అనంతపురం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, డిసెంబర్ 16: రాష్ట్రంలో జర్నలిస్ట్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రలో భాగంగా ఎపీయూడబ్ల్యుజే ప్రతినిధులు గొట్లూరు గ్రామంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం శాలవతో సన్మానించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం జరిగిందని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు గుత్తా ప్రభాకర్‌నాయుడు, యూనియన్ నాయకులు చౌడప్ప, రామ్మూర్తి, లక్ష్మినారాయణ, రామాంజినేయులు, జయచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రహంతుల్లా రమేష్, నజీర్ పాల్గొన్నారు.
కళాశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 16: జెఎన్‌టియూ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్న ప్రతి పూర్వ విద్యార్థి కళాశాలకు ఎంతో బలమని, ప్రతి ఒక్కరు కళాశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని జేఎన్‌టియూ ఉప కులపతి ఆచార్య ఎస్.శ్రీనివాసకుమార్ తెలిపారు. శనివారం జేఎన్‌టియూ కాలేజి ఈఈఈ విభాగంలో 1988-92, 1992-96 బ్యాచ్‌కు సంబందించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి వీసీ, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా నంబర్ 1 స్థానంలోకి రావాలంటే పూర్వ విద్యార్థులే కారణమని తెలిపారు. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ప్రస్తుతం కళాశాలలోని విద్యార్థుల ప్లేస్‌మెంట్ విషయంలోను, వివిధ నైపుణ్యంల విషయంలో కళాశాలకు సహకారం అందించాలని కోరారు.
పారదర్శకపాలన అందిస్తున్నాం
అనంతపురంటౌన్, డిసెంబర్ 16: స్వీపింగ్ మిషన్ మరోసారి స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే స్వీపింగ్ మిషన్ ఫైళ్ల వ్యవహారంలో కొంతమంది అధికారుల కక్కుర్తి పనులతో కార్పొరేషన్‌కు అప్రతిష్ట తెచ్చిపెట్టింది. ఇది చాలదన్నట్లు కాంట్రాక్టర్ డీఈఈపై దాడి జరిపిన రోజు నుంచి స్వీపింగ్ మిషన్ షెడ్డుకే పరిమితం కావటంపై స్వయాన మేయర్ స్వరూప ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం కౌన్సిల్ హాలులో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో స్వీపింగ్ మిషన్‌పై పత్రికలలో వస్తున్న కథనాలకు సకాలంలో సంబంధిత అధికారులు స్పందించకపోవటం మూలాన పాలకవర్గం, ఉన్నతాధికారులు నిందలు మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ పీవీవీఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ పారదర్శక పాలన అందించటానికి మేయర్‌తో సహా అందరూ కృషి సల్పుతున్నామన్నారు. ఈ-ఆఫీసు ద్వారా సత్వరం ఫైళ్లను పరిష్కరించటానికి చర్యలు చేపట్టామన్నారు. . తర్వాత నగరంలో తాగునీటి సమస్య నెలకొనటంపై స్టాండింగ్ కమిటీ సభ్యురాలు హేమలత ప్రశ్నకు వాటర్ వర్క్స్ డీఈఈ కిష్టప్ప సమాధానమిస్తూ ఉదయం 4 గంటలపాటు రైతులకు విద్యుత్ సరఫరా చేయటం వలన పీఏబీఆర్ డ్యామ్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందన్నారు. దీనితో నీటి పంపింగ్‌కు అంతరాయం కలుగుతోందన్నారు. ఈ సమాధానంపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ మూర్తి స్పందిస్తూ విద్యుత్ కోత వేళల తర్వాత మోటార్లతో నిరంతరాయంగా పంపింగ్ చేపట్టి నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. అజెండాలో 14 ఫైనాన్స్ కమిషన్‌తో చేపట్టనున్న వివిధ డివిజన్లలోని అభివృద్ధి పనులకు సమావేశం ఆమోదం తెలిపింది.