అనంతపురం

రోడ్డు ప్రమాదాల నివారణకు పంచ సూత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జనవరి 14: రోడ్డు ప్రమాదాల నివారణకు పంచ సూత్రాలు ఖచ్చితంగా అమలుచేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గత పక్షం రోజుల్లో పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పురోగతిపై ఆదివారం ఆయన తన కార్యాలయంలో సమీక్షించారు. గణాంకాలను పత్రికా ప్రకటనకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల సందర్శన సమయంలో నిర్వహించే గ్రామ సభల్లో ఫ్యాక్షన్, మట్కా, తదితర అంశాలతోపాటు రోడ్డు భద్రతపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. జిల్లాలో రోడ్డు భద్రత కోసం రూపొందించిన పంచ సూత్రాలు పక్కాగా అమలుచేయాలన్నారు. గత పక్షం రోజుల్లో స్పెషల్ డ్రైవ్‌లో పోలీసులు భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు నడిపిన వారిపై మొత్తం 18,354 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఇందులో ప్రధానంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 11,558 కేసులు అత్యధికంగా నమోదు అయినట్లు తెలిపారు. మైనర్లపై 24 కేసులు, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడిపిన చోదకులపై 159, వాహనాలకు సంబంధించి రికార్డులు లేని వారు 1219 కేసులు, త్రిబుల్ రైడింగ్ 698, ఓవర్ లోడ్‌తో వెళ్లే ఆటోలు 30 ఐపీసీ కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. సీట్‌బెల్ట్ ధరించకుండా వెళ్తున్న కార్లు, జీపులు తదితర వాహన చోదకులు 2,713 కేసులు, రాంగ్‌రూట్ వెళ్లిన వాహన చోదకులు 165 మందిపై కేసులు, అతివేగంతో వెళ్లిన వాహనాలు 352, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 310 నమోదు చేయటం జరిగిందన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి పోలీసులకు జిల్లా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఎక్కడైన రోడ్డు ప్రమాదాలు జరిగినా డయల్- 100, పోలీస్ వాట్సప్ నంబర్ 9989819191కు సమాచారం చేరవేయాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఉరవకొండ, జనవరి 14 : మండలంలోని బూదగవి గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చాకలి తిమ్మప్ప(24) మృతి చెందాడు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు బూదగవికి చెందిన తిమ్మప్పను బళ్లారి నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేష్‌బాబు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పెనుకొండ, జనవరి 14 : మండల పరిధిలోని వెంకటరెడ్డిపల్లి సమీపంలో నాలుగు లైన్ల జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన దివాకర్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని స్నేహితుడు కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన మహబూబ్‌బాషా తీవ్రగాయాలకు గురయ్యాడు. బెంగళూరు నుంచి అనంతపురం ద్విచక్ర వాహనంలో వెళ్తూ వెంకటరెడ్డిపల్లి వద్ద హిందూపురం తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేస్తున్న పైపులైన్‌ను ఢీకొనడంతో దివాకర్ మృతి చెందాడు. తీవ్ర గాయాలకు గురైన మహబూబ్‌బాషాను చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్, ద్విచక్ర వాహనం డీ.. విద్యార్థి మృతి
పామిడి, జనవరి 14 : పామిడి స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం ట్రాక్టర్ ద్విచక్రవాహనం ఢీకొనండంతో విద్యార్థి తరుణ్ (12) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని సొరకాయలపేటకు చెందిన మునీంద్ర, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు తరుణ్ గార్లదినె్న అక్షర ఇంటర్నేషనల్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి పండుగకు స్కూల్‌కు సెలవులు ఇవ్వటంతో చిన్నాన్న రాజుతో కలిసి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి వస్తుండగా పామిడి స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద కట్టెల లోడుతో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ తగలడంతో తరుణ్‌కు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజు హెల్మెట్ ధరించిన కారణంగా స్వల్పంగా గాయపడ్డాడన్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పండుగకు కుమారుడు ఇంటికి వస్తున్నాడంటూ సంతోషంగా ఉన్న తల్లిదండ్రులు బిడ్డ మృతి చెందిన విషయం తెలిసి తల్లడిల్లిపోయారు.