అనంతపురం

‘ఉపాధి’ పనులు చేయించారు... డబ్బులివ్వలేదు.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

. 2014లో చేసిన పనులకు అందని బిల్లులు..
* ఆందోళనలో కూలీలు
నల్లమాడ, నవంబర్ 15: ఉపాధి పనులని మెగా వాటర్ షెడ్ కింద తమతో పనులైతే చేయించారుగానీ అందుకు సంబంధించి కూలీ మొత్తాలివ్వలేదని మండలంలోని సానేవారిపల్లి ఉపాధి కూలీలు లబోదిబోమంటున్నారు. ఇవి ఏ ఆరు మాసాల క్రిత మో చేసిన పనుల కూలీ మొత్తాలు కావు. 2014లో పనిచేసిన కూలీ మొ త్తాలని ఉపాధి కూలీలు ఆవేదన వ్య క్తం చేశారు. ఉపాధి హామీ పనుల ని ర్వహణకు సంబంధించి జిల్లాలో ప లు ప్రైవేటుసంస్థలకు పనులను అప్పగించడం జరిగింది. అందులో భాగం గా నల్లమాడ మండలంలో ఏపీ మాస్ అనే సంస్థ మెగా వాటర్ షెడ్ పనుల ంటూ కొన్ని గ్రామాల్లో ఉపాధి కూ లీల ద్వారా పనులు చేయించారు. ఆ సంస్థలో విధులు నిర్వహించే పలు స్థాయిల్లోని అధికారులు కూలీలకు అ ందాల్సిన మొత్తాల్లో స్వాహా చేసి కూ లీల కడుపుకొడుతున్నారని పలు ఆరోపణలు మండలంలో గుప్పుమంటున్నాయి. ఈ పనులపై ఆరా తీస్తే భారీ మొత్తంలో కుంభకోణం బహిర్గతమయ్యే అవకాశం వుందన్న మెగా వాటర్ షెడ్ ద్వారా జరిగిన పనులను చేసిన కూలీలు మండలంలో ఆరోపిస్తున్నారు. మండలంలోని సానెవారిపల్లి గ్రామంలో సుమారు 60 కుటుంబాలు మెగా వాటర్‌షెడ్‌లో పనులు చేశారు. ఆ గ్రామ పరిధిలో పనిచేసే టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకందాల్సిన బిల్లులు ముందు నుంచి పూర్తిస్థాయిలో అందజేసే వారు కాదని కూలీలు ఆరోపించారు. గ్రామానికి చెందిన రాజేంద్రబాబు, ఓబుళేసు, చింరంజీవి, పి.లక్ష్మిదేవి, గంగులమ్మ, మల్లమ్మ, నాగేశ్వరిలు తాము ఎండనకా వాననకా పనిచేస్తే 2014లోని బిల్లులే ఇంతవరకు అందలేదని వాపోయారు. దాంతోపాటు మెగా వాటర్‌షెడ్ ద్వారా పనులు నిర్వహించిన గ్రామాల్లో ఉపాధి పనులు చేయించడం లేదని వందల సంఖ్యలో కూలీలు పనులు లేక ఊరికే వుండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. మెగా వాటర్ షెడ్ పేర కొన్ని సంస్థల ద్వారా జిల్లా అధికారులు ఉపాధి పనులు చేయిస్తూ లక్షల్లో లంచాల రూపంలో తీసుకుంటూ పనులు జరిగాయా లేదా.. కూలీలకు కూలీ మొత్తాలు చెల్లిస్తున్నారా లేదాని కనీస పర్యవేక్షణ కూడా చేయకుండా ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నల్లమాడ మండలంలో ఏపీ మాస్ సంస్థ ద్వారా జరిగిన పనులపై విజిలెన్స్ అధికారుల ద్వారా పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే భారీ మొత్తంలో నిధుల స్వాహా జరిగిన సంగతి బహిర్గతమయ్యే అవకాశం వున్నట్లు ఉపాధి కూలీలు ఆరోపించడం గమనార్హం..
పస్థులుండాల్సి వస్తోంది..
- ఎల్లమ్మ, ఉపాధి కూలీ...
మాకిప్పుడు చేయడానికి ఏం పనులూ లేక పస్తులుండాల్సి వస్తోంది. 2014లో మాతో పనులు చేయించుకుని ఇంతవరకు బిల్లులివ్వలేదు. తాము చేసిన పనులకు సంబంధించి కూలీ మొత్తాలివ్వాలని ఏపీ మాస్ కార్యాలయం వద్దకు వందలసార్లు తిరిగినా ప్రయోజనం లేదు. దాంతో ఉపాధి హామీ పనులు చేస్తే బిల్లులు వస్తాయన్న నమ్మకం లేదు.
సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేదు..
- రాజగోపాల్, ఏపీ మాస్ పీవో...
మండలంలోని సానెవారిపల్లిలో 2014లో జరిగిన పనులకు సంబంధించి కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూలీలకు అందాల్సిన బిల్లులు ఇవ్వలేదని నా దృష్టికి వచ్చింది. ఈ విషయం పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కూలీలకు న్యాయం చేస్తాం.

బిగుసుకున్న ఉచ్చు!
* నకిలీ డీడీల కేసులో కందికుంటకు ఐదేళ్ల జైలు శిక్ష
* సందిగ్దంలో రాజకీయ భవితవ్యం..
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, నవంబర్ 15 : మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్ రాజకీయ భవితవ్యానికి చీకట్లు ముసురుకుంటున్నాయి. నకిలీ డిడిల ఫోర్జరీ కుంభకోణం కేసులో నాంపల్లి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సిబిఐ) కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు ఇవ్వడమే ఇందుకు కారణం. 2003లో హైదరాబాద్‌లోని హుసేని ఆలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ డిడిల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2007లో అప్పటి ప్రభుత్వం కేసును సిబిఐకి అప్పగించింది. అప్పటి బ్యాంకు మేనేజర్ నరసింహరావుతో, ఇన్‌స్పెక్టర్ మోహన్‌కు కూడా నాంపల్లి సిబిఐ కోర్టు ఐదేళ్ల శిక్ష వేసింది. కాగా కందికుంటకు గతంలో కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించి నకిలీ డిడిల కుంభకోణంలో ఏడేళ్ల జైలు శిక్ష పడిన విషయం విధితమే. ఈ కేసులో నిన్నటి వరకు కందికుంట బెయిల్‌పై ఉన్నారు. తాజా ఘటనతో ప్రస్తుత ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాకు రాజకీయంగా ప్రజల్లో ఇమేజ్ పెంచుకునే అవకాశం కలిగినట్లయింది. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్, వైకాపా నుంచి పోటీ చేసిన అత్తార్ చాంద్‌బాషాపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం గతేడాది మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో అత్తార్ చాంద్‌బాషా టిడిపిలోకి చేరారు. అప్పటి నుంచి అత్తార్‌కు, కందికుంటకు మధ్య మనస్పర్థలు, పార్టీ పరంగా విభేదాలు నెలకొన్నాయి. ఇలాంటి స్థితిలో కందికుంటకు నాంపల్లి సిబి ఐ కోర్టు శిక్ష వేస్తూ తీర్పు చెప్పడం రాజకీయంగా భారీ దెబ్బ తగిలినట్లేనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. కాగా 1983-87 బ్యాచ్‌లో కర్నాటకలోని దావణగెరెలో ఉన్న బాపూజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బి.టెక్ (బి.ఇ) గ్రాడ్యుయేషన్ చేసిన కందికుంట, 2009లో కదిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందే 2007లో ఈయనపై అక్రమ ఆయుధాల కేసు అనంతపురం వన్‌టౌన్‌లో నమోదైందని రికార్డులు వెల్లడిస్తున్నాయి. అదే సంవత్సరంలో గాండ్లపెంట పిఎస్‌లో పంచాయతీరాజ్ చట్టం కింద కూడా ఓ కేసు నమోదైంది. అలాగే ముదిగుబ్బ పి ఎస్‌లోనూ ఓ కేసు నమోదైంది. 2006లో బెంగళూరు సిసిబి పోలీసు స్టేషన్లో అక్రమ ఆయుధాల కేసు ఉంది. సుమారు 6 కేసుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించారు. ఈ పరిస్థితుల్లో తాజా పరిణామంతో కదిరి రాజకీయాలు, ముఖ్యంగా టిడిపిలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో కూడా కదిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నప్పటికీ అత్తార్ చాంద్‌బాషాకు పెద్దగా ఆశలు ఉండేవి కావు. అయితే కందికుంటపై రుజువైన అభియోగాల నేపథ్యంలో టిడిపిలో కాలం కలిసి రావచ్చని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అత్తార్ చాంద్‌బాషాతో వైరాన్ని ఎదుర్కొంటూనే, బలమైన నాయకుడిగా తన వర్గాన్ని పటిష్టం చేసుకున్న కందికుంట భవితవ్యం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. తాజా పరిణామాలతో అధినేత రానున్న ఎన్నికల్లో అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆ లోపు కందికుంట తనపై పడిన ముద్రను ఎలా చెరిపేసుకుంటారో వేచి చూడాల్సిందే.

