అనంతపురం

లబ్ధిదారులు నష్టపోక తప్పదు.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, నవంబర్ 17 : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన లేపాక్షి అభివృద్ధి నత్తనడకన కొనసాగుతోంది. పర్యాటక, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, కేంద్ర పురావస్తు, దేవాదాయ, గ్రామీణాభివృద్ధి శాఖలకుతోడు పలు ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉం ది. అయితే ఆయా శాఖల సమన్వ య లోపంతో లేపాక్షి అభివృద్ధికి నో చుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వ హయా ంలో లేపాక్షిలో నంది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు కేంద్ర మ ంత్రులు, సినీనటులను భారీ స్థాయి లో తీసుకొచ్చారు. దీంతో ఇక్కడ పర్యాటకం అభివృద్ధి చెంది రూ.5 కోట్లకు పైబడి వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ప్రణాళికలు సిద్ధం రెండేళ్లు గడిచినా కొన్ని పను లు నేటికీ ప్రారంభానికి నోచుకోకపోడం గమనార్హం. ప్రస్తుతం లేపాక్షి గ్రామాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకం కింద ప్రభుత్వం ఎంపిక చే యగా ఇందుకు సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే సర్వే పూర్తి చేసింది. దీనికితోడు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆ శాఖ తరపున గ్రామంలో రహదారి వెడ ల్పు పనులను ప్రారంభించారు. అదేవిధంగా పర్యాటక శాఖ రూ.3కోట్ల నిధులతో పనులను ప్రారంభించింది. దీనికితోడు దేవాదాయ శాఖ, కేంద్ర పురావస్తు శాఖలు కూడా కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయా శాఖలు ఎవరికి వారు పనుల నిర్వహణకు సమాయాత్తం అవుతుండటం వల్ల సమన్వయ కొరత ఏర్పడి కొన్ని అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఆయా శాఖలను సమన్వయ పరచి ఆర్డీఓ స్థాయి అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు ప్రణాళికాబద్ధంగా పనులు నిర్వహించాల్సి ఉంది. లేకపోతే కోట్లాది రూపాయలు నిధులు మంజూరైనా కొన్ని అభివృద్ధి పనులు నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉంది. గతంలో కలెక్టర్‌గా పని చేసిన టక్కర్ హయాంలో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసి లేపాక్షి అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించేవారు. తర్వాత ఎమ్మెల్యే బాలయ్య లేపాక్షి అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతున్న తరుణంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రణాళికాబద్ధంగా లేపాక్షి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఏడాది కాలంలో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. కాగా లేపాక్షి నంది ఉత్సవాలపై కలెక్టర్ అధ్యక్షతన నేడు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. కనీసం ఈ సమావేశంలోనైనా లేపాక్షి అభివృద్ధికి గట్టి పునాదులు పడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
వాటర్‌షెడ్ పనుల్లో ప్రైవేటు సంస్థల దందా..
* కమీషన్లకు కక్కుర్తి..* పనుల్లో లోపించిన నాణ్యత
* కూలీలకు మొండిచేయి..* ఏళ్ల తరబడి తిప్పించుకుంటున్న వైనం...
నల్లమాడ, నవంబర్ 17: గ్రామీణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రభుత్వ అనుబంధంతో చేబట్టిన వాటర్‌షెడ్ పనుల్లో కొన్ని ప్రైవేటుసంస్థలు పెద్ద మొత్తంలో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ, గ్రామీణ అభివృద్ధి పనులను జిల్లాలో ప్రభుత్వం ద్వారా నిర్వహించడమే కాకుండా వాటర్‌షెడ్, మెగా వాటర్‌షెడ్‌ల పేరిట కొన్ని ప్రైవేటుసంస్థలకు పనులను డ్వామా ద్వారా అప్పజెప్పారు. అనుభవం, నాణ్యతకు ప్రాముఖ్యతనివ్వడంతోపాటు గ్రామాల్లోని ప్రజలు, రైతులతో మమేకమై నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధికి దోహదపడతారన్న ఉద్దేశ్యంతో ప్రైవేటుసంస్థలకు ఈ పనులు అప్పజెప్పారు. అయితే వాటర్‌షెడ్ పనులు నిర్వహిస్తున్న ప్రైవేటుసంస్థలు తమ అనుభవాన్ని అభివృద్ధివైపుకంటే అక్రమాల కోసమే వినియోగించినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో నల్లమాడ మండలంలో ఏపీమాస్, ఓబుళదేవరచెరువులో జనజాగృతి, కొత్తచెరువులో చైతన్యరీడ్స్, రాయదుర్గంలో పీఆర్‌డీయస్, కూడేరులో ఆర్డీటిఎఫ్, కనగానపల్లిలో ఏపీపిఎస్, కంబదూరులో రీడ్స్, మడకశిరలో ఫోర్డ్ సంస్థలు వాటర్‌షెడ్ల పేరిట ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. అయితే గతంలోనే కొన్ని సంస్థలపై ఆరోపణలు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. కోన శశిధర్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో మడకశిర మండలంలో పనిచేసిన ఫోర్డ్ సంస్థ అక్రమాలను వెలికి తీయించారు. ఆ సంస్థలో పనిచేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించారు. అదేవిధంగా అప్పట్లో మరో రెండు సంస్థలకు అప్పగించిన పనులను కూడా రద్దు చేసినట్లు సమాచారం.
ఈ సంస్థలు చేపట్టాల్సిన పనులను డ్వామా ఆధ్వర్యంలో కేటాయించావారు. వాటర్‌షెడ్‌ల పరిధిలో ఉపాధి హామీ ద్వారా జరిగే పనులతోపాటు మరిన్ని అభివృద్ధి పనులు నిర్వహిస్తుంటారు. చెక్‌డ్యాంలు, చెరువులు, ఫారంపాండ్‌ల నిర్మాణాలు, కొండలు, గుట్టల్లో కందకాల తవ్వకాలు, ఆసక్తి వున్న రైతన్నలు ముందుకొస్తే వారి పొలాల్లో పండ్ల తోటల పెంపకానికి నిధులిస్తూ ప్రోత్సహించడం, రైతన్నలకు రాయితీతో స్ప్రేయర్లు, టార్పాళ్లు, పొలాలను దుక్కి చేసే పనిముట్లు, వర్మీకంపోస్టు పిట్స్ నిర్మాణాలు, ఆవులు, గొర్రెలకు రుణాలు, పొలాల్లో ట్రంచుల నిర్మాణాలు, పశువుల కోసం నీటి తొట్టెలు, రాక్‌ఫిల్ డ్యాంలు, పెద్ద నీటి కుంటలు, ఖాళీగా వున్న ప్రభుత్వ భూములు, రోడ్లకిరువైపులా మొక్కల పెంపకం తదితర అభివృద్ధి పనులను చేయాల్సి వుంది. దీనికి సంబంధించిన ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ సంస్థలకు అందుతుంది. జిల్లా డ్వామా అధికారులు నిర్దేశించిన అభివృద్ధి పనుల ప్రకారం రూ. కోట్లల్లో నిధులు ఆ సంస్థలకు ఇచ్చారు. దాంతోపాటు ఐదుగురు అధికారులను ఆ సంస్థలో నియమించి వారికి జీతభత్యాలు కూడా ప్రభుత్వమే భరిస్తోంది. అయితే ఇదే అవకాశంగా భావించిన కొన్ని సంస్థలు తాము చేస్తున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి ఆదాయం వైపే మొగ్గుచూపుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో చేసే పనులను ఆయా గ్రామాల్లోని పెద్దలకు అప్పజెప్పడం వారిచ్చే 10, 20శాతం కమీషన్లకు కక్కుర్తిపడి నాణ్యతకు తిలోదకాలిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దాంతోపాటు ఉపాధి కూలీల ద్వారా చేయించిన పనులకు సంబంధించి 3 సంవత్సరాలకు ముందు బిల్లులు కూడా కూలీలకు అందజేయలేదని తెలుస్తోంది. మరికొన్ని పనులను చేయకపోయినా చేసినట్లు చూపి లక్షల్లో బిల్లులు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అదే విధంగా ఉచితంగా అందజేయాల్సిన పండ్ల మొక్కలకు కూడా డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. చెక్‌డ్యాంల నిర్మాణాల్లో కాంట్రాక్టర్ల నుంచి అధిక మొత్తాల్లో కమీషన్లు చేయడంతో పనులను ప్రారంభించిన వారు సైతం తమకు గిట్టుబాటు కాదని వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం.
ప్రతి బిల్లూ చెల్లించేస్తున్నాం...
నాగభూషణం, పీడి, డ్వామా..
వాటర్‌షెడ్‌ల ద్వారా (ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న) చేసిన పనులకు సంబంధించి కూలీలకు అందజేయాల్సిన, తదితర బిల్లులు పెండింగ్ లేవు. ఉంటే కేవలం ప్రస్తుత ఏడాదిలో ఓ నాలుగు మాసాల బిల్లులు ఏవైనా పెండింగ్ వుండొచ్చు. ప్రైవేటుసంస్థల ద్వారా చేబట్టిన పనులన్నింటినీ పరిశీలిస్తాం. అక్రమాలు జరిగి ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని తేలితే వారిపై చర్యలు తప్పవు.
నేడు వేణుగోపాలస్వామిరథోత్సవం
* సత్యసాయి జయంతికి భారీ ఏర్పాట్లు
పుట్టపర్తి, నవంబర్ 17: భగవాన్ సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం ప్రశాంతినిలయం సాయికుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు, వేదపఠనం నిర్వహిస్తారు. ప్రశాంతినిలయంలోని అశేష భక్తజనం అనాదిగా వస్తున్న వేణుగోపాల స్వామి రథోత్సవ వేడుకలకు సంసిద్ధులవుతారు. సత్యసాయి ట్రస్టు పరివారం, సాయిభక్తజనం, పుట్టపర్తి స్థానిక జనం పురవీధుల్లో వేణుగోపాలస్వామి రథాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. శుక్రవారం సాయంత్రమే ప్రధాన వీధుల గుండా రంగరంగుల ముగ్గులు, పచ్చటి తోరణాలతో అలంకరణలు ప్రారంభించారు. హనుమాన్ సర్కిల్‌లోని పెద్దవెంకమరాజు కళ్యాణమండపంలోని వేణుగోపాల స్వామి రథాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో తీర్చిదిద్దుతున్నారు. ఉదయం 8:45గంటలకు రథాన్ని ప్రశాంతినిలయం ఈశాన్యగోపురం వద్దకు తీసుకొచ్చి ప్రశాంతినిలయంలోని వేణుగోపాలస్వామి సహిత హనుమంతుని ఉత్సవ విగ్రహాలను రథంపై, పల్లకిపై వుంచి కాయకర్పూరం సమర్పించి ట్రస్టు పరివారం రత్నాకరం వంశీయులు, సాయిభక్తులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనాదిగా ఆనవాయితీగా వస్తున్న స్థానికులు డప్పులు, మేళతాళాలు, సాంప్రదాయ, సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలు, సాంస్కృతిక కళలు ప్రదర్శిస్తు పురవీధుల్లో రథోత్సవాన్ని సాగిస్తారు. ఈ సందర్భంగా సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, అశేష భక్తజనం జయంతి వేడుకల ప్రారంభోత్సవం, వేణుగోపాలస్వామి రథోత్సవంలో పాల్గొని స్వామికృపకు పాత్రులవ్వాలని పిలుపునిచ్చారు. సత్యసాయి సేవా సభ్యులు పుట్టపర్తికి చెందిన సాయి యువత రథోత్సవ వేడుకలకు ముస్తాబు కార్యక్రమాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు.