అనంతపురం

విజయ పబ్లిక్ స్కూల్‌కు షోకాజ్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, డిసెంబర్ 16: విద్యార్థులను చితకబాదుతున్నారని ఫిర్యాదుతో శనివారం జిల్లా విద్యా శాఖాధికారి జనార్థనాచార్యులు నగరంలోని విజయ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించారు. గత కొంత కాలంగా పీఈటీగా పనిచేస్తున్న టీచర్ విద్యార్థులను కొట్టడం వీడియో తీసి ప్రసారమాధ్యమాల్లో రావడంతో దీనిపై విద్యా శాఖ కమిషనర్ స్పందించి డీఈఓను స్కూల్‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు. దీంతో శనివారం డీఈఓ, ఎంఈఓలు స్కూల్‌ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీఈఓ స్కూల్ యాజమాన్యాన్ని మందలిస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని షోకాజ్ నోటీలు జారీ చేశారు.
వైభవంగా అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవాలు
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 16: మొదటి రోడ్డు శ్రీ కాశీవిశే్వశ్వర కోదండ రామాలయంలో శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. కె.గంగిరెడ్డి, కె.పద్మజ దంపతుల ఆధ్వర్యంలో లక్ష పుష్పార్చన చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప మాలధారులు, భక్తులు అధిక సంఖ్యలో పూజలలో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలతోపాటు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పి.ఓబిలేసు, కమిటీ సభ్యులు స్వప్న, శ్రీనివాసులు, నరసింహమూర్తి, మాణిక్యం, ఆంజనేయులు, ఈవో నాగేంద్రరావు, ప్రధాన అర్చకులు సుబ్రమణ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ అభివృద్ధే ఆర్పీఎస్ ధ్యేయం
* ఆర్పీయస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమోహన్
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 16: వెనుకబడిన రాయలసీమ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా, ప్రత్యేక రాయలసీమ సాధన కోసం రాయలసీమ పరిరక్షణ సమితి ( ఆర్పీయస్ ) పనిచేస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపు చంద్రమోహన్ పేర్కొన్నారు. ఈమేరకు శారదా నగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలేవీ రాయలసీమ అభివృద్ధి గురించి ఆలోచించడం లేదన్నారు. ముఖ్యమంత్రులుగా రాయలసీమ ప్రాంతం వారే ఉన్నా రాయలసీమకు సాగునీరు, పరిశ్రమల ఏర్పాటుచేయడం లేదన్నారు. రాయలసీమకు నిధులు, హక్కుల కోసం ఆర్పీయస్ పోరాటం సాగిస్తోందన్నారు. రాయలసీమ అభివృద్ధిని కాంక్షించే వారంతా ఆర్పీయస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కమిటీని ఎంపిక చేశారు. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా జి సరస్వతి, ఉపాధ్యక్షురాలిగా పల్లప లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా ఎగ్గిడి ధనమ్మ, కార్యదర్శిగా వి.లలితలను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందచేశారు.
జిల్లాలో 2046 కుష్ఠు వ్యాధి కేసులు నమోదు
అనంతపురం అర్బన్, డిసెంబర్ 16: జిల్లా వ్యాప్తంగా కుష్ఠు వ్యాధి బాధితులను గుర్తించే కార్యక్రమంలో ఇప్పటి వరకు 2046 మంది అనుమానాస్పద కేసులుగా నమోదు చేయటం జరిగిందన్నారు. ఇందులో 80 కేసులను కుష్ఠు వ్యాధి కేసులుగా నిర్థారణ అయిన నేపథ్యంలో వీరందరికీ ఎండీటీ చికిత్స అందించటం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనిల్‌కుమార్ తెలిపారు. శనివారం ఇందుకు సంబంధించి ఓ ప్రకటన విడదల చేశారు. జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13 నుంచి 26 వరకు కుష్ఠు వ్యాధి కేసులు గుర్తించేందుకు తమ సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 8.54 లక్షల గృహాలను సందర్శించటం జరిగిందన్నారు. ఇందులో 2046 కేసులు అనుమానాస్పద కేసులుగా నమోదు అయ్యాయని, 80 కేసులు కుష్ఠు వ్యాధి అనే నిర్థారణ కావటం జరిగిందన్నారు. ఈ జబ్బు ఉన్న వ్యిక్తి నుంచి సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వ్యాపించే అవకాశం ఉందన్నారు. వ్యాధి నిరోధానికి ప్రభుత్వం కొత్తగా వ్యాధి ఉన్న వ్యక్తితో సన్నిహితంగా మెలిగే కుటుంబ సభ్యలందరికీ రిపామైసి అనే మందును అందించటం జరుగుతుందన్నారు.