అనంతపురం

సాంకేతిక విషయాలను తెలుసుకునేందుకే ఫిక్సల్ 2కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, మార్చి 22: విద్యార్థులు సాంకేతిక విషయాలను, నైపుణ్యతను పెంపొందించేందుకే ఫిక్సల్ 2కే-18 కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని జేఎన్‌టియూ ఉప కులపతి ఆచార్య శ్రీనివాసకుమార్ తెలిపారు. గురువారం జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజి కంప్యూటర్ సైన్సు విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల ఫిక్సల్ 2కే-18 జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎస్‌ఈలోని అధునాతన సాంకేతిక విషయాలను వివరిస్తూ సమాజానికి వాటి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అధునాతన సాంకేతిక అంశాలపై సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా, ఐఓటీ, ఆర్ట్ఫిసియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్‌లను తెలుసుకోవాలన్నారు. అనంతరం ఫిక్సల్ 2కే18 సావనీర్‌ను విడుదల చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ముద్దలాపురం ఫిల్ట్రేషన్ ప్లాంట్, డిస్ట్రిబ్యూషన్ లైను పరిశీలన
* పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ శ్రీనాథరెడ్డి
అనంతపురంటౌన్, మార్చి 22: నగరానికి శుద్ధి చేసిన రక్షిత నీటిని అందించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తటంతో గురువారం పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ శ్రీనాథరెడ్డి ముద్దలాపురం ఫిల్ట్రేషన్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఫిల్ట్రేషన్ ప్లాంట్‌లో పనిచేయని క్లారిఫ్లాక్యులేటర్లను ఆయన పరిశీలించారు. ఆలం మిక్సింగ్ యూనిట్‌ను పరిశీలించారు. ఉన్న నాలుగింటిలో రెండు మాత్రమే పనిచేస్తుండటం గుర్తించారు. ఏరేటర్ వద్ద ఆలం మిక్సింగ్‌ను పరిశీలించారు. ఎయిర్ బ్లోయర్స్ రెండింటిలో ఒకటి మాత్రమే పనిచేస్తుండటం గుర్తించారు. ఆలంతోపాటు క్లోరినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించారు. తర్వాత నగరంలో జరుగుతున్న డిస్ట్రిబ్యూషన్ పైపులైను పనులను పరిశీలించారు. పైపులైను పనులకు తవ్విన గుంతలను ఆలస్యం లేకుండా పూడ్చి వేసి గుంతలు లేకుండా చూడాలని సూచించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పనులు చేపట్టే సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చి వేసి పనులు కొనసాగించాలని అన్నారు. ఎక్కువ మంది కూలీలను వినియోగించాలని ఆదేశించారు.

పీఏబీఆర్ డ్యామ్‌లో తాగునీటి
పంపింగ్‌కు ప్రత్యేక విద్యుత్ లైను
అనంతపురంటౌన్, మార్చి 22: నగరానికి తాగునీటి సరఫరాలో విద్యుత్ హెచ్చు తగ్గులను నివారించటానికి ప్రత్యేక లైనును విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిందని వాటర్ వర్క్స్ ఈఈ రామ్మోహనరెడ్డి తెలిపారు. పీఏబీఆర్ డ్యామ్‌లో విద్యుత్ సరఫరాలో లోఓల్టేజీ కారణంగా తాగునీటి పంపింగ్‌కు ఇటీవలి కాలంలో తరచూ అంతరాయం కలుగుతోంది. లో ఓల్టేజీ కారణంగా మోటార్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించటానికి కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ప్రత్యేక లైనుతోపాటు పవర్ బాక్స్ ఏర్పాటుచేయటానికి రూ.4 లక్షలు విద్యుత్ శాఖకు చెల్లించారు. దీనితో ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయటంతోపాటు 6.6 కేవీ విద్యుత్ లైనును గురువారం అమర్చారు. దీనితో ఇకపై విద్యుత్‌లో హెచ్చుతగ్గులను నివారించటంతోపాటు నిరంతర నీటి పంపింగ్‌కు మార్గం సుగమమైంది. కొత్తగా ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్, పవర్‌బాక్స్‌ను ఈఈ రామ్మోహనరెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉన్న మూడు మోటార్లలో ప్రస్తుతం రెండు మోటార్లు పనిచేస్తున్నాయన్నారు. మూడో మోటారును కూడా మరమ్మతు చేసి రన్నింగ్ కండిషన్‌లోకి తెస్తున్నామన్నారు. వేసవిలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.