అనంతపురం

ఈశ్వరరెడ్డి హత్యకేసులో నలుగురికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి/తాడిపత్రి, ఏప్రిల్ 12 : తాడిపత్రి పట్టణానికి చెందిన ఈశ్వరరెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులకు జీవిత ఖైదుతో పాటు ప్రధాన ముద్దాయి శ్రీనివాసరెడ్డికి రూ.లక్ష విధిస్తూ గుత్తి ఎడిజె వెంకటరమణారెడ్డి మంగళవారం తీర్పు చెప్పారు. ఈశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి మంచి మిత్రులు. తాడిపత్రికి చెందిన ఈశ్వరరెడ్డి వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. దీంతో శ్రీనివాసరెడ్డి ఈశ్వరరెడ్డితో రూ.10 లక్షలు వడ్డీకి తీసుకున్నాడు. కొంతకాలం వడ్డీ సక్రమంగా చెల్లించిన శ్రీనివాసరెడ్డి అనంతరం మానేశాడు. దీంతో అసలు, వడ్డీ చెల్లించాల్సిందిగా శ్రీనివాసరెడ్డిపై ఈశ్వరెడ్డి ఒత్తిడి చేశాడు. ఈనేపథ్యంలో రోజురోజుకూ ఒత్తిడి పెంచడంతో ఈశ్వరరెడ్డిని అంతమొందించేందుకు మిత్రులతో కలసి పతకం రూపొందించాడు. ఇందులో భాగం గా 2013 జూన్ 22న ఈశ్వరరెడ్డికి చెందిన ఆర్‌ఆర్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి శ్రీనివాసరెడ్డి తన మిత్రులు రాజారెడ్డి, కేశవరెడ్డి, శ్రీనాథ్‌రెడ్డితో కలసి చేరుకుని ఒంటరిగా ఉన్న ఈశ్వరరెడ్డిని వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా నరకడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై అప్పట్లో తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జిల్లా అదనపు జడ్జి వెంకటరమణారెడ్డి హత్యకు పాల్పడిన నలుగురు నిందితులకు జీవితఖైదు విధించడంతో పాటు ప్రధాన ముద్దాయి శ్రీనివాసరెడ్డికి రూ.లక్ష జరిమానా, మిగిలిన ముగ్గురు ముద్దాయిలకు ఒక్కొక్కరికి రూ.5 వేల వంతున జరిమానా విధించారు.
న్యాయస్థానాలపై ప్రజలకు నమ్మకం పెరిగింది
తన భర్త హత్య కేసులో గుత్తి పాస్ట్‌ట్రాక్ కోర్టు జడ్జి వెంకటరమణారెడ్డి ఇచ్చిన తీర్పుతో న్యాయస్థానాలపై నమ్మకం పెరిగిందని ఈశ్వర్‌రెడ్డి భార్య ప్రభావతి అన్నారు. తననివాసంలో విలేఖరులతో ఆమె మాట్లాడుతూ తనభర్త ఈశ్వర్‌రెడ్డితో శ్రీనివాసరెడ్డి రూ.10లక్షలు అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. అప్పుగా తీసుకున్న డబ్బును ఎగవేయాలనే ఉద్దేశంతో ఈశ్వర్‌రెడ్డిని తన ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి పిలిపించి, కేశవరెడ్డి, రాజారెడ్డి, శ్రీనాథ్‌రెడ్డితో కలసి వేటకొడవళ్లతో కిరాతంగా నరికి హత్యచేశారని వాపోయింది. భర్తను హత్య చేయడంతో తమ కుటుంబానికి ఆధారం కోల్పోయామన్నారు. ఏదిఏమైనా దోషులకు శిక్షపడాలని తాము చేసిన పోరాటానికి న్యాయం జరిగిందన్నారు.