అనంతపురం

ఉట్టిపడిన సంక్రాంతి శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 14 : నిత్యం కరవు దృశ్యాలతో దర్శనమిచ్చే జిల్లాలోని పల్లెలు సంక్రాంతి శోభను సందరించుకున్నాయి. జిల్లా నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, కర్ణాటక, చెన్నై, తెలంగాణకు ఉద్యోగాలు, ఉపాధి, విద్యాభ్యాసం కోసం వెళ్లిన కుటుంబ సభ్యులు, బంధువులు సొంతూళ్లకు చేరుకుని భోగి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. కాగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా (సోమవారం ఆప్షనల్ హాలిడే) సెలవులు రావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు కలిసి వచ్చినట్లయింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వెసులుబాటు చూసుకుని సంక్రాంతికి ఇళ్లకు చేరుకుంటున్నారు. రైల్వే, ఆర్మీ, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, నేవీ, ఎయిర్‌ఫోర్స్ తదితర కేంద్ర ప్రభుత్వ, రక్షణరంగాలు, పారా మిలిటరీ దళాలకు చెందిన సిబ్బంది ప్రత్యేక సెలవుపై సొంతూళ్లకు వచ్చారు. అయితే జిల్లా కేంద్రం, పట్టణాలు, మండల కేంద్రాలకు చేరిన వారు వారి ఊళ్లకు వెళ్లడానికి మాత్రం సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడ్డారు. అధిక భాగం ఆటోలపై ఆధార పడాల్సి వచ్చింది. దీనికితోడు అదనపు చార్జీల మోతతో రెండింతలు సొమ్ము చెల్లించాల్సి వచ్చిందని ప్రయాణికులు వాపోయారు. కాగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి తదితర పట్టణాలు, నగరాల నుంచి జిల్లాకు చేరే వారి కోసం అనంతపురం ఆర్టీసీ రీజియన్ అధికారులు ఈనెల 9 నుంచే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించారు. గతేడాది రెండు, మూడు నెలల క్రితం భారీగా వివాహాలు జరిగిన నేపథ్యంలో కొత్త జంటలతో అల్లుళ్లు, కూతుళ్లను పుట్టింటికి పిలిపించుకుని సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను తూతూమంత్రంగా నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మారుమూల గ్రామాల్లో పండగ వాతావరణం అంతగా కనిపించలేదని, పంటలు సరిగా పండక పోవడం, కరవు పరిస్థితుల కారణంగా నామమాత్రంగా పండుగ జరుపుకోవడం విశేషం.