‌ఎఫ్‌లతో ప్రకృతి వ్యవసాయంపై సమీక్ష సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జెడిఎ శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయ విభాగం డిపిఎం వి.లక్ష్మానాయక్, ఎడి (టెక్నికల్) మల్లారెడ్డి, కొత్త క్లస్టర్ల సిఆర్‌పిలు, సిఎలు, పాత క్లస్టర్ల సిఎలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సలహాదారు టి.విజయకుమార్ మాట్లాడుతూ రైతులు రసాయనిక విష పదార్థాలను అధిక మోతాదులో వాడుతున్నారని, కనుక క్లస్టర్ల పరిధిలోని అన్ని స్థాయిల సిబ్బంది వాటి దుష్ప్రభావాల గురించి రైతులకు వివరించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు సూచనలిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వ్యవసాయోత్పత్తుల్లో విష పదార్థాలు తగ్గించే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తుండ టం హర్షణీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ వ్యవసాయ విధానానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. విషరహిత వ్యవసాయోత్పత్తుల్ని పెం చి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సిబ్బందికి సూచించారు. తల్లి పాలు సైతం విష పూరితంగా తయారై, భావి తరాల వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదంతో పాటు ప్రస్తుతం ప్రజల ఆరోగ్యంపైనా దుష్ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచ భూతాలు సైతం విష తుల్యంగా మారి మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని, ఇలాంటి దుష్పరిణామాల నివారణకు ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని విజయకుమార్ వివరించారు. అ నంతపురం జిల్లాలో వర్షా ధార వేరుశనగ పంటల సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించిన రైతులకు 2-3 బస్తాల అధిక దిగుబడి వచ్చి, పంట బెట్టకు తట్టుకోగలిగిందన్నారు. ఘన, ద్రవ జీవామృతం, వివిధ రకాల కషాయాలు వాడి, భూసా రం పెంపుతో పాటు తెగుళ్లను నివారించుకోవచ్చన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ పద్ధతిలో వ్యవసాయం చేసిన రైతులకు దిగుబడి ఆశాజనకంగా ఉందని ఆయన అన్నా రు. పెట్టుబడులు తగ్గి, నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయని, రైతుల ఆత్మహత్యలు సైతం నివారించవచ్చని ఆయన వివరించారు. కనుక రైతులు ప్రకృతి వ్యవసాయం పాటించేలా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. మూడు రోజుల పికో ప్రొజెక్టర్ శిక్షణకు కొత్త క్లస్టర్ల సి ఆర్‌పిలు, సిఎలు హాజరు కావాలని ఆయన కోరారు. డిపి ఎం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా విష రహిత పంటలు పండిచేందుకు రైతుల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇన్‌చార్జ్ జెడి ఎ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగు మం దుల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు, నష్టాలను వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానమే రైతులకు లాభసాటి అని, రైతుల ఆత్మహత్యల నివారణకు తోడ్పడుతుందని అన్నారు.