అనంతపురం

అనంత ఆణిముత్యాలకు పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, డిసెంబర్ 16: సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 7వ అనంత ఆణిముత్యాల పురస్కార ప్రదానోత్సవం జనవరి 27న నిర్వహించనున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు జె.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చారిత్రక ప్రసిద్ధిగాంచిన పెనుకొండ పట్టణం విజయనగర సామ్రాజ్యానికి 2వ రాజధానిగా కీర్తినార్జించిందన్నారు. శ్రీకృష్ణదేవరాయల సాహితీ సౌరభాలను ఆస్వాదించిన మన గ్రామ పూర్వ వైభవాన్ని పునరుజ్జీవించాలనే సంకల్పంతో 2000 సం.లో సాహితీ గగన్ మహల్ సంస్థను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. అప్పటి నుండి ప్రతి మూడేళ్లకోసారి మన జిల్లాలో జన్మించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించి, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులను గుర్తించి 3అనంత ఆణిముత్యం2 పురస్కారంతో గౌరవించడం జరుగుతోందన్నారు. 2018 జనవరి 27న పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో 22 మందికి పురస్కార ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. సమావేశంలో శివశంకర్‌రెడ్డి, విజయకుమార్ పాల్గొన్నారు.
30న కలెక్టరేట్ ముట్టడి
అనంతపురం అర్బన్, డిసెంబర్ 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ఏర్పాటుచేసి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు సుంకన్న, జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం విలేఖరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు అక్కులప్ప మాట్లాడుతూ ప్రభుత్వం తమపై సవతి ప్రేమ చూపుతుందని దీనిని నిరసిస్తూ ఈ నెల 30న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఫక్కిరప్ప, సర్ధార్, లక్ష్మన్న పాల్గొన్నారు.

శాంతి భద్రతలపై పోలీసులు మార్చ్ఫాస్ట్
అనంతపురం అర్బన్, డిసెంబర్ 16: గత 15 రోజుల వ్యవధిలో వైసీపీకి చెందిన ధనంజయ్య యాద్‌వ్‌పై హత్యాయత్నంతోపాటు, 4 రోజులు క్రితం తపోవనంలో జనశక్తి నగర్‌కు చెందిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ సంఘ నాయకులు, స్టోర్ డీలర్ అయిన రామస్వరూపారెడ్డిని పాశవికంగా హత్య చేసిన నేపథ్యంలో శాంతి భద్రతలపై నెలకొన్న అనుమానాలను తుడిచేస్తూ శనివారం అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్ ఆధ్వర్యంలో పోలీసులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. బళ్ళారి రోడ్డు నుంచి ఆరంభించి కళ్యాణదుర్గం రోడ్డు, పాపంపేట, మబ్బుకొట్టాల, అజయ్‌గోష్ కాలనీ, చంద్రబాబు కొట్టాలలో మార్చ్ఫాస్ట్ కొనసాగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అనంతపురం రూరల్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా రౌడీయిజంతోపాటు వివిధ అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతుండటంతో వీటిని అరికట్టడానికి ప్రజలతో స్నేహ సంబంధాలు నెలకొనేలా ఈ మార్చ్ఫాస్ట్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని తమ సిబ్బందికి అందించాలని ఆయన కోరారు. మూడవ, నాల్గవ పట్టణ సిఐలు మురళీకృష్ణ, శ్యామ్‌రావ్, ఎస్‌ఐలు సత్యనారాయణ, శేఖర్, క్రాంతికుమార్, జయపాల్‌రెడ్డి, రెండవ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
2నారుూ బ్రాహ్మణులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 16: ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నారుూ బ్రాహ్మణులను ఎస్సీ జాబితాలో చేర్చాలని నారుూ బ్రాహ్మణ వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెనకచెర్ల బాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీలు నారుూ బ్రాహ్మణులను కేవలం ఓట్ల కోసం వాడుకుంటున్నారే తప్పా వారి సంక్షేమం పట్టడం లేదని మండిపడ్డారు. నారుూ బ్రాహ్మణులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 19వ తేదీన నగరంలో ర్యాలీ నిర్వహించి, సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గోవిందు, రవికుమార్, మన్నీల రామాంజినేయులు, నారప్ప, రామాంజినేయులు, మనోహర్ పాల్గొన్నారు.