అనంతపురం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, డిసెంబర్ 16 : మండల పరిధిలోని కొడికొండ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ప్రదీప్‌కుమార్ తెలిపిన మేరకు వివరాల మేరకు మరసలపల్లికి చెందిన రామాంజినేయులు గోరంట్లకు వెళ్లి తిరిగి వస్తుండగా కొడికొండ చెక్‌పోస్టు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లేందుకు రహదారిని దాటుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో రామాంజినేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి
కంబదూరు, డిసెంబర్ 16 : మండల పరిధిలోని వై.సి.పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు కళ్యాణదుర్గం నుంచి వస్తున్న బస్తున్న బస్సు, ధర్మవరం నుంచి ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న విజయ్‌కృష్ణ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. తిప్పు, విష్ణుసుదర్శన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నరసింహులు తెలిపారు.
లారీ ఢీ.. వృద్ధురాలి దుర్మరణం
హిందూపురం, డిసెంబర్ 16 : ఇటీవలే ద్విచక్ర వాహనంలో వివాహానికి వెళ్లి వస్తూ కుమార్తె, అల్లుడు మృతి చెందగా శనివారం హిందూపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందడం కుటుంబంలో విషాదం నెలకొంది. లేపాక్షి మండలం గొంగటిపల్లికి చెందిన లక్ష్మీదేవమ్మ (58) వైద్య పరీక్షల నిమిత్తం శనివారం ఉదయం పట్టణానికి రాగా అంబేద్కర్ సర్కిల్లో సిమెంట్ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రగాయాలపాలు కావడంతో స్థానికులు పక్కనే ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఇకపోతే లక్ష్మీదేవమ్మ కుమార్తె కృష్ణవేణమ్మ, అల్లుడు శంకరప్ప ఇటీవలే బంధువుల వివాహానికి వెళ్లి ద్విచక్ర వాహనంలో వస్తుండగా చోళసముద్రం వద్ద ఓ ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో దుర్మరణం చెందారు. ఈ ఘటన మరవకముందే లక్ష్మీదేవమ్మ మృతితో కుటుంబాన్ని విషాదంలో నింపింది. ఇకపోతే లక్ష్మీదేవమ్మ వెనక వెళ్తున్న మోతుకపల్లికి చెందిన హేమమాలిని తృటిలో లారీ ప్రమాదం నుండి తప్పించుకుది. స్థానిక ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న హేమమాలిని కంప్యూటర్ కోర్సు కోసం రోజు వారీగా పట్టణానికి విచ్చేయగా అంబేద్కర్ సర్కిల్ వద్ద సిమెంట్ లారీ వేగంగా రాగా లక్ష్మీదేవమ్మ ప్రమాదానికి గురికాగా వెనకాలే ఉన్న ఆ విద్యార్థిని ప్రమాదాన్ని గమనించి ఒక్కసారిగా పక్కకు ఎగిరింది. దీంతో కిందకు పడి నడుం, కాలికి గాయాలకు గురైంది. అయితే హేమామాలిని అప్రమత్తం కావడంతో లారీ ప్రమాదం నుండి బయటకు పడింది. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి డీఎస్సీలోను పీఈటీలకు అన్యాయం
అనంతపురం సిటీ, డిసెంబర్ 16: ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో పీఈటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎస్కేయూ మెయిన్ గేట్ వద్ద ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల అధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 29ని తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ప్రతి స్కూల్‌లోను క్రీడలను నిర్వహించడానికి అవసరమైన పీఈటీలను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈడీ విద్యార్థులు పాల్గొన్నారు.
రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టటం శుభపరిణామం
అనంతపురంటౌన్, డిసెంబర్ 16: ఎఐసిసి అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ పదవీ బాధ్యతలు చేపట్టటం శుభపరిణామమంటూ శనివారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావుకాంగ్రెస్ భవన్ వద్ద నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నేతలు కోటా సత్యం, దాదాగాంధీ, కొండారెడ్డి, సత్యనారాయణ, హరి, కృష్ణ, శివ పాల్గొన్నారు.