మిర్చి పంటకు తెగుళ్లు
* ఆందోళనలో రైతులు
ఉరవకొండ, నవంబర్ 15 : తుంగభద్ర ఎగువ కాలవలోని హెచ్‌ఎల్‌సి, జిబిసి, బోరు బావుల కింద సాగు చేసిన మిర్చి పంటకు తెగుళ్లు సోకి రైతులు ఆందోళన చెందుతు న్నారు. పంటు తెగుళ్లు సోకి మొక్కలు వాడిపోయి పూత రాలిపోతున్నాయి. డివిజన్ పరిధిలో నియోజకవర్గం పరిధిలోని వేల్పుమడుగు, ఆర్‌కొట్టాల, గడేకల్లు, డొనేకల్లు, హంచనహాల్, రాయంపల్లి, నెరమెట్ల, ఆమిద్యాల, నింబగల్లు, చాయాపురం, కొనకొండ్ల, పొలికి, తిమ్మాపురం గ్రామాల్లో సుమారు 20వేల ఎకరాల్లో బ్యాడికి, కడ్డి, గుంటూరు రకాల మిర్చి పంటలు సాగు చేస్తున్నారు. పంట సాగు చేయడానికి ఎకరాకు రూ.50 నుంచి రూ.60వేల రూపాయల పెట్టుబడి అవుతుంది. అయితే రెండు, మూడు సంవత్సరాల నుంచి మిర్చి పంటకు వైరస్ తెగుళ్లు రావడంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతూనే ఉన్నారు. పంట సాగు చేయడానికి ప్రైవేట్ వ్యక్తులతో అప్పులు చేసి పంట సాగు చేస్తే ఇలా తెగుళ్లు వచ్చి పంట చేతికి రాకుండా పోతోందని రైతులు వాపోయారు. గతంలో చేసిన అప్పులు తీర్చుకుందామనే ఆశతో ఈసారి మిర్చి పంటను సాగు చేస్తే ఆసారి కూడా గిల్టు, బూడిద తెగుళ్లు, ఆకుముడత తెగుళ్లు సోకడంతో పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. మరోవైపు హార్టికల్చర్ అధికారులు అందుబాటులో ఉండడం లేదని, కేవలం క్రిమి సంహారక మందుల వ్యాపారుల సలహాలపై ఆధారపడి మందులు వేస్తున్నామన్నారు. వారు కూడా స్వలాభాల కోసం ఏదో మందులు తమకు అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హార్టికల్చర్ అధికారులు చర్యలు తీసుకుని మిర్చిపంటల సాగులపై సలహాలు, సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
‘పల్లె’కు మళ్లీ గౌరవం
* పయ్యావులకూ ప్రమోషన్..
* చీఫ్‌విప్‌లుగా నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, నవంబర్ 15 : మంత్రి పదవి నుంచి తొలగించిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డికి మళ్లీ పదవి వరించింది. కేబినెట్ హోదా కలిగిన శాసన సభ చీఫ్‌విప్‌గా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, శాసన మండలి చీఫ్‌విప్‌గా పయ్యావుల కేశవ్‌ను నియమిస్తూ బుధవారం జీఓ జారీ చేశారు. చీఫ్‌విప్‌గా ఉన్న కాలవ శ్రీనివాసులును మంత్రివర్గ విస్తరణలో కేబినెట్‌లోకి తీసుకోవడంతో శాసనసభ చీఫ్ విప్ పదవి ఖాళీ అయింది. దీంతో జిల్లా చెందిన ఎమ్మెల్యే పల్లెకే ఆ పదవి ఇవ్వడం గమనార్హం. సభలో చీఫ్‌విప్‌తో మరో ఇద్దరు విప్‌లను కూడా నియమించారు. ఇప్పటికే నలుగురు విప్‌లు ఉన్నారు. దీంతో చీఫ్ విప్‌తోపాటు ఆరుగురు విప్‌లు బాధ్యతలు పంచుకోనున్నారు. మండలి విప్‌లుగా మరో నలుగురికి సిఎం అవకాశం ఇచ్చారు.
లక్ష్యాలు అధిగమించాలి
* అంగన్‌వాడీలతో మంత్రి పరిటాల సునీత
అనంతపురం సిటీ, నవంబర్ 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను సక్రమంగా అమలుచేసి ఐసిడిఎస్ లక్ష్యాలను అధిగమించాలని మంత్రి పరిటాల సునీత అన్నారు. బుధవారం నగరంలోని కెఎస్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో కూడేరు ఐసిడిఎస్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు నిజ సమయ పర్యవేక్షణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఐసిడిఎస్ వ్యవస్థను బలోపేతం చేయుటకు, పోషకాహార పెంపుదల పథకాలను ఆయా ప్రాజెక్టుల్లో ఎంపికైన అంగ్‌వాడీ కేంద్రాల్లో అమలుచేస్తున్న దృష్ట్యా ఐసిడిఎస్ సేవలు పంపిణీ, వాటి పరక్షవేక్షణ నాణ్యతలో మెరుగుదల సాధించడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రాష్ట్రంలోని చిన్నారులకు సమగ్ర పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, అందులో భాగంగా కార్పొరేట్ ఫ్రీ స్కూల్‌కు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణులకు కౌనె్సలింగ్, శిశువులు, చిన్నపిల్లల ఆహార అలవాట్లు, పోషణ స్థితిపై పేరుపేరున ప్రతి బిడ్డను గమనించడం, గ్రోత్ మానటరింగ్ చార్ట్‌లను తయారుచేయడం కోసం కాస్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఎంతో దోహదపడుతుందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
శాశ్వత నీటి సమస్య పరిష్కారమే లక్ష్యం
* ఇంజినీరింగ్ చీఫ్ చంద్రయ్య
హిందూపురం టౌన్, నవంబర్ 15 : పట్టణంలో నెలకొన్న నీటి సమస్యను శాశ్వతం పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇంజినీరింగ్ చీఫ్ చంద్రయ్య తెలిపాన్నారు. ఈమేరకు బుధవారం గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద జరుగుతున్న పనులతోపాటు పట్టణంలో ఇటీవల నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయంతో తాగునీటి పథకాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని రూ.194 కోట్లతో ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద ఇన్‌టెక్ వెల్ పనులు జరుగుతున్నాయని, మరింత వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా దాదాపు 50 కిలోమీటర్ల మేర ఉన్న తాగునీటి పథకం నడుమ రెండు చోట్ల రెవెన్యూ స్థలాలు, నాలుగు చోట్ల అటవీ శాఖ, 16 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి, మూడు ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బి శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయన్నారు. ఇందులో రెవెన్యూ శాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని, అటవీ శాఖ అధికారులు కూడా సుముఖత వ్యక్తం చేశారని, జాతీయ రహదారి అధికారులు రూ.20 లక్షలు చెల్లించాలని కోరినట్లు తెలిపారు. కాగా ఇప్పటికే స్థానిక కొట్నూరు నుండి ఎనిమిది కిలోమీటర్ల మేర పైపులైన్ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఇకపోతే అమృత్ పథకం కింద జిల్లాలో రూ.194 కోట్లతో పట్టణానికి తాగునీటి పథకాన్ని అందించడంతోపాటు అనంతపురం నగర పాలక సంస్థకు రూ.18, ధర్మవరం మున్సిపాలిటీలో రూ.8 కోట్లు, తాడిపత్రిలో రూ.150, గుంతకల్లులో రూ.15 కోట్లతో తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ శ్రీనాథరెడ్డి, ఆర్‌అండ్‌బి ఇఇ మురళీకృష్ణ, డిఇఇలు వేణుగోపాల్, నాయుడు, స్థానిక మున్సిపల్ ఇంజనీర్ రమేష్, డిఇఇ వన్నూరస్వామి తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు
* డిఐజి ప్రభాకర్‌రావు
రొళ్ల, నవంబర్ 15 : శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డిఐజి ప్రభాకర్‌రావు తెలిపారు. బుధవారం స్థానిక పోలీసుస్టేషన్‌ను ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం డిఐజి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షించడమే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తోందన్నారు. గతమాసంతో పోల్చితే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్ జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్నాటక సరిహద్దు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వాహనాల రాకపోకలు, అనుమానితులను గుర్తించడానికి అత్యాధునిక సిసి కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కరీముల్లా షరీఫ్, ఎస్సైలు నాగన్న, లింగన్న, రాంబాబు ఉన్నారు.
వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న డిఐజి
మండల పరిధిలోని కొత్తపాళ్యంలో వెలసిన వెంకటేశ్వరస్వామిని డిఐజి, ఎస్పీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు గోవిందరాజు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి దేవాలయాన్ని నిర్మించడం పట్ల గోవిందరాజును అభినందించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిఐజి, ఎస్పీలను గోవిందరాజు ఘనంగా సత్కరించారు.
రుణాలు సద్వినియోగం చేసుకోండి
* మెప్మా పిడి సావిత్రి
హిందూపురం టౌన్, నవంబర్ 15 : ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పొందాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సావిత్రి సూచించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా హాలులో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు సంఘాల్లో లేని మహిళలను గుర్తించి సంఘాల్లో చేరడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల్లోని సభ్యులు అన్నివిధాలా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. వీటిని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, కమిషనర్ భాగ్యలక్ష్మిను పిడి కలిసి ఈనెల 25న జాబ్‌మేళాతోపాటు వివిధ వృత్తి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు పేర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టిఎంసి గంగులయ్య, కమ్యూనిటీ ఆర్గనైజర్లు అంజనాదేవి, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
గుడిబండ, నవంబర్ 15: మండల పరిధిలోని శంకరగల్లుకు చెందిన సురేంద్ర (48) విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సురేంద్ర గ్రామ సమీపంలో ఉన్న కల్లురొప్పానికి చెందిన హనుమంతరాయప్ప పొలంలో కూలీ పనులకు వెళ్లాడు. పొలంలో పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవ శాత్తు అక్కడ ఉన్న విద్యుత్ ఎల్‌టి లైన్ కాలికి తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తోటి కూలీలు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతుడికి భార్య సుజాతతోపాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కుందుర్పి, నవంబర్ 15 : పురుగుల మందు తాగిన తీగన్న (70) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. కడుపు నొప్పు ఎక్కువ కావడంతో మంగళవారం పురుగుల మందు తాగాడు. గమణించిన చుట్టు పక్కల వారు 108 సాయంతో కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బళ్లారి రాఘవ స్మారక ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
అనంతపురం కల్చరల్, నవంబర్ 15: కళాప్రపూర్ణ, నాటక, కళారంగానికి విశేష కృషి చేసిన బళ్లారి రాఘవ స్మారక రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవాలను జనవరి 2, 3, 4వ తేదీల్లో మూడురోజులపాటు నగరంలో నిర్వహించనున్నట్లు ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.గోవిందరాజులు, ఎన్.ఈశ్వరయ్య పేర్కొన్నారు. ఈమేరకు లలిత కళాపరిషత్‌లో బళ్లారి రాఘవ స్మారక రాష్టస్థ్రాయి సాంస్కృతిక ఉత్సవాల ఆహ్వాన పత్రికను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఉన్న బళ్లారి రాఘవ ఆనాడు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారన్నారు. సామాజిక చైతన్యం కోసం నాటకరంగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి మహాత్మాగాంధీ, బెర్నార్డ్‌షావంటి మహనీయుల ప్రశంసలు అందుకున్నారన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలను, నాటకాలను ప్రదర్శిస్తారన్నారు. కళారంగం పట్ల ఆసకి తగల కళాకారులు తమ కళాప్రతిభను ప్రదర్శించేందుకు తమను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి తరిమెల అమరనాథ్‌రెడ్డి, శ్యామసుందరశాస్ర్తీ, శ్రీనివాసులు, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగాలకు ప్రకటన చేయాలని
ఎస్కేయూ విద్యార్థుల ఆందోళన
అనంతపురం సిటీ, నవంబర్ 15: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయాలని బుధవారం నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఎస్కేయూ మెయిన్ గేట్ వద్ద దాదాపు 2 గంటలపాటు విద్యార్థులు నిరసనలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చి నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ఎస్‌యు నాయకులు లింగారెడ్డి, ప్రకాష్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ పులిరాజు, ఎఐఎస్‌ఎఫ్, జివిఎస్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా
అనిల్‌కుమార్
అనంతపురం అర్బన్, నవంబర్ 15 : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా అనిల్‌కుమార్‌ను నియమిస్తూ బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేసారు. గత రెండున్నర సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా పనిచేస్తున్న వెంకటరమణను విశాఖపట్నంలోని చెస్టు ఆస్పత్రికి బదిలీ చేసారు. ప్రస్తుతం నూతనంగా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా అనిల్‌కుమార్ సర్వజన ఆస్పత్రిలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎం విభాగంలో డిపిఎంగా పనిచేస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
అనంతపురం సిటీ, నవంబర్ 15 రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు బిసిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వ శాఖలోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందనే నినాదంతో గద్దెనెక్కిన బాబు నాలుగు సంవత్సరాలు పూర్తయిన అటువైపు చూడకపోవడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌పిఎస్ నాయకులు బాబా, రఫీ, మధు, అమర్‌యాదవ్, సుబ్బరాయుడు, రమేష్ పాల్గొన్నారు.
పిజి కోర్సుల విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షల విధానం
అనంతపురం సిటీ, నవంబర్ 15: జెఎన్‌టియూ అనంతపురం విశ్వవిద్యాలయ పరధిలోని ఎం.టెక్, ఎం.్ఫర్మసీ కోర్సులకు ఆన్‌లైన్ పరీక్ష ప్రవేశపెట్టనున్నట్లు జెఎన్‌టియూ డైరెక్టర్ అకాడమిక్ అండ్ ప్లానింగ్ ఆచార్య ఎ.ఆనందరావు తెలిపారు. బుధవారం జెఎన్‌టియూ కాన్ఫరెన్స్ హాల్‌లో 12వ అకాడమిక్ సెనైట్ స్టాడింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఎం.టెక్, ఎం.్ఫర్మసీ చదువుతున్నటువంటి అనుబంధ కళాశాల విద్యార్థులకు 20 మార్కులు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. గవర్నమెంట్ పరీక్షలన్ని దాదాపుగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారని అందువలన ఎం.టెక్, ఎం.్ఫర్మసీ విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్ష విధానం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇండస్ట్రియల్ కోటా కింద పిహెచ్‌డి సీట్లు మెకానికల్ -1, ఫార్మసీ -2, కెమిస్ట్రీ- 5, కంప్యూటర్ సైన్సు 2 సీట్లు కేటాయించమని తెలిపారు. యుజి, పిజి, పిహెచ్‌డి కోర్సులలో నూతన సిలబస్ రూపకల్పనకు చర్చలు జరిపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియూ ఇన్‌ఛార్జు ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్, రెక్టార్ ఆచార్య సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆచార్య క్రిష్ణయ్య, డిఇ రామానాయుడు, ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు.
వార్డెన్ల సస్పెన్షన్‌కు డిమాండ్
అనంతపురం సిటీ, నవంబర్ 15: జిల్లాలోని బిసి హాస్టల్స్‌లో విద్యార్థుల హాజరు బయోమెట్రిక్ విధానంలో అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్‌లను తక్షణమే సస్పెండ్ చేయాలని బిసిఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సాకే నరేష్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక బిసి సంక్షేమ శాఖ కార్యాలయం ముందు బిసిఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ బిసి సంక్షేమ హాస్టల్స్‌లో విద్యార్థుల హాజరులో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పర్సెంటెజీలకు అలవాటుపడిన సంక్షేమాధికారి రమాభార్గవి వలన వార్డెన్లపై వత్తిడి వస్తుంటే వార్డెన్లు విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపుకునేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసిఆర్‌పిఎస్ నాయకులు సురేష్, బ్రహ్మ, హరికుమార్ నరేంద్ర, జయరాజు, శ్రీహరి, పార్వతమ్మ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఫిజియో థెరఫీ
ఆత్మకూరు, నవంబర్ 15: ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో దివ్యాంగులైన విద్యార్థులకు బుధవారం ఉచిత ఫిజియో థెరఫీ చికిత్స చేశారు. ప్రతి బుధవారం ఈ సదుపాయం కల్పించామని దివ్యాంగులైన విద్యార్థులు ఏ పాఠశాలలో చదువుతున్నా అవకాశం ఉపయోగించుకోవచ్చునని ఎంఈఓ నరసింహారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఈఆర్టీ రమేష్, అరుణకుమారి, పిటి మాధవి పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థికి కౌనె్సలింగ్
అనంతపురం అర్బన్, నవంబర్ 15: నగరంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారి పట్ల ట్రాఫిక్ పోలీసులు అవగాహనతోపాటు జరిమానాలతో ముందుకు వెళ్తున్నారు. బుధవారం టవర్‌క్లాక్ దగ్గర పదవ తరగతి చదివే చరణ్ అనే విద్యార్థి హోండా యాక్టివ్‌తో దూసుకుపోతుండగా ఇది గమనించిన ట్రాఫిక్ ఎస్‌ఐ బాబు విద్యార్థిని ఆపి ట్రాఫిక్ ఉల్లంఘనలు పాల్పడకూడదంటూ అవగాహన కల్పించారు. దీంతో విద్యార్థి తండ్రిని పిలిపించి ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతవంటి వాటిపై అవగాహన కల్పించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే బండి సీజ్ చేస్తమని హెచ్చరించి వదిలేసారు.
నిందితుడిపై కేసు నమోదు
అనంతపురం అర్బన్, నవంబర్ 15: నగరంలోని ఐదవ రోడ్డులో నివాసం ఉండే ఓ కుటుంబానికి చెందిన పదవ తరగతి చదివే మైనర్ బాలికపై వరసకు మామ అయ్యే షణ్ముక మాయమాటలు చెప్పి గత పదిహేను రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. దీనిపై రెండు రోజులు క్రితం బాలిక తల్లిదండ్రులు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారానికి పాల్పడ్డ నిందితునిపై ఫిర్యాదు చేశారు. బుధవారం సిఐ మురళీకృష్ణ నిందితునిపై ఫోక్స్ చట్టం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇద్దరు దొంగలు అరెస్టు
అనంతపురం అర్బన్, నవంబర్ 15: జిల్లా వ్యాప్తంగా తాళాలు వేసిన ఇళ్లల్లో 50కి పైగా చోరీలకు పాల్పడ్డ పాత నేరస్తులను నగర పోలీసులు అరెస్టు చేసినట్లు డిఎస్పీ వెంకట్రావ్ తెలిపారు. నిందితుల నుంచి 22 తులాల బంగారం ఆభరణాలతోపాటు రూ.2500 నగదును స్వాధీనం చేసుకొన్నట్లు ఆయన తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.6,35,000 ఉంటుందన్నారు. బుధవారం స్థానిక రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ వెంకట్రావ్‌తోపాటు సిసిఎస్ డిఎస్పీ నాగసుబ్బన్న పాల్గొన్నారు. డిఎస్పీ వెంకట్రావ్ వివరాలను వెల్లడించారు. నగరంలో ఇటీవల చోటు చేసుకొంటున్న వరుస చోరీలపై ప్రత్యేక దృష్టి సారించటం జరిగిందన్నారు. పాత నేరస్తులుగా పోలీసు రికార్డుల్లో నమోదైన సాకే గంగన్న, పీట్ల గంగాధర్ తమ పద్ధతిని మార్చుకోకుండా తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడటం జరుగుతుందన్నారు. జిల్లాలోని అనంతపురం, తాడిపత్రి, కదిరి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, పెద్దవడుగూరు, పామిడి, అమరాపురం, కసాపురం, రామగిరి, కనగానప్లి, గుమ్మగట్ట, చెనే్నకొత్తపల్లి, శ్రీకాళహస్తి, బెంగళూరు, బళ్ళారి ప్రాంతాల్లో దొంగతనం కేసుల్లో పలుసార్లు సబ్‌జైలుకు వెళ్లటం జరిగిందన్నారు. నగరంలో చోరీలకు పాల్పడే వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచటం జరిగిందన్నారు. ఇందులో భాగంగా సిసిఎస్ డిఎస్పీ నాగసుబ్బన్న ఆధ్వర్యంలో రెండవ పట్టణ ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి, సిబ్బంది జాకీర్‌హుస్సేన్, వెంకటేసులు, గిరిమహేష్, బయన్న, రంజిత్, కిరణ్, ప్రభాకర్‌తో ప్రత్యేక బృందంగా ఏర్పడి బుధవారం విద్యుత్‌నగర్ సర్కిల్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పాత నేరస్తులనే విషయంతోపాటు ఇటీవల తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ విషయాలకు బయటపడటం జరిగిందన్నారు.