అనంతపురం

పుట్టపర్తి శిల్పారామంలో ఘనంగా సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, జనవరి 14: భోగ భాగ్యాలతో తెలుగు ప్రజలందరూ చల్లగా వుండాలని ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డి ఆకాంక్షించారు. పుట్టపర్తి శిల్పారామంలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని సహజ సుందర వాతావరణంలోని శిల్పారామంలో తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను మేళవించి వివిధ కార్యక్రమాలు అంగరంగవైభవంగా నిర్వహించారు. మహిళలు సంక్రాంతి ముగ్గుల పోటీలతో మొదలుపెట్టి నూతన వస్త్రాలు ధరించి తెలుగు సంస్కృతిని చాటిచెబుతూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. భరత నాట్యం, కూచిపూడి నాట్యాలు, క్లాసికల్ డ్యాన్స్, ఫోక్‌డ్యాన్స్, నృత్యాలు, గురవయ్య నృత్యాలు, చెక్క భజనలు, పండరీ భజనలు, పల్లె సుద్దులు, ఎంకి పాటలు, జానపద గేయాలు ఆలపించారు. నిట్టూరు రామ్మూర్తి ధుర్యోదన ఏకపాత్రాభినయం ఆహుతులను అలరించింది. విజయవాడకు చెందిన శాంతి అకాడమీ, తిరుపతికి చెందిన పవర్ అకాడమీ, కడపకు చెందిన కళాకారులు, నృత్యాలు, ఆటపాటలు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా విచ్చేసిన పల్లె రఘునాథరెడ్డి కళాకారులలో ప్రతిభకనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. వారినుద్దేశించి పల్లె మాట్లాడుతూ దేశ సంస్కృతుల్లోకెల్లా తెలుగు సంస్కృతి భిన్నమైందని, అందరికి ఆదర్శవంతమైన మన సంస్కృతిని చాటిచెప్పేందుకు శిల్పారామం వేదికైందన్నారు. ఆరుగాలం శ్రమించిన రైతన్న తాను పండించిన పంటలు, ధాన్యం, సిరి ఇంటికి చేరి ఏడాది పొడవునా వారి కుటుంబాల్లో భోగభాగ్యాలను నింపాలని భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా వుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ ఖాజామోహిద్దీన్, ఆర్డీఓ రామ్మోహన్, మున్సిపల్ చైర్మన్ బెస్త చలపతి, పుడా చైర్మన్ కడియాల సుధాకర్‌నాయుడు, టీడీపీ కన్వీనర్ రామాంజనేయులు, కౌన్సిలర్లు, శిల్పారామం ఏఓ రమేష్‌రెడ్డి, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నెట్టికంటిని దర్శించుకున్న ప్రముఖులు
గుంతకల్లు, జనవరి 14 : శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు ఉమాదేవి, రంగారాం ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. తర్వాత దుశ్శాలువాలు, పూలమాలలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ముత్యాలరావు, ఎఈఓ మధు, ఆలయ ప్రధాన అర్చకులు గరుడాచార్యులు, ట్రస్టు బోర్డు చైర్మన్ సుగుణమ్మ, సభ్యులు రామలింగ, చెల్లూరు నరసింహులు, మహేష్, జగదీష్ ప్రసాద్ శారడా, వనగొంది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.