అనంతపురం

సమష్టి కృషితోనే డివిజన్‌కు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, ఏప్రిల్ 12 : ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషితోనే గుంతకల్లు రైల్వే డివిజన్‌కు 9 జిఎం అవార్డులు లభించినట్లు డివిజినల్ మేనేజర్ గోపీనాథ్ మాల్య అన్నారు. మంగళవారం స్థానిక రైల్వే డిఆర్‌ఎం సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో పని చేయడం ద్వారానే డివిజన్ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఇందులో భాగంగానే దక్షిణ మధ్య జనరల్ మేనేజర్ గుంతకల్లు డివిజన్‌కు దాదాపు 9 జిఎం అవార్డులు ప్రకటించారన్నారు. క్లీనింగ్ విభాగంలో గుంతకల్లు డివిజన్, సికింద్రాబాద్ డివిజన్లకు సంయుక్తంగా జిఎం అవార్డును ప్రకటించారన్నారు. అదేవిధంగా ట్రాక్ మెయింటెనెన్స్, బెస్ట్ షీల్డు ట్రాక్‌కు గుంతకల్లు, సికింద్రాబాద్‌కు, అదేవిధంగా అత్యవసర సమయాల్లో సకాలంలో స్పందించిన యక్సిడెంట్ రిలీఫ్ ట్రెయిన్, మెడికల్ రిలీఫ్ ట్రెయిన్‌లకు గుంతకల్లుకు వ్యక్తిగత అవార్డులు ప్రకటించారన్నారు. రన్నింగ్ రూం నిర్వహణలో గుంతకల్లు, రేణిగుంటలకు అవార్డు లభించిందన్నారు. మెడికల్, సెక్యూరిటీ, ఆపరేటింగ్ విబాగాలకు అవార్డులు లభించినట్లు తెలిపారు. దాదాపు 15 వేల మంది కార్మికులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారుల సమన్వయంతో పని చేయడం ద్వారానే సాధ్యమైందన్నారు. ముఖ్యంగా రేణిగుంట, గుడూరు మధ్య ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రమేష్‌కుమార్‌కు జాతీయ అవార్డు లభించిందన్నారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ఆరు జాతీయ అవార్డులు లభించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎడిఆర్‌ఎం సుబ్బరాయుడు, సీనియర్ డిపిఓ బలరామయ్య, సీనియర్ డిఇఎన్ కో ఆర్డినేషన్ మనోజ్‌కుమార్, సీనియర్ డిఒఎం వాసుదేవరావు, డిఎంఇ పవర్ వెంకటరమణ పాల్గొన్నారు.