అనంతపురం

2 నుంచి జన్మభూమి-మా ఊరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, డిసెంబర్ 12: జనవరి 2వ తేదీ నుండి జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని పది రోజులపాటు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్‌కు సూచించారు. మంగళవారం అమరావతి నుండి రాష్ట్ర ఉన్నతాధికారులు, కలెక్టర్‌తో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్ర స్థూలాదాయం, జీఎస్టీ, రియల్‌టైమ్ గవర్నెన్స్, కుటుంబ వికాసం, సామాజిక వికాసం, ఈ ప్రగతి, కిఫీర్ఫార్మెన్స్, ఇండికేటర్స్, జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలను శాస్ర్తియ దృక్ఫథంతో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. సాంకేతికను ఉపయోగించి పింఛన్లను పారదర్శకంగా, సంతృప్తి స్థాయిలో విజయవంతంగా అందించామన్నారు. వ్యవసాయం నుంచి ఉద్యానం వైపు మళ్లించడం వలన ఎక్కువ స్థూలాదాయం అందేలా 26.5 శాతం జీపీఏను సాధించామన్నారు. వివిధ రంగాల ద్వారా గత ఏడాది 11.61 శాతం వృద్ధి రేటు వుండగా ఈ ఆరు నెలలు కాలంలో 11.37 శాతం సాధించడానికి వచ్చే ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 15 శాతానికి చేరుకోవాల్సి వుందన్నారు. ప్రతి శాఖ ఏకో సిస్టమ్‌ను క్రియేట్ చేయాలన్నారు. రాష్ట్ర అధికారులు త్వరలో కలెక్టర్లతో నిర్వహించే సమాశంలో ఈ దిశా నిర్ధేశం చేసేందుకు విశే్లషణాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ టికె.రమామణి, జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆధునిక సాహిత్య పరిణామక్రమం పుస్తకావిష్కరణ
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 12: సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్‌లో పిల్లా కుమారస్వామి రచించిన ఆధునిక సాహిత్య పరిణామక్రమం, రాయలసీమ సాహిత్య పరిణామక్రమం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్జీఓ హోమ్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. రమేష్ నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రచయిత సింగమనేని నారాయణ, బండి నారాయణస్వామి, ప్రగతి, కృష్ణవేణి, ఏలూరి యంగన్న, సూర్యనారాయణరెడ్డి, నారాయణ, మల్లెల నరసింహమూర్తి, రచయిత పిళ్లాకుమారస్వామి, సుధాకర్, రసూల్ పాల్గొన్నారు.
చౌక ధరల దుకాణాల్లో పాత పద్ధతినే కొనసాగించాలి
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల స్థానంలో విలేజి మాల్స్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, పాత పద్ధతిలోనే సరుకులు ఇవ్వాలని సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. విలేజి మాల్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. టవర్‌క్లాక్ సర్కిల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో నాగేంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలు పైలట్‌లు ప్రాజెక్టుగా రేషన్ దుకాణాలను విలేజి మాల్స్‌గా ప్రారంభించారన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేస్తామన్న చంద్రబాబు ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. చౌక ధరల దుకాణాలు తొలగించేందుకే కుట్ర చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, వెంకటనారాయణ, ప్రకాష్, మసూద్, వలి, నాగప్ప పాల్గొన్నారు.
పేదలకు ఇళ్లు నిర్మించాలంటూ దీక్షలు
నగరంలోని వివిధ కాలనీల్లో నివాసముంటున్న పేదలకు ఇంటి పట్టాలు లేని వారికి పట్టాలు మంజూరు చేసి, ఎన్టీఆర్ గృహాలు నిర్మించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో సిపిఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పక్కా ఇళ్లు మంజూరు చేయాలని లేనిపక్షంలో ఈ నెల 18న కలెక్టరేట్ ముట్టడి చేపడతామన్నారు.
డీఈఓను కలసిన ఏడీపీఎస్‌ఏ నాయకులు
అనంతపురం సిటీ, డిసెంబర్ 12: జిల్లా విద్యా శాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన జనార్థనాచార్యులను అనంతపురం జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం జిల్లా నాయకులు మంగళవారం డీఈఓ కార్యాలయంలో కలసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓను కలిసిన వారిలో ఏడీపీఎస్‌ఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, గోపాల్‌రెడ్డి, నగర అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, రామచంద్ర, నాయకులు రవిచంద్రారెడ్డి, బత్తలపల్లి ఎం.మల్లేసు, విజయభాస్కర్, సిరిగల శేషాద్రిరెడ్డి, శంకర్‌రెడ్డి, చైతన్య నరేంద్ర పాల్గొన్నారు. అలాగే వైఎస్‌ఆర్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి, ఇతర నాయకులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు రఘురామిరెడ్డి, నరసింహులు, ముత్యాలప్ప, అశోక్‌కుమార్ , ఉపాధ్యాయ సత్తా జిల్లా నాయకులు గైబువలి, ఇతర ఉపాధ్యాయులు, డిప్యూటీ డీఈఓలు, కార్యాలయ సిబ్బంది కలసి శుభాకాంక్షలు తెలియజేసారు.