అనంతపురం

పరుగు పెట్టకుంటే.. ‘మరుగు’ బరువే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 17 : ‘జిల్లాలో ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరి.. లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మించుకుంటేనే ప్రభుత్వ పథకాలు కట్..’ అంటూ కలెక్టర్ జి.వీరపాండ్యన్ అటు అధికారులు, ఇటు లబ్ధిదారులను హెచ్చరిస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ అమలులో భాగంగా జిల్లాలో 2019 జనవరి 26 (రిపబ్లిక్ డే) నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందుల కారణంగా ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోనట్లు తెలుస్తోంది. జిల్లా గ్రామీణ నీటి పారుదల, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. సుమారు 15 రోజుల నుంచే దీనిపై కలెక్టర్ భారీ ఎత్తున కసరత్తు చేసి లక్ష్యాలు నిర్దేశిస్తూ నియోజకవర్గానికి ఒక్కో అధికారిని బాధ్యుడిగా నియమించారు. జిల్లాకు 5.50 లక్షల మరుగుదొడ్లు మంజూరుకాగా, 15 రోజుల క్రితంనాటికే 2.50 లక్షలు పూర్తయినట్లు స్వయంగా కలెక్టరే ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాధికారులు ప్రభుత్వానికి సమర్పించిన గణాంకాల మేరకు జిల్లాలో 2,38,745 మంది లబ్ధిదారులకు మరుగుదొడ్లు లేవు. స్వచ్ఛ భారత్ కింద రూ.43,148 లక్షల అంచనా వ్యయంతో 2,87,825 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 68,393 మంది మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఇందుకు రూ.10,243 లక్షలకుపైగా వ్యయం చేశారు. మరో 30,791 మరుగుదొడ్లు పురోగతిలో ఉన్నాయి. వీటికోసం రూ.4,616 లక్షలు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. వీటిలో వివిధ దశల్లో ఉన్న వాటికి రూ.1,809 లక్షలు ఖర్చు చేశారు. పూర్తయిన, పురోగతిలో ఉన్నవి మినహాయిస్తే ఇంకా 1,87,631 పూర్తి కావాల్సి ఉన్నాయి. ఈనేపథ్యంలో ప్రక్రియ మరింత వేగవంతం కావాల్సి ఉంది. జనవరి 26 నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనుకున్న కలెక్టర్ సంకల్పానికి, ప్రభుత్వ లక్ష్యానికి సుమారు 70 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ క్రమంలో ఇప్పటికీ ప్రారంభించని 1.87,631 మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం కావాల్సి ఉంది. అయితే జిల్లాలో చాలాచోట్ల నీటి సమస్య తలెత్తుతోందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికితోడు ఇటుకలు, సిమెంట్ రింగ్స్, సిమెంట్ బ్యాగులు లబ్ధిదారులకు చేరడంలో జాప్యం జరుగుతోందని సమాచారం. ఈ సామగ్రిని స్థానిక తయారీదారులతోపాటు పెద్ద కంపెనీలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పించుకోవడానికి అనుమతిచ్చారు. అయితే నియోజకవర్గాల వారీగా ఎంత మోతాదులో సిమెంట్, ఎన్ని సిమెంట్ రింగ్‌లు, ఇటుకలు అవసరమన్న విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో పెద్ద కంపెనీలు, లేదా సిమెంట్ ఏజెన్సీల వారు సామగ్రి సరఫరా చేసేందుకు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు నిర్మాణాల పట్ల ఆసక్తి చూపిస్తున్నా, చైతన్యం ఉన్నా సకాలంలో సామగ్రి అందకపోవడం వల్ల లక్ష్య సాధనలో జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇటుకల తయారీ బాధ్యత అప్పగించినా, జిల్లాలో చాలా చోట్ల మరుగుదొడ్ల నిర్మాణాలను కాంట్రాక్ట్‌కు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రవాణా ఖర్చులైనా మిగులుతాయని లబ్ధిదారులు వారికి అప్పగించేస్తున్నారు. అయితే నీటి సరఫరా, క్యూరింగ్ బాధ్యత లబ్ధిదారులపైనే వదిలేస్తున్నట్లు సమాచారం. నీటి వనరులు లేకపోవడం, విద్యుత్ సమస్యలు, నిల్వ ఉంచుకునే వెసులుబాటు లబ్ధిదారులకు లేకపోవడం ప్రధాన కారణాలని తెలుస్తోంది. ఉపాధి కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, అనంతపురం, సమీపంలోని ఇతర జిల్లాలకు వెళ్లిన వారు రూ.15,000 కాంట్రాక్టర్లే తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇలాంటి సమస్యల్ని అధిగమించకుంటే మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా వెనుకబాటు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలు, వివిధ శాఖలు చిత్తశుద్ధితో వ్యవహరించక పోతే