అనంతపురం

టీడీపీతోనే వాల్మీకుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళగుప్ప, ఫిబ్రవరి 25 : తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే వాల్మీకులు అభివృద్ధి సాధించారని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోనంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వాల్మీకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్థాపించిన టీడీపీతోనే అభివృద్ధి సాధించారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వాల్మీకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్న మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఇతర కులాల ఒత్తిళ్లు పెరిగినా బెదరకుండా అధిగమించి అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారన్నారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సుబ్రమణ్యం కమిషన్‌తో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు వీలులేదన్నారు. అయితే నేడు ఏడు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన వాల్మీకుల జీవితాలపై అనే్వషణ చేసి చరిత్రను తిరగేసి మేథావుల చేత పరిశీలించి దేశంలో 33 గిరిజన తెగలను పరిశీలించి కట్టుదిట్టంగా నివేదికలు తయారు చేసి తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. ఐకమత్యంతోనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాల్మీకులను ఎస్టీలను చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. వాల్మీకులందరూ ప్రస్తుత సమాజంలో అంతరించి పోతున్న నైతిక విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్సీ చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాముడు చరిత్రను రామాయణంగా మలచి కుటుంబాలు, మనుషుల మధ్య విలువలను తెలిపిన మహానుభావుడు వాల్మీకి అన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సామ్రాజ్యాల విస్తరణకు వాల్మీకుల కృషి ఎనలేనిదన్నారు. అంతటి గొప్ప మహానుభావుడు అడుగుజాడల్లో వాల్మీకులు నడవాలన్నారు. వాల్మీకులకు ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యత టీడీపీ కల్పించిందన్నారు. జడ్పీ చైర్మన్ పూల నాగరాజు మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థపై మార్గదర్శకం చూపిన దైవం వాల్మీకి మహార్షి అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదానికి కృషి చేసిన మంత్రి కాలవ, శాసనమండలి చీఫ్ విప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.