అనంతపురం

దళారుల మాటలు నమ్మవద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, డిసెంబర్ 12 : రాష్ట్ర ంలో ఎక్కడా లేనివిధంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సాయంతో నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మీ అన్నారు. 2017-18 సంవత్సరానికి ప్రధానమంత్రి ఆయోజ్ యోజన పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు ఉన్న 1050 మంది లబ్ధిదారులకు త్వరలోనే రూ.2.50లక్షలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు అందజేయడంలో భాగంగా మంగళవారం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడం ఓ వరమన్నారు. ఎవరూ ఊహించని రీతిలో మున్సిపాల్టీకి ఇళ్లు మంజూరయ్యాయన్నారు. అయితే కొందరు దళారీలు లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరూ ఒక్క పైసా ఇవ్వనవసరం లేదు, పొరపాటున ఇప్పటికే ఇచ్చి ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేస్తే డబ్బు వాపస్ ఇప్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి మంజూరు కాని విధంగా ఇటీవలే 3,500 మందికి అదనంగా పెన్షన్లు మంజూరు కాగా 12వేల పై చిలుకు వివిధ హౌసింగ్ పథకాల కింద ఇళ్లు మంజూరు కావడం ఓ చరిత్రన్నారు. అయితే కొందరు దళారీలు లబ్ధిదారులను మభ్యపెట్టి తామే ఆన్‌లైన్ చేయించామని, అధికారుల నుంచి చైర్‌పర్సన్ దాకా మామూళ్లు ఇవ్వాలని రూ. 10వేల దాకా వసూళ్లకు పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవ్వరికీ పైసా కూడా ఇవ్వవద్దన్నారు. బాలకృష్ణ ఆశయాలకు అనుగుణంగా మున్సిపాల్టీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గతంలోని ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ పాలకవర్గం హయాంలలో ఇంతటి అభివృద్ధి జరగలేదన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపి రూ. 194 కోట్లు నిధులు మంజూరు చేయించగా పైప్‌లైన్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇంతటి అభివృద్ధి పనులకు దోహదపడుతున్న బాలకృష్ణకు రుణపడి ఉందామన్నారు. మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాయన్నారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన లబ్ధిదారులకు ప్రతి సంక్షేమ పథకం వర్తిస్తుందన్నారు. మున్సిపాల్టీలో మొదటి విడతగా ఇళ్ల స్థలాలు కలిగిన 1050 లబ్ధిదారులకు త్వరలోనే మార్కింగ్ ఇస్తామన్నారు. అదేవిధంగా ఇంటి పట్టాలు లేని పేదలకు లయోలా పాఠశాల వద్ద 118 ఎకరాల్లో 12వేల పైచిలుకు ఇళ్లు మంజూరయ్యాయన్నారు. జియో ట్యాగింగ్ పద్దతిన లబ్ధిదారులకు నేరుగా బ్యాంకుల ద్వారా నిధులు మంజూరవుతాయని, ఎవరికీ డబ్బులు ముట్ట చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రాము, మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, కుల,మతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. దివంగత ఎన్టీఆర్‌ను ఆదరించిన హిందూపురం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాలకృష్ణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. త్వరలోనే రూ. 23 కోట్లతో కూరగాయల మార్కెట్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెచ్చే విధంగా సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించరన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఏఇ ప్రవల్లిక, నాయకులు మోదా శివకుమార్, సనావుల్లా, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.