అనంతపురం

రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, నవంబర్ 17: అనంతపురంలో జరిగే రాష్టస్థ్రాయి పోలీసు స్పోర్ట్స్‌మీట్‌ను సమష్ఠిగా కృషి చేసి విజయవంతం చేద్దామని రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ విభాగం ఐజిపి ఆర్కే మీనా పిలుపునిచ్చారు. డిశంబర్ 4నుంచీ 8వ తేదీ వరకూ జరిగే స్పోర్ట్స్ మీట్ నేపథ్యంలో శుక్రవారం స్థానిక పోలీసుకాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులతో కోఅర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలి, సౌకర్యాల కల్పన, క్రీడాసామాగ్రి సేకరణ, తదితర అంశాలపై లోతుగా చర్చించారు. అనంతరం ఐజిపి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత మొదటిసారిగా రాష్టస్థ్రాయి పోలీసు సోర్ట్స్ మీట్ నిర్వహించటం అనంతపురంలో నిర్వహించటం సంతోషంగా ఉందన్నారు. దీన్ని సవాలుగా తీసుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దామన్నారు. ఉన్నతాధికారులతో పాటు ప్రముఖులు హాజరమ్యే అవకాశమున్నందున పకడ్బందిగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సబ్‌కమిటీల విధులపై ఆరాతీశారు. కమిటీలు ప్రణాళికా బద్దంగా తమకు అప్పగించిన పనులను పూర్తి చేయాలన్నారు. ఎపిఎస్.డి ఐజి విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ నేతృత్వంలో స్పోర్ట్స్‌మీట్‌కు మంచి ప్రణాళికలు రూపొందించారన్నారు. ఎస్పీ అశోక్‌కుమర్ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా 20 ఆటలలో పోటీలు జరుగుతాయన్నారు. స్థానిక పోలీసుపరేడ్ మైదానం, నీలం సంజీవరెడ్డి స్టేడియం, ఆర్డీటి స్టేడియం, జిల్లా స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 14వ బెటాలియన్ కమాండెంట్ జగదీష్, అదనపు ఎస్పీలు మల్యాద్రి, వెంకటేష్, జిల్లాలోని పలువురు డిఎస్పీలు, సి.ఐలు, పోలీసు అధికారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బావిలో దొరికిన పీర్లు..
విడపనకల్లు, నవంబర్ 17 : మండల పరిధిలోని ఉండబండ గ్రామంలో శుక్రవారం గ్రామశివార్లలోని కాశీవిశ్వనాథ్ ఆలయం బావిలోపల రెండు పీర్లదేవుళ్ల విగ్రహాలు లభ్యమయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు గతంలో జరిగిన మొహర్రం పండగ రోజు స్వాములు చెప్పిన ప్రకారం బావిలో హసేని, హుసేని అనే పీర్లదేవుళ్లు విగ్రహాలు లభించాయన్నారు. దీంతో సిఐ చిన్నగౌస్, పాల్తూరు ఎస్‌ఐ ఖాన్, ఉరవకొండ ఎస్‌ఐ ఆధ్వర్యంలో బళ్లారికి చెందిన ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి బావిలోకి గణేష్, అశోక్ అనే ఇద్దరులు యువకులను దించారు. వీరు నీటిలోకి చేతులు పెట్టగానే పీర్ల విగ్రహాలు లభించాయి. ఈవేడుకను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. పీర్లదేవుళ్ల విగ్రహాలను బావి నుంచి గ్రామంలోని పీర్ల చావిడి వరకూ ఊరేగిస్తూ తీసుకెళ్లారు.
వైభవంగా లక్ష దీపోత్సవం
రొళ్ల, నవంబర్ 17 : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని కొత్తపాళ్యంలో వెలసిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుఝాము నుంచే సుప్రభాతసేవ, ఆరాధన, అభిషేకార్చనలు వంటి పూజలు నిర్వహించారు. అదేవిధంగా రాత్రి ఆలయంలో మహిళలు దీపాలు వెలిగించి మొక్కుబడులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తిని పురవీధుల గుండా ఊరేగించారు. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు గోవిందరాజు పాల్గొన్నారు.
వైభవంగా బీబీ జైనబ్బీ ఉరుసు
ఉరవకొండ, నవంబర్ 17 : పట్టణంలో వెలసిన హజరత్ బీబీ జైనబ్బీ ఉరుసు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఇందలో భాగంగా గురువారం అర్ధరాత్రి షంషీర్‌ను ప్రత్యేకంగా అలంకరించి దర్గా నుంచి భాజాభజంత్రీల నడుమ పట్టణ పురవీధులగుండా ఊరేగింపుగా శుక్రవారం తెల్లవారుజామున దర్గాకు చేర్చారు. సాయంత్రం జియారత్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం నుంచి చాదర్‌ను ఊరేగింపుగా దర్గాకు చేర్చారు. అనంతరం అమ్మవారి సమాధిపై చాదర్‌ను వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాలను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా ముందుజాగ్రత్త చర్యగా సిఐ చిన్నగౌస్, ఎస్‌ఐ నగేష్‌బాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
హిందూపురం రూరల్, నవంబర్ 17 : మండల పరిధిలోని బీరేపల్లిలో విద్యుదాఘాతంతో కొట్నూరుకు చెందిన నరసప్ప (50) మృతి చెందాడు. విద్యుత్ శాఖ లైన్‌మెన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న నరసప్ప బీరేపల్లి వద్ద మరమ్మతుల కోసం ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా విద్యుత్ స్తంభాన్ని ఎక్కి వైర్లు పట్టుకోవడంతో ప్రమాదం చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైతు ఆత్మహత్య
గుమ్మఘట్ట, నవంబర్ 17 : మండలంలోని ఆర్.కొత్తపల్లికి చెందిన మంజునాథ్‌రెడ్డి (38) అప్పుల బాధ తాళలేక శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మంజునాథ్‌రెడ్డికు పదెకరాల పొలం ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో పొలంలో పది బోర్లు వేయించాడు. అయితే అనుకున్న స్థాయిలో పంటల దిగుబడి రాకపోవడంతో సుమారు రూ.5లక్షల వరకూ అప్పులు చేశాడు. ఈనేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలో మదనపడి శుక్రవారం ఊరి చివరలోని చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడికి కూతురు, కొడుకు ఉన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.
హత్య కేసులో నిందితులకు జీవితఖైదు
హిందూపురం టౌన్, నవంబర్ 17 : వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ అదనపు జిల్లా జడ్జి శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన తులసీరాంఠాకూర్‌ను అతని సోదరుడు మనోజ్ ఠాకూర్, బావమరిది సుదర్శన్‌శర్మ గతేడాది సెప్టెంబర్ 20న పుట్టపర్తి సమీపంలో హత్య చేసి కల్వర్టు కింద పడవేశారు. అప్పట్లో గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా తులసీరాంఠాగూర్‌ను మనోజ్‌ఠాకూర్, సుదర్శన్‌శర్మ హత్య చేసినట్లు తేలడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సంబంధిత కేసు శుక్రవారం స్థానిక కోర్టులో విచారణకు రాగా పూర్వోపరాలను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీరామచంద్రమూర్తి నిందితులకు జీవితఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ప్రాసిక్యూషన్ తరపున ఎపిపి రాజశేఖర్ వాదించారు.