అనంతపురం

అడ్రస్ లేని పార్టీకి అధ్యక్షుడు రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుందుర్పి, డిసెంబర్ 12 : ఆంధ్రా లో అడ్రస్ గల్లంతైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన రఘువీరాకు ముఖ్యమం త్రి చంద్రబాబును విమర్శించే అర్హత లేదని ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఎద్దేవా చేశారు. మంగళవా రం మండంలోని బసాపురం పంచాయతీలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఆర్థిక లో టులో ఉన్నప్పటికీ ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలన్నింటీనీ చంద్రబాబు అమలు చేస్తున్నారన్నారు. ఆ యన అభివృద్ధిని ఇతర రాష్టల్రతోపా టు విదేశీయులు సైతం స్వాగతిస్తుంటే జీర్ణీంచుకోలేని రఘువీరా విమర్శించ డం తగదన్నారు. కళ్యాణదుర్గం ని యోజకవర్గంలో లక్షల్లో ఇళ్లు నిర్మించామన్నారు. కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుల పేర్లు చెప్పుకుని నాయకులు బిల్లులు మింగేసిన సంగతి కాంగ్రెస్‌కే చెల్లు అన్నారు. కళ్యాణదుర్గం అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న రఘువీరాకు ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసే సత్తా ఉందా? అని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అధిక సంఖ్యలో బాధితులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు చైర్మన్ రామాంజినేయులు, జడ్పీటీసీ మల్లికార్జున, ఎంపీపీ దీనమ్మ, వైస్ ఎంపీపీ రవి, మండల కన్వీనర్ ధనంజయలు, సర్పంచులు పెద్ద నరసింహప్ప, శివలింగ, చంద్రశేఖరాచారి, ఎంపీటీసీలు, మండల పార్టీ కన్వీనర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య
చిలమత్తూరు, డిసెంబర్ 12 : మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన సుకన్య కడుపునొప్పి తాళలేక చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై ప్రదీప్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు సుకన్య ఐదు సంవత్సరాలుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండేది. పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో మూడు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామ సమీపంలోని చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. సుకన్య కనిపించకపోవడంతో బంధువులు, చుట్టు ప్రక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం చెరువులో శవమై తేలడంతో గమణించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు చేరుకుని శవాన్ని బయటికి తీసుకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి
ఉరవకొండ, డిసెంబర్ 12 : మండలంలోని ఆమిద్యాల, రాకెట్ల గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. రాకెట్లకు చెందిన నారాయణప్ప (65), మరి కొంతమంది కలసి ఆటోలో ఉరవకొండ వైపునకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో నారాయణప్ప, ఈశ్వరమ్మకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఉరవకొండ ఆసుపత్రికి తరలించగా నారాయణప్ప పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నగేష్‌బాబు తెలిపారు